English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்

రూ. 500 నుంచి మొద‌ల‌య్యే ఉత్త‌మ సిప్‌లు

Written By: Chandrasekhar
Subscribe to GoodReturns Telugu

నెల‌వారీ క్ర‌మంగా పెట్టుబ‌డులు పెట్టేందుకు సిప్‌లు బాగా ఉపయోగ‌ప‌డ‌తాయి. గ‌త మూడేళ్ల‌లో చూస్తే బ్యాంకు డిపాజిట్ల క‌న్నా సిప్‌(క్ర‌మానుగ‌త పెట్టుబ‌డి ప‌థ‌కాలు)లు మంచి రాబ‌డిని అందించాయి. అంతే కాకుండా ప‌న్ను ప్ర‌యోజ‌నాల ప‌రంగా చూసినా మ్యూచువ‌ల్ ఫండ్ సిప్‌లు ఉత్త‌మం. ఇక్క‌డ మంచి ప‌నితీరు, రాబ‌డి క‌లిగిన సిప్‌ల గురించి ఇస్తున్నాం. ప్ర‌తి నెలా చిన్న మొత్తంలో పెట్టుబ‌డి పెడుతూ దీర్ఘ‌కాలంలో మంచి రాబ‌డులు పొందేందుకు ఇవి ఉప‌యోగ‌ప‌డ‌గ‌ల‌వేమో చూడండి.

 ఎస్‌బీఐ బ్లూచిప్ ఫండ్‌

ఎస్‌బీఐ బ్లూచిప్ ఫండ్‌

ఈ ఫండ్ 2006 జ‌న‌వ‌రి,20న ప్రారంభ‌మైంది. ఇది ఒక ఒపెన్ ఎండెడ్ ఫండ్‌. దీని నిక‌ర ఆస్తులు డిసెంబ‌రు,31-2016 నాటికి రూ. 5,82,499 ల‌క్ష‌లుగా ఉన్నాయి. గ‌త మూడు సంవ‌త్స‌రాల్లో ఈ ఫండ్ రాబడి 21.10%గా ఉంది. ఎస్‌బీఐ బ్లూచిప్ ఫండ్లో మీరు రూ. 500 నుంచి మొద‌లుకొని పెట్టుబ‌డి పెట్టే వీలుంది. ఈ ఫండ్ నెట్ అసెట్ వాల్యూ(ఎన్ఏవీ) 32.22 రూపాయలుగా ఉంది. ఈ ఫండ్ సీబీఎల్వో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎల్ అండ్ టీ, ఇన్పోసిస్‌, నెస్లే లిమిటెడ్‌ల‌లో ఎక్కువ పెట్టుబ‌డుల‌ను పెట్టింది.

మిశ్ర‌మ పెట్టుబ‌డులు 14.52 శాతంగా ఉండ‌గా; బ‌్యాంక్‌ల్లో 11.48%, ఫార్మా అండ్ డ్ర‌గ్స్‌లో 8.21%, చ‌మురు,స‌హ‌జ‌వాయు రంగాల్లో 7.33%, ఐటీ రంగంలో 6.1% పెట్టుబ‌డుల‌ను వైవీధ్యీక‌రించింది.

రిల‌య‌న్స్ టాప్‌-200 ఫండ్‌-రిటైల్ ప్లాన్‌

రిల‌య‌న్స్ టాప్‌-200 ఫండ్‌-రిటైల్ ప్లాన్‌

లార్జ్ క్యాప్ ఫండ్ల‌లో ఈ ఫండ్‌కు క్రిసిల్ 3వ ర్యాంకు ఇచ్చింది. ఈ ఫండ్ 2007 ఆగ‌స్ట్‌లో మొదలైంది. క‌నీస పెట్టుబ‌డి రూ.5000 నుంచి మొద‌లుపెట్ట‌వ‌చ్చు. నెల‌వారీ క‌నీస సిప్ మొత్తం రూ. 100 నుంచి ప్రారంభించ‌వ‌చ్చు. ప్ర‌తి సారి అద‌న‌పు పెట్టుబ‌డి క‌నీసం రూ. 1000 లేదా అంత‌క‌న్నా ఎక్కువ ఉండాలి. గ‌త మూడేళ్ల‌లో ఈ ఫండ్ 20.58% రిట‌ర్నుల‌ను ఇస్తోంది. గ్రోత్ ప్లాన్‌లో ఈ ఫండ్ ఎన్ఏవీ రూ. 26.54గా ఉంది. ఫండ్ పెట్టుబ‌డులు ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, ఇన్ఫోసిస్‌,ఐటీసీ, ఎల్ అండ్ టీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యెస్ బ్యాంక్‌ వంటి వాటిల్లో ఉన్నాయి. ఈ మ్యూచువ‌ల్ ఫండ్‌ బ్యాంకింగ్ లేదా ఫైనాన్స్ రంగం(30.19%),ఆటోమోటివ్‌(11.36%), ‌చ‌మురు,స‌హ‌జ‌వాయు(10.89%) రంగాల్లో ఎక్కువ పెట్టుబ‌డులు క‌లిగి ఉంది.

ఎస్‌బీఐ మాగ్న‌మ్ ఈక్విటీ ఫండ్‌

ఎస్‌బీఐ మాగ్న‌మ్ ఈక్విటీ ఫండ్‌

మంచి రాబ‌డులను అందిస్తున్న వాటిలో ఎస్బీఐ మాగ్న‌మ్ ఈక్విటీ ఫండ్ మ‌రొక‌టి. గ‌త మూడేళ్ల‌లో ఈ ఫండ్ 17.96% రాబ‌డుల‌ను ఇచ్చింది. ఇది బ్యాంకు డిపాజిట్ల‌లో వ‌చ్చే రాబ‌డుల కంటే దాదాపు రెండింత‌లు. ఈ స్కీమ్‌లో మీరు క‌నీస పెట్టుబ‌డి రూ.500 నుంచి మొద‌లుపెట్ట‌వ‌చ్చు. ఈ ఫండ్(గ్రోత్) ఎన్ఏవీ రూ. 82.57గా ఉంది. ఈ ఫండ్ నిర్వ‌హ‌ణ కింద డిసెంబ‌రు నాటికి రూ. 87,537 ల‌క్ష‌ల ఆస్తులున్నాయి. టాప్ 5 హోల్డింగ్స్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇన్ఫోసిస్ లిమిటెడ్‌, ఎస్‌బీఐ, హెచ్‌సీఎల్ టెక్నాల‌జీస్ లిమిటెడ్‌, రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్‌ల్లో ఉన్నాయి.

 రిల‌య‌న్స్ ఫోక‌స్‌డ్ లార్జ్ క్యాప్ ఫండ్‌

రిల‌య‌న్స్ ఫోక‌స్‌డ్ లార్జ్ క్యాప్ ఫండ్‌

ఈ ఫండ్(డివిడెండ్‌) ఎన్ఏవీ శుక్ర‌వారం నాటికి రూ. 17.73గా ఉంది. గ్రోత్ ఫండ్ ఎన్ఏవీ రూ. 26.1042గా ఉంది. ఇందులో క‌నీస పెట్టుబ‌డి రూ. 100 నుంచి మొద‌ల‌వుతుంది. గ‌త మూడేళ్ల‌లో ఈ ఫండ్ 27.25% రాబ‌డుల‌ను ఇచ్చింది. ఈ ఫండ్ పెట్టుబ‌డులు ఎక్కువ‌గా మారుతి సుజుకి, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, లార్స‌న్ అండ్ ట‌ర్బో, ఎస్‌బీఐ, ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్‌ల్లో ఉన్నాయి.

ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ ఫోక‌స్డ్ బ్లూచిప్ ఈక్విటీ

ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ ఫోక‌స్డ్ బ్లూచిప్ ఈక్విటీ

గ‌త సంవ‌త్స‌ర కాలంలో 26.47%, 3 ఏళ్ల‌లో 18.43%, 5 ఏళ్ల కాలంలో 15% రాబ‌డులనిచ్చిన ఈ ఫండ్ సైతం బాగానే ఉంది. క‌నీసం రూ. 500 తో సిప్‌ను ప్రారంభించ‌వ‌చ్చు. గ్రోత్ ప్లాన్‌లో నెట్ అసెట్ వాల్యూ(ఎన్ఏవీ)రూ.33.45. డివిడెండ్ ప్లాన్‌లో ఎన్ఏవీ రూ. 21.05.

ఈ ఫండ్ టాప్‌-5 హోల్డింగ్స్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, బ‌జాజ్ ఫిన్ స‌ర్వ్, ఎస్‌బీఐ ఉన్నాయి.

ఇన్వెస్కో ఇండియా గ్రోత్ ఫండ్‌

ఇన్వెస్కో ఇండియా గ్రోత్ ఫండ్‌

ఈ ఫండ్‌లో మీరు రూ. 500 నుంచి మొద‌లుకొని క్ర‌మానుగ‌త పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు. ఈ ఫండ్ పెట్టుబ‌డులు పెట్టిన సంస్థ‌ల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐటీసీ, మారుతి సుజుకి ఉన్నాయి. గ‌త మూడేళ్ల‌లో ఈ ఫండ్ 18.85 శాతం రాబ‌డుల‌నిచ్చింది. ఈ ఫండ్ ప్ర‌స్తుత ఎన్ఏవీ(డివిడెండ్‌) రూ.13.99గా ఉంది.

డీఎస్‌పీ బ్లాక్ రాక్ మైక్రో క్యాప్ ఫండ్

డీఎస్‌పీ బ్లాక్ రాక్ మైక్రో క్యాప్ ఫండ్

ఈ ఫండ్(గ్రోత్‌) ఎన్ఏవీ రూ. 54.472గా ఉంది. ఇది ఈక్విటీ స్మాల్ క్యాప్ ఫండ్‌. జ‌న‌వ‌రి 31,2017 నాటికి ఫండ్ ఆస్తులు 4751 కోట్ల రూపాయ‌లుగా ఉన్నాయి. ఫండ్ రాబ‌డులు గ‌త మూడేళ్ల కాలంలో 42.95 శాతంగా ఉన్నాయి. టాప్-5 హోల్డింగ్స్ శార‌దా క్రాప్కెమ్‌, ఎస్ఆర్‌ఎఫ్‌, అతుల్‌, కేపీఆర్ మిల్స్, రెప్కో హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఉన్నాయి. ఇందులో క‌నీస పెట్టుబ‌డి రూ. 500 నుంచి మొద‌ల‌వుతుంది.

డిస్‌క్లెయిమ‌ర్‌

డిస్‌క్లెయిమ‌ర్‌

ఈ క‌థ‌నం కేవ‌లం స‌మాచారం కోసం మాత్ర‌మే. ఫండ్ కొనేందుకు లేదా అమ్మేందుకు స‌లహా ఇచ్చేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని దీన్నే ఆధారంగా ఉంచుకోవ‌చ్చ‌ని భ‌రోసా ఇవ్వ‌లేం. దీని ఆధారంగా మీరు నిర్ణ‌యం తీసుకొని న‌ష్ట‌పోతే గ్రేనియం ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీస్ ప్రైవేట్ లిమిటెడ్‌, దాని అనుబంధ సంస్థ‌లు, ఈ క‌థ‌నం రాసిన‌వారు ఎవ‌రు బాధ్య‌త వ‌హించ‌రు. అన్ని విచారించి నిర్ణ‌యం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.

English summary

8 Best SIPs Where You Can Invest Small Amounts Of Rs 500

best sip, systematic investment plan for mutual fund investments, MF, మ్యూచువ‌ల్ ఫండ్ సిప్‌It is always difficult to highlight which is the best SIP that an investor should bet on. If today one SIP has yielded good results, tomorrow it could be down. No SIP has been the best performer year after year.
Please Wait while comments are loading...
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC