English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்

పేటీఎమ్ వ్యాలెట్ ద్వారా రుణాలను అందిస్తోంది...

Written By: Chandrasekhar
Subscribe to GoodReturns Telugu

పెద్ద వ్యాపారాల‌కేమో బ్యాంకులు రుణాలిస్తాయి. మ‌ధ్య స్థాయి వ్యాపారాలు ఎక్కువ‌గా వ‌డ్డీ వ్యాపారులు, ఆర్థిక సంస్థ‌లు, ఎన్‌బీఎఫ్‌సీల‌ను ఆశ్రయిస్తాయి. కానీ చిన్న వ్యాపారం చేసే వ్యాపారులకు రుణాలు కావాలంటే కాస్త క‌ష్టం. దాన్ని క్యాష్ చేసుకునే క్ర‌మంలో ఇప్పుడు పేటీఎం అత్యంత తక్కువ వడ్డీ రేట్లకు రుణాలను అందిస్తోంది. దీనికి ఎలాంటి పూచీ కత్తు లేకుండానే మూలధన రుణాలను మొబైల్ పేమెంట్ ఈ కామర్స్ దిగ్గజం పేటీఎం అందించనుంది. దీనికోసం వివిధ బ్రాండ్లు, ఆర్థిక సంస్థ‌ల‌తో భాగ‌స్వామ్యం కుదుర్చుకుంది. పేటీఎమ్ రుణ స‌మాచారం ఇక్క‌డ తెలుసుకోండి

 ఆన్‌లైన్‌లోనే రుణం...

ఆన్‌లైన్‌లోనే రుణం...

మీ స్మార్ట్ ఫోన్ లోని వాలెట్ నుంచి లోన్ తీసుకోవచ్చు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్లను జరిపే ప్రముఖ కంపెనీలు పే వరల్డ్, పేటీఎమ్, వన్ మొబీక్విక్ లు ఈ పద్దతికి పచ్చజెండా ఊపేశాయి.రుణ ద‌రఖాస్తు అర్హ‌త‌ను తెలుసుకునేందుకు సెల్ల‌ర్ ప్యానెల్‌లోని లోన్స్ ట్యాబ్‌లో చెక్ చేసుకోవాలి.

ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి?

ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి?

ఒక సులువైన ద‌ర‌ఖాస్తు ఫారంను నింపి, కావాల్సిన వివ‌రాల‌ను అంద‌జేసి రుణం పొంద‌వ‌చ్చు. ఒక‌సారి మీరు పేటీఎమ్ వెబ్‌సైట్లో ఉన్న ట్యాబ్ ద్వారా వివ‌రాల‌ను నింపితే దాన్ని రుణం అందించే సంస్థ‌ల‌కు పంపుతారు. త‌ర్వాత రుణం ఇచ్చేందుకు 2 నుంచి 4 రోజుల స‌మ‌యం ప‌డుతుంది.

పేటీఎమ్ రుణం ద‌రఖాస్తు స‌మ‌చారం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

https://seller.paytm.com/login?redirectToUrl=/new/merchant_new

 రుణ కాల‌ప‌రిమితి, వ‌డ్డీ రేటు

రుణ కాల‌ప‌రిమితి, వ‌డ్డీ రేటు

పేటీఎమ్ భాగ‌స్వామ్యం కుదుర్చుకున్న సంస్థ‌లు 1 నుంచి 12 నెల‌ల కాలానికి రూ.1 ల‌క్ష నుంచి రూ. 3 కోట్ల వ‌ర‌కూ రుణాలందించేందుకు ఏర్పాట్లు చేసింది. ఒక్కో సంస్థ ఒక్కో విధంగా వ‌డ్డీ రేట్ల‌ను నిర్ణ‌యించింది. వ‌డ్డీ రేట్లు 12 నుంచి 24 శాతం వ‌ర‌కూ ఉంటున్నాయి. ఒక విధంగా చూస్తే త‌క్ష‌ణావ‌స‌రాల కోసం ఇవి ప‌ర్స‌న‌ల్ లోన్స్ కంటే ఉత్త‌మంగానే ఉండే అవ‌కాశం ఉంది.పేటీఎమ్ తాను కొత్తగా ఏర్పాటు చేయబోతున్న బ్యాంకుల్లో ఖాతా తెరిచినవారికి మాత్రమే ఈ సదుపాయం ఉంటుందని తెలిపింది.

 రుణాల ర‌కాలు

రుణాల ర‌కాలు

ట‌ర్మ్ లోన్‌:

ఒక నిర్ణీత కాలానికి అందించే ఈ ర‌క‌మైన రుణాల‌ను ట‌ర్మ్ రుణాలుగా వ్య‌వ‌హ‌రిస్తారు. అయితే రుణాన్ని మొత్తం ఒక్క‌సారిగా ల‌బ్దిదారుకు అందిస్తారు. రుణంపై త‌క్ష‌ణ వ‌డ్డీ రేట్ల‌ను అమ‌లుచేస్తారు. రుణం అందించే సంస్థ నిర్ణ‌యించిన ప్ర‌కారం వాయిదాల్లో అప్పు తీసుకున్న సొమ్మును తీర్చేయాలి.

ఓవ‌ర్‌డ్రాఫ్ట్‌:

ఒవ‌ర్‌డ్రాఫ్ట్ విష‌యంలో గరిష్ట ప‌రిమితిని విధిస్తారు. ఎప్పుడైనా పేటీఎమ్ వినియోగ‌దారుకు అవ‌స‌ర‌మైన‌ప్పుడు ఈ పరిమితి లోపు సొమ్మును మూల‌ధ‌నంగా వాడుకోవ‌చ్చు. మీరు వాడుకున్న సొమ్ముకు మాత్ర‌మే వడ్డీని విధిస్తారు కానీ మొత్తం ఓవ‌ర్‌డ్రాఫ్ట్ ప‌రిమితిపై వ‌డ్డీని అమ‌లుచేయ‌రు. రీపేమెంట్ చివ‌రి రోజు వ‌ర‌కూ మాత్ర‌మే వ‌డ్డీని చార్జ్ చేస్తారు. రుణం అందించే సంస్థ నిర్ణ‌యించిన విధంగా తీసుకున్న రుణాన్ని ఒక్క‌సారిగా మొత్తం క‌ట్టేయాలి.

రుణాల‌కు ఎక్కువ అవ‌కాశాలు

రుణాల‌కు ఎక్కువ అవ‌కాశాలు

ఆన్లైన్ మోసాలు ఎక్కువవుతున్న కారణంగా వాలెట్ రుణాలు అందించేముందు కంపెనీలు కఠినతరమైన నిబంధనలను పాటించనున్నట్లు తెలిపాయి. కాగా, టెక్ సైన్స్ రీసెర్చ్ అనే కన్సల్టెన్సీ తాజాగా చేసిన పరిశోధనలో 2020 కల్లా మొబైల్ మార్కెట్ 6.6 బిలియన్ డాలర్లకు చేరనున్నట్లు అంచనా వేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటివరకు 145 బ్యాంకులకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసే అవకాశం కల్పించింది.

బంగారం ధ‌ర‌ల‌ను తెలుసుకునేందుకు ఇక్క‌డ క్లిక్ చేయండి

Read more about: paytm, loans, business
English summary

all details about paytm loans

Paytm, One97 Communications’ flagship brand, is the pioneer in the online payments space in India & is the largest marketplace & mobile commerce platform in the country. Paytm promises a smooth & comfortable shopping experience to its 80 million customers across the country. Here we are giving about paytm loans. Paytm starts offering collateral-free loans for merchants on its platform online
Please Wait while comments are loading...
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC