English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்

మ్యూచువ‌ల్ ఫండ్ లలో పెట్టుబడి పెట్టడం వలన కలిగే ప్రయోజనాలు

Written By: Chandrasekhar
Subscribe to GoodReturns Telugu

మ్యూచువ‌ల్ ఫండ్లు ద్ర‌వ్యోల్బ‌ణాన్ని మించిన రాబ‌డులు ఇచ్చేందుకు బాగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఒక ప‌క్క త‌గ్గుతున్న‌ వ‌డ్డీ రేట్లు, మ‌రో వైపు ప‌న్ను వ‌ర్తింపుల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని ఆర్థిక ప్ర‌ణాళిక నిపుణులు సిస్ట‌మ్యాటిక్ విత్‌డ్రాయ‌ల్ ప్లాన్స్‌(ఎస్‌డ‌బ్ల్యూపీ)ను సూచిస్తున్నారు. వీటి ద్వారా ఎక్కువ ప‌న్ను బ్రాకెట్లో ఉన్న‌వారు ప‌న్ను మిన‌హాయింపులు పొంద‌డంతో పాటు క్ర‌మ‌మైన ఆదాయం పొంద‌వ‌చ్చు. మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డుల్లో వైవిధ్యీక‌ర‌ణ‌కు చోటు ఉంటుంది. ఒక‌సారి మీరు ఈ పెట్టుబ‌డులు ప్రారంభిస్తే మీరు దీన్ని జీవితాంతం వ‌ద‌ల‌రు. ఈ నేప‌థ్యంలో మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డుల వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను తెలుసుకుందాం.

 1. వృత్తి నిపుణుల ద్వారా నిర్వహణ:

1. వృత్తి నిపుణుల ద్వారా నిర్వహణ:

అనుభవజ్ఞులు మరియు వృత్తిపర మైన‌ నిపుణుల సేవలు మీకు లభిస్తాయి.

పనికి అంకితమైన పెట్టుబడి పరిశోధన జట్టు(రిసెర్చ్ టీమ్‌) వీరికి అండగా నిలుస్తుంది.వీళ్ళు నిర్వహణను మరియు కంపెనీల అవకాశాలను పరిశీలిస్తారు మరియు పథకము యొక్క లక్ష్యాలను సాధించటం కోసం తగిన పెట్టుబడులను ఎంచుకుంటారు.

2. వైవిధ్యీకరణ:.

2. వైవిధ్యీకరణ:.

విస్తారమైన వివిధ వర్గాల పరిశ్రమలలో మరియు విభాగాలలో మ్యూచువ‌ల్ ఫండ్ లు పెట్టుబడి పెడ‌తాయి. ఈ వివిధీకరణ రిస్క్‌ను తగ్గిస్తుంది ,ఎందుకంటే, చాలా అరుదుగా అన్ని స్టాకులు ఒకేసారి మరియు ఒకే పరిమాణంలో పడిపోతాయి. ఈ వివిధీకరణను, మీ అంతట మీరే చేసే దాని కన్నా మ్యూచువ‌ల్‌ ఫండ్ ద్వారా చేస్తే ,చాలా తక్కువ డబ్బు తో దీనిని సాధించవచ్చు. మ్యూచువల్‌ ఫండ్లు తమ పెట్టుబడి వ్యూహాలను అనుసరించి అనేక రంగాలు, సంస్థలు, పథకాల్లో మదుపు చేస్తాయి. మీరు మీ పెట్టుబ‌డి మార్గాల‌ను ఇలా చేయాలంటే ఎక్కువ పెట్టుబ‌డి అవ‌స‌రం అవుతుంది.

3.మ‌దుపు సులువే:

3.మ‌దుపు సులువే:

మ్యూచువ‌ల్‌ ఫండ్ లలో పెట్టుబడి పెడితే, పేపర్ పని తగ్గుతుంది మరియు అధ్వానమైన డెలివరీలు, చెల్లింపులలో ఆలస్యం మరియు బ్రోకరులతో మరియు కంపెనీలతో అనవసరంగా మళ్ళీ మళ్ళీ కనుక్కోవడం లాంటి సమస్యలను మీరు నివారించ వచ్చు. మ్యూచువ‌ల్‌ ఫండ్ లు మీ సమయాన్ని ఆదా చేస్తాయి. మరియు పెట్టుబడులను పెట్టడమును సులభతరముగా మరియు సౌకర్యవంతంగా చేస్తాయి.

4. ద్ర‌వ్యోల్బ‌ణానికి మించిన రాబ‌డులు:

4. ద్ర‌వ్యోల్బ‌ణానికి మించిన రాబ‌డులు:

మధ్య‌ కాలం నుండి దీర్ఘకాలంలో చూస్తే మ్యూచువ‌ల్‌ ఫండ్ లకు ఎక్కవ రాబడుల సంభావ్యత ఉంది, ఎందుకంటే, వాళ్ళు , ఎంపిక చేసిన సెక్యూరిటీలను వివిధీకృత రంగాల్లో, కంపెనీల‌లో పెట్టుబడి పెడ‌తారు.

పెరుగుతున్న ఖర్చులను తట్టుకోవాలని భావిస్తే మంచి రాబ‌డినిచ్చే పథకాలను ఎంచుకోవాలి. కాస్త నష్టభయం ఉన్నప్పటికీ.. మ్యూచువల్‌ ఫండ్లు దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని మించి రాబడినిచ్చాయని పెట్టుబ‌డి ప్ర‌ణాళిక నిపుణుల ద్వారా తెలుస్తోంది.

5. తక్కువ ఖర్చులు:

5. తక్కువ ఖర్చులు:

మూలధన మార్కెట్ ల లో సీదా పెట్టుబడి పెట్టడం తో పోలిస్తే, మ్యూచువ‌ల్ ఫండ్ లు, తక్కువ ఖర్చు తో పెట్టుబడి పెట్టే విధానం, ఎందుకంటే బ్రోకరేజ్, నిర్వ‌హ‌ణ‌కి సంబంధించిన ఫీజులు మరియు ఇతర ఫీజులు తగ్గడం వలన పెట్టుబడిదారుల ఖర్చు తగ్గుతుంది. ఇది కూడా చ‌ద‌వండి ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న‌తో సొంత ఇల్లు

6. స్థిరచరాస్తులను నగదుగా మార్చడం:

6. స్థిరచరాస్తులను నగదుగా మార్చడం:

ఓపెన్ ఎండెడ్ పథకాలలో, ఆస్తుల నికర విలువకు (ఎన్ ఎ వి)సంబంధించిన ధరకు మ్యూచువ‌ల్‌ ఫండ్ ల నుండి సత్వరంగా మీ డబ్బును న‌గ‌దుగా మార్చుకోవ‌చ్చు. క్లోజ్ ఎండెడ్ పథకాలలో, స్టాక్ ఎక్స్చేంజ్ లో , అప్పుడున్న మార్కెట్ ధరకు మీ యూనిట్ లను అమ్మాలి లేదా నిర్ణీత కాలంలో ప్రతిపాదించిన, కొన్ని క్లోజ్-ఎండెడ్ మరియు ఇంటర్వల్ పథకాలలో మ్యూచువ‌ల్ ఫండ్ ద్వారా యూనిట్ లను ఎన్ ఎ వి సంబంధిత ధరలో తిరిగి కొనాలి.

7. పారదర్శకత

7. పారదర్శకత

మీ పెట్టుబడి యొక్క విలువ గురించి సమాచారము ఎప్ప‌టిక‌ప్పుడు లభిస్తుంది. ఇంట‌ర్మీడియ‌ట్ వెబ్‌సైట్ల ద్వారా పెట్టుబ‌డి పెడితే యూజ‌ర్ ఐడీ, లాగిన్ ద్వారా ప్ర‌తి రోజూ మీరే చెక్ చేసుకోవ‌చ్చు. అంతేకాకుండా మీ పథకం ద్వారా చేసిన ప్రత్యేక పెట్టుబడుల గురించి, ప్రతి ఆస్తుల వర్గాలలో పెట్టుబడి చేసిన అనుపాతం మరియు నిధుల నిర్వహణాధికారి యొక్క పెట్టుబడి వ్యూహం మరియు దృక్పధం గురించి తెలియజేయబడుతుంది .

8. సర్దుబాటుకు వీలుండటం:

8. సర్దుబాటుకు వీలుండటం:

క్రమబద్ధ పెట్టుబడుల ప్రణాళికలు (ఎస్ ఐ పి), క్రమబద్ధ ఉపసంహరణ ప్రణాళికలు (ఎస్ డబ్ల్యూ పి) డివిండెండ్ ను తిరిగి పెట్టుబడి పెట్టడానికి ప్రణాళికలు వంటి ఫీచర్ ల ద్వారా మీ అవసరాలు మరియు సౌలభ్యానికి అనుకూలంగా, క్రమబద్ధంగా పెట్టుబడి పెట్ట వచ్చు లేదా నిధులను తీసుకోవచ్చు.

 9. పథకాల ఎంపికలు:

9. పథకాల ఎంపికలు:

మీ జీవిత కాలంలో మారుతూ ఉండే అవసరాలకు తగిన వివిధ రకాల ప్రణాళికలను మ్యూచువ‌ల్‌ ఫండ్ లు ప్రతిపాదిస్తున్నాయి.

10. బాగా క్రమబద్ధం చేయబడినయి :

10. బాగా క్రమబద్ధం చేయబడినయి :

అన్ని మ్యూచువ‌ల్‌ ఫండ్ లు సెబితో రిజిస్టర్ అయి ఉంటాయి. పెట్టుబడి దారుల ప్రయోజనాలను సంరక్షించడం కోసం, తయారుజేయబడిన ఖచ్చితమైన నిబంధనల ప్రకారం అవి నిర్వహణ చేస్తాయి. మ్యూట్యుయల్ ఫండ్ల నిర్వహణను క్రమబద్దంగా సెబి పరిశీలిస్తుంది

Read more about: mf, mutual funds
English summary

Benefits of Mutual fund investments in India

Most people get scared simply hearing the term Mutual Fund, let alone any other financial jargon. But when you look at it closely, there’s really not much to fear and most definitely a lot to gain by simply understanding the fundamentals of Mutual Funds. If you know the benefits of mutual funds you will definitely like this way of investments.
Please Wait while comments are loading...
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC