English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்

పిల్ల‌ల బీమా పాల‌సీ గురించి ఆలోచిస్తున్నారా? అయితే ఇవి తెలుసుకోవాల్సిందే...

Written By: Chandrasekhar
Subscribe to GoodReturns Telugu

దంపతులు ఎవరైనా కానీ వారి ఆశలన్నీ వారి పిల్ల‌ల భ‌విష్య‌త్తుపైనే. మరి చిన్నారుల బాల్యం,చ‌దువులు భద్రంగా ఉండాలంటే రక్షణకు బీమా పాలసీలు కచ్చితంగా ఉండాల్సిందే. బీమా కంపెనీలు అందిస్తున్న చైల్డ్ పాలసీలు చాలా వరకు వారి విద్య, వివాహం లక్ష్యాలను చేరుకునేందుకు వీలు కల్పించేవే. భిన్న అవ‌స‌రాల‌కు అనుగుణంగా బీమా కంపెనీలు పిల్లల బీమా పాలసీలను రూపొందిస్తున్నాయి.

ఉదాహరణకు ఇప్పుడు ఎంబీఏ చదివేందుకు రూ. 10 లక్షలు అవుతుంది అనుకుంటే మరో 20 సంవత్సరాల తర్వాత 5శాతం ద్రవ్యోల్బణంతో అది రూ. 25 లక్షలపైనే కావచ్చు. అంత మొత్తం ఒక్కసారిగా భరించాలంటే కొద్దిగా కష్టమైన పనే. అదే పిల్లల బీమా పాలసీ ఉంటే, చదువు ఖర్చులకు డబ్బు రాబడితో పాటు కాలపరిమితి ఉన్నంత వరకూ పాలసీదారుకు బీమా సైతం లభిస్తుంది. ఈ విధంగా రెండు ప్రయోజనాలను పొందిన వారవుతారు. ఈ విధంగా పిల్ల‌ల పాల‌సీ తీసుకోవ‌డం ద‌గ్గ‌ర నుంచి దాని వ‌ల్ల క‌లిగే ఉప‌యోగాల వ‌ర‌కు స‌మగ్రంగా తెలుసుకుందాం.

అర్హతలు ఏమిటి?

అర్హతలు ఏమిటి?

పాలసీదారు కనిష్ఠ వయసు: 18, గరిష్ఠ వయసు: 55 సంవత్సరాలు

పిల్లల కనిష్ఠ వయసు: 30 రోజులు గరిష్ఠ వయసు: 13 సంవత్సరాలు

పాలసీ కాలపరిమితి ఎంత ఉంటుంది?

పాలసీ కాలపరిమితి ఎంత ఉంటుంది?

7 ఏళ్ల నుంచి మొదలుకొని 25 ఏళ్లవరకూ కాలపరిమితి కలిగిన పాలసీలు అందుబాటులో ఉన్నాయి.

అయితే పాలసీ మెచ్యూర్‌ అయ్యే సరికి పిల్లల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

ప్రీమియం:

ప్రీమియం:

ప్రీమియం చెల్లించే కాల‌ప‌రిమితి 5 నుంచి 20 సంవ‌త్స‌రాల‌ వ‌ర‌కూ ఉండ‌వ‌చ్చు.

మొత్తం ప్రీమియం ఒకేసారి చెల్లించే పాల‌సీలు సైతం అందుబాటులో ఉన్నాయి.

నెల‌, మూడు నెల‌లు, ఆరు నెల‌లు, సంవ‌త్స‌రానికి ఒక‌సారి సైతం చెల్లించే వెసులుబాటు సైతం ఉంటుంది.

మ‌నం తీసుకునే పాల‌సీని బ‌ట్టి ప్రీమియంను చెల్లించే కాల‌ప‌రిమితి ఆధార‌ప‌డి ఉంటుంది.

ప్రీమియంలు రూ. 5000 నుంచి మొద‌లవుతున్నాయి.

బీమా హామీ మొత్తం:

బీమా హామీ మొత్తం:

రూ. లక్ష నుంచి మొదలై రూ.కోటి దాకా బీమా హామీ మొత్తం కలిగిన పాలసీలు ఉన్నాయి.

పాలసీల్లో రెండు రకాలు ఉన్నాయి.

1. పాలసీ మెచ్యూర్‌ అయిన తర్వాత ఒక్కసారిగా పెద్దమొత్తంలో చెల్లించేవి

2. విడతల వారీగా చెల్లిస్తూ, చివర్లో కొంత మొత్తాన్ని చెల్లించేవి

ముందుగా నిర్ణయించిన‌ సమయానికి పిలల్లు హామీ ఇవ్వబడిన మొత్తం మరియు బోనస్‌ (అలాంటిది ఉంటే) అందుకుంటారు. ప్రతిపాదించినవారు చనిపోయినా లేదా బతికి ఉన్నా, దానితో పనిలేకుండా ఈ డబ్బు అందుతుంది.

అలాంటి పాలసీని ప్రతిపాదించినవారు తండ్రి/సంరక్షకుడు/తాత కావచ్చు, ఇతడు పాలసీ కోసం ప్రీమియంని చెల్లిస్తాడు.

మెచ్యూరిటీ ఎప్పుడు?

మెచ్యూరిటీ ఎప్పుడు?

పాల‌సీదారుడి క‌నిష్ఠ వ‌య‌సు: 25 గ‌రిష్ఠ వ‌య‌సు: 70/75

పిల్ల‌ల క‌నిష్ఠ వ‌య‌సు: 18 గ‌రిష్ఠ వ‌య‌సు: 28

ఇక్క‌డ పాల‌సీదారు అంటే పాల‌సీ కోసం ప్రీమియం చెల్లించిన‌వారు.

 గ్రేస్ పీరియ‌డ్ :

గ్రేస్ పీరియ‌డ్ :

నెలవారీ చెల్లింపులు చేసే ప‌థ‌కాల్లో ప్రీమియం చెల్లించేందుకు ఆల‌స్య‌మైతే 15 రోజుల గ్రేస్ పీరియ‌డ్ ఉంటుంది. మిగిలిన వాటిలో 30 రోజుల గ్రేస్ పీరియ‌డ్ ఉంటుంది. గ్రేస్ పీరియ‌డ్ పూర్త‌య్యేలోపు ప్రీమియం చెల్లించిన పాల‌సీల‌ను పున‌రుద్ద‌రిస్తారు. లేక‌పోతే పెనాల్టీ ఉంటుంది.

పిల్లల బీమా పాలసీ ప్రయోజనాలు:

పిల్లల బీమా పాలసీ ప్రయోజనాలు:

పాలసీదారుకు అనుకోకుండా ఏదైనా జరిగితే

- లబ్ధిదారుకు(పిల్లలకు) బీమా హామీ మొత్తాన్ని చెల్లిస్తారు

- భవిష్యత్తులో ఎలాంటి ప్రీమియంలు చెల్లించాల్సిన అవసరం లేదు

- పాలసీ మెచ్యూర్‌ అయిన వెంటనే అదనపు ప్రయోజనాలను సైతం అందజేస్తారు

* ఆదాయపు పన్నుచట్టం 80 సీ, 10(10డీ) ప్ర‌కారం పన్ను మినహాయింపులు ఉంటాయి.

* మన అవసరాలకు అనుగుణంగా పాలసీని ఎంచుకోవచ్చు.

* వైద్య పరీక్షలు లేకుండా కొన్ని ఆరోగ్య స్థితికి సంబంధించిన ప్రశ్నలతో పాలసీ పూర్తవుతుంది.

ముగింపు:

ముగింపు:

పాలసీదారుకు అనుకోకుండా ఏదైనా జరిగితే, ప్రీమియంను రద్దు చేసే పాలసీలను ఎంచుకోవడం మంచిది. పిల్లల అవసరాలు, వార్షికాదాయాన్ని దృష్టిలో ఉంచుకుని బీమా హామీ మొత్తాన్ని నిర్దేశించుకోండి. పిల్లల భవిష్యత్తుకు తల్లిదండ్రులు వేసే మొదటి అడుగు ఇదే. కాబట్టి పాలసీ డాక్యుమెంట్‌ను చదివి నిర్ణయం తీసుకోవాలి. పిల్లల భవిష్యత్తుకు ఆర్థిక భరోసా కల్పించడం పెద్దల బాధ్యత. తల్లిదండ్రుల ఆర్థిక ప్రణాళికలో సైతం ఇది ఒక భాగంగా ఉంటుంది. కాబట్టి పిల్లల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని వారికి బీమా తీసుకోవడం అవసరం. ఉదాహరణకు ఎల్‌ఐసి చైల్డ్‌ పాలసీ ఒక రైడర్‌ను ఎంచుకుంటే... బీమా పాలసీ ఉన్న వ్యక్తి చనిపోతే వారి పిల్లల చదువులకు ఏటా బీమా చేయించిన మొత్తంలో 10 శాతం చొప్పున జీవిత బీమా సంస్థ‌ చెల్లిస్తుంది. పిల్లల ఉన్నత చదువులు, వివాహ అవసరాల రీత్యా డబ్బు పొదుపు చేయడం సాధారణ విషయేమీ కాదు. ఏ అనుకోని అవాంత‌రాలు ఎదురైనా పిల్ల‌ల భ‌విష్య‌త్తు స‌జావుగా సాగాలంటే వారి పేరిట బీమా తీసుకోవ‌డం మంచిది.

Read more about: insurance, child, బీమా
English summary

How to choose best insurance plan for your children

After being a parent, one should start planning for one's financial responsibilities so that they fall in place in due course of time. Health and education play a vital part, without fail it should be considered before buying any plan for child. There are many child plans which cover the investment and insurance part. One should be very careful and should consider various aspects like inflation rate, the cost of education and medical before buying a policy.
Story first published: Friday, January 6, 2017, 12:07 [IST]
Please Wait while comments are loading...
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC