English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்

మొద‌టిసారి ఇల్లు కొంటున్నారా? రూ. 2.4 ల‌క్ష‌లు త‌క్కువ‌కే వ‌స్తుంది!

Written By: Chandrasekhar
Subscribe to GoodReturns Telugu

సొంత నివాసంతో పాటు అద్దె ఆదాయం కోసం అప్పు చేసిన మ‌రో ఇల్లు కొనుగోలు చేసే వారిని ఆర్థిక మంత్రి కాస్త నిరాశ‌ప‌రిచినా సొంత గూడు లేనివారికి మాత్రం సాంత్వ‌న చేకూర్చారనే చెప్పాలి. ఇంటి కోసం వెచ్చించే డ‌బ్బులో నేరుగా రూ. 50 వేల వ‌ర‌కూ ప‌న్ను మిన‌హాయింపు సౌక‌ర్యం క‌ల్పించ‌డం ఎంద‌రో ఇల్లు కొనాల‌ని వేచి చూస్తున్న ఉద్యోగుల‌కు, స్వ‌యం ఉపాధి వ‌ర్గాల‌కు సంతోషం క‌లిగించే విషయం. చౌక గృహాల ప్రాజెక్టులకు మౌలికసదుపాయాల స్థాయి గుర్తింపు ఇవ్వ‌డం గృహ నిర్మాణాల‌కు ఊపునిచ్చేందుకు ఉప‌క‌రించ‌గ‌ల‌దు. ఈ నేప‌థ్యంలో గృహ నిర్మాణం, కొనుగోలు సామాన్యుడికి ఏ విధంగా లాభించ‌గ‌ల‌దో తెలుసుకుందాం.

వ‌డ్డీ రాయితీ

వ‌డ్డీ రాయితీ

ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న ప‌థ‌కంలో భాగంగా ఇప్ప‌టికే రెండు వ‌డ్డీ రాయితీ ప‌థ‌కాల‌ను ఎన్డీఏ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. 2022 క‌ల్లా అంద‌రికీ గృహాలు ఉండాల‌నేది ప్ర‌భుత్వ స్వ‌ప్నం. ఆ దిశ‌గా ఇంటి కొనుగోలు చేసే వారికి ప్ర‌భుత్వం ప్రోత్సాహ‌కాల‌ను అందిస్తోంది. అయితే వ‌డ్డీ రాయితీ మాత్రం వారు ఉన్న ఆదాయ శ్లాబు ఆధారంగా మాత్ర‌మే నిర్ణ‌యిస్తారు.

స‌బ్సిడీలు ఇలా...

స‌బ్సిడీలు ఇలా...

మీ ఆదాయం రూ. 18 ల‌క్ష‌లు ఉండి, మొద‌టి సారి ఇల్లు కొనాల‌ని భావిస్తే ప్ర‌భుత్వ స‌బ్సిడీల‌ను వాడుకుంటే ఇంటి ధ‌ర కంటే రూ. 2.4 ల‌క్ష‌ల‌కే త‌క్కువ‌కే ఇంటిని సొంతం చేసుకోవ‌చ్చు. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం స‌బ్సిడీ రూ.6 ల‌క్ష‌ల ఆదాయం లోపు వారికి మాత్ర‌మే ఇస్తోంది. అంటే మీ రూ. 6 ల‌క్ష‌ల లోపు రుణం వ‌ర‌కూ స‌బ్సిడీ పొంది, మిగిలిన రుణానికి స‌బ్సిడీ లేకుండా అందుతుంది.

రుణ కాల‌పరిమితి 20 ఏళ్లు

రుణ కాల‌పరిమితి 20 ఏళ్లు

డిసెంబ‌రు 31, 2016 సంద‌ర్భంగా జాతిని ఉద్దేశిస్తూ మోడీ మాట్లాడుతూ ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న‌లో భాగంగా గృహ కొనుగోలుదారుల‌కు రెండు రాయితీల‌ను ప్ర‌క‌టించారు. అయితే ప‌న్ను శ్లాబు ఆధారంగా రెండు ఆదాయ వ‌ర్గాల వారికి మాత్ర‌మే ఇవి అమ‌ల‌వుతాయ‌ని చెప్పారు. దీని ప్ర‌కారం 15 ఏళ్ల రుణం కాకుండా రుణ కాల‌ప‌రిమితి 20 ఏళ్లుగా ఉండాల‌ని నిర్ణ‌యించారు.

రాయితీలు ఇవే...

రాయితీలు ఇవే...

మీ ఆదాయం ఏ ట్యాక్స్ శ్లాబులో ఉందో దాన్ని బ‌ట్టి రాయితీ పొందుతారు. రూ. 6 ల‌క్ష‌ల కంటే త‌క్కువ ఆదాయం క‌ల‌వారికి 6.5% రాయితీ వ‌స్తుంది. ఇది రూ. 6 ల‌క్ష‌ల వ‌ర‌కూ తీసుకునే రుణంలో అస‌లుపై. మీ రుణం ఎంతున్నా రాయితీ మాత్రం రూ. 6 ల‌క్ష‌ల వ‌ర‌కూ కేవ‌లం ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన ప‌రిమితి మేర‌కు వ‌డ్డీ స‌బ్సిడీ అందుకుంటారు. అంటే ఏదైనా బ్యాంకులో మీరు 9% వ‌డ్డీకి రుణం తీసుకుని ఉంటే 6.5% సబ్సిడీ పోతే, కేవ‌లం 2.5% వ‌డ్డీకే మీరు రుణం పొంద‌వ‌చ్చ‌న్న‌మాట‌.

అధిక ఆదాయ వ‌ర్గాల వారికి

అధిక ఆదాయ వ‌ర్గాల వారికి

ఇప్ప‌ట్లో న‌గ‌రాల్లో జీవ‌నం సాగించాలంటే సాధార‌ణ ఆదాయం ఉంటే స‌రిపోదు. అందుకే కాస్త అధిక ఆదాయ వ‌ర్గాల వారిని సైతం ప్ర‌భుత్వం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంది. రూ. 12 ల‌క్ష‌ల వార్షిక ఆదాయం క‌లిగిన వారికి సైతం రూ.9 ల‌క్ష‌ల రుణానికి 4% వ‌డ్డీ రాయితీని క‌ల్పించాల‌ని నిర్ణ‌యించారు. అంటే మీరు 10% వ‌డ్డీకి రుణం తీసుకుని ఉంటే మీకు 6% వ‌డ్డీ మాత్ర‌మే అమ‌ల‌య్యేలా చేస్తారు. రూ. 18 లక్ష‌ల వార్షిక ఆదాయం క‌లిగిన వారికి రూ. 12 లక్ష‌ల రుణం(అస‌లు)పై 3% రాయితీ ఇస్తారు.

రాయితీల వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నం

రాయితీల వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నం

ఈ మూడు ఆదాయ వ‌ర్గాల వారిని చూస్తే 20 ఏళ్ల కాల‌ప‌రిమితి రుణం తీసుకుంటే మొత్తంగా రూ. 2.4 ల‌క్ష‌లు ఆదా కాగ‌ల‌దు.(వ‌డ్డీ 9% అనుకుంటే) త‌ద్వారా నెల‌వారీ వాయిదాల్లో రూ. 2200 వ‌ర‌కూ త‌గ్గుద‌ల క‌నిపిస్తుంది. ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న కింద వ‌చ్చే ఈ ప్ర‌యోజ‌నాలు ఆదాయ‌పు ప‌న్నుమిన‌హాయింపుల‌కు అద‌నం అని గుర్తుంచుకోవాలి. మొత్తంగా చూస్తే 30% ట్యాక్స్ శ్లాబులో ఉండే వారికి ఏడాదికి దాదాపుగా రూ. 61,800 మిగిలే అవ‌కాశం ఉంది. ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న‌తో సొంత ఇల్లు

ఏ సంస్థ‌లు వీటిని అమ‌లు చేస్తాయి?

ఏ సంస్థ‌లు వీటిని అమ‌లు చేస్తాయి?

ప్ర‌భుత్వ వ‌డ్డీ రాయితీ ప‌థ‌కాల‌ను అమలు చేసేందుకు జాతీయ హౌసింగ్ బ్యాంకు(ఎన్‌హెచ్‌బీ), హ‌డ్కో ప‌నిచేస్తున్నాయి. మొద‌టిసారి ఇల్లు కొనే అల్పాదాయ వ‌ర్గాల వారికి రూ. 18 వేల‌ను ప్ర‌భుత్వం రాయితీగా క‌ల్పిస్తోంది. ఇందుకోసం ప్ర‌భుత్వం 310 కోట్ల రూపాయ‌ల‌ను వెచ్చిస్తోంది. మ‌ధ్య ఆదాయ వ‌ర్గాల వారిని సైతం రాయితీ కోసం ప‌రిగ‌ణిస్తున్నందున ల‌బ్దిదారుల సంఖ్య బాగా పెరిగే అవ‌కాశం ఉంద‌ని ఎన్‌హెచ్‌బీ అధికారులు అంచ‌నా వేస్తున్నారు. హెచ్‌1బీ వీసా బిల్లేంటో... ఇండియ‌న్ ఐటీ కంపెనీల గుబులేంటో...

మ‌ధ్య ఆదాయ వ‌ర్గాల వారికి(ఎంఐజీ) జ‌న‌వ‌రి 1 నుంచి స‌బ్సిడీ

మ‌ధ్య ఆదాయ వ‌ర్గాల వారికి(ఎంఐజీ) జ‌న‌వ‌రి 1 నుంచి స‌బ్సిడీ

మ‌ధ్య ఆదాయ వ‌ర్గాల వారు(ఎంఐజీ) తీసుకున్న రుణాల‌కు స‌బ్సిడీ వ‌ర్తింపు జ‌న‌వ‌రి 1 నుంచి అమ‌ల‌వుతుంది. ఇందుకోసం కేంద్రం ప్ర‌భుత్వ క్రెడిట్ లింక్‌డ్ స‌బ్సిడీ ప‌థ‌కం కింద రుణం తీసుకుని ఉండాలి. త‌ద్వారా ఈఎంఐ సొమ్ము నెల‌కు రూ.2 వేల వ‌ర‌కూ త‌గ్గ‌వ‌చ్చు. రూ.12 ల‌క్ష‌ల కంటే త‌క్కువ‌ ఆదాయం క‌లిగిన వారు రూ. 9 ల‌క్ష‌ల లోపు తీసుకునే రుణాల‌కు వ‌డ్డీ రాయితీ 4% వ‌ర‌కూ వ‌ర్తిస్తుంది. రూ. 12 ల‌క్ష‌ల‌పైన రూ. 18 ల‌క్ష‌ల లోపు వార్షికాదాయం క‌లిగిన వారు రూ. 12 ల‌క్ష‌ల వ‌ర‌కూ తీసుకునే రుణాల‌కు సైతం 3% వ‌డ్డీ రాయితీ వ‌ర్తిస్తుంది.

 ఈ గృహాల‌కు

ఈ గృహాల‌కు

మీరు నిర్మించుకునే ఇంటికి సంబంధించిన‌ గృహ రుణ కాల‌ప‌రిమితి గ‌రిష్టంగా 20 ఏళ్లై ఉండాలి. రూ.9 ల‌క్ష‌ల లోపు తీసుకునే వారికి మొత్తం రుణం మీద రూ. 2.35 ల‌క్ష‌ల వ‌ర‌కూ, రూ. 12 ల‌క్ష‌ల లోపు రుణానికి రూ. 2.30 ల‌క్ష‌ల వ‌ర‌కూ స‌బ్సిడీ ల‌బ్దిదారుకు అందిస్తారు. ఆయా ఆదాయ వ‌ర్గాల వారు క‌ట్టుకునే ఇంటి విస్తీర్ణం ఇలా ఉండాలి. రూ. 12 ల‌క్ష‌ల లోపు వార్షిక ఆదాయం క‌లిగిన వారు ఇంటి కార్పెట్ ఏరియా 90 చ‌.మీ కంటే త‌క్కువ‌; అదే రూ. 18 ల‌క్ష‌ల లోపు వార్షికాదాయం క‌లిగిన వారి ఇంటి కార్పెట్ ఏరియా 110 చ‌.మీ లోపుఉండాల‌ని కేంద్రం ప్ర‌క‌టించింది.

బేస్ ఇయ‌ర్(ఆధార సంవత్స‌రం) మార్పు

బేస్ ఇయ‌ర్(ఆధార సంవత్స‌రం) మార్పు

భూముల్లాంటి స్థిరాస్తులు ఉన్న వ్య‌క్తులు వాటిని అమ్మితే వ‌చ్చిన మూల‌ధ‌న లాభాల‌ను ద్ర‌వ్యోల్బ‌ణం ఆధారంగా లెక్కిస్తారు. అయితే దీనికి సంబంధించి ఆధార సంవ‌త్స‌రం ఎప్ప‌టి నుంచో 1981గానే ఉంది. ఏప్రిల్ 1,1981కు ముందు కొనుగోలు చేసిన ఆస్తుల విష‌యంలో స‌మ‌స్య‌లు ఉన్నాయి. స‌రైన స‌మాచారం లేక‌పోవ‌డంతో ఈ ఆస్తుల స‌రైన మార్కెట్ ధ‌ర‌(ఫెయిర్ మార్కెట్ వాల్యూ) నిర్ణ‌యించ‌డం స‌వాలుగా ఉంది. ఈ విష‌యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇందుకు సంబంధించి బేస్ ఇయ‌ర్‌(ఆధార సంవత్స‌రం)ను ఏప్రిల్ 1,1981 నుంచి ఏప్రిల్ 1,2001కు మారుస్తున్న‌ట్లు బ‌డ్జెట్ సంద‌ర్భంగా జైట్లీ ప్ర‌క‌టించారు. దీనివ‌ల్ల స్థిరాస్తి లావాదేవీల్లో పార‌ద‌ర్శ‌క‌త పెరుగుతుంది.

English summary

For first home buyers 20-year loan to cost less 240000

Know The New Rules Of Pm Awas Yojana Subsidy Scheme Now Those Who Are Planning to buy home First Time, PM Awas Yojana Is Best Deal For Them, Know The New Rules Of Pm Awas Yojna Subsidy Scheme. with pmay all income groups will get interest subsidy loans,The slabs will apply to loans with a tenure of up to 20
Please Wait while comments are loading...
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC