For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గృహ రుణం తీసుకునేముందు వీటిని తెలుసుకున్నారా?

అలాగే మ‌న బంధుమిత్రులు గృహ రుణాల గురించి చాలా విష‌యాలు చెప్ప‌డం వ‌ల్ల తిక‌మ‌క‌ప‌డుతూ ఉంటారు. మ‌దిలో ఎన్నో సందేహాలుంటాయి. అలాంటి కొన్ని అపోహ‌లు, గృహ రుణం తీసుకునేముందు సాధార‌ణంగా చేసే తప్పులేంటో ఇక్క‌డ

|

గృహ రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేసిన‌ప్పుడు చిన్న త‌ప్పులు చేయ‌డం వ‌ల్ల కూడా ఒక్కోసారి రుణ ద‌ర‌ఖాస్తు తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌వుతుంది. మార్కెట్‌లో వ‌డ్డీ రేట్లు త‌క్కువ‌గా ఉన్న స‌మ‌యంలో రుణ ద‌ర‌ఖాస్తు త్వ‌రితగ‌తిన పూర్త‌యితే బాగా ఉంటుంది. వివిధ రుసుముల‌ను చూసుకుని ఈఎమ్ఐల రూపంలో రుణ చెల్లింపున‌కు అంగీక‌రించి రుణ ద‌ర‌ఖాస్తును పూర్తిచేసేందుకు రుణ గ్ర‌హీత‌లు ప్ర‌య‌త్నిస్తారు.

చాలా గృహ రుణాల‌కు మొద‌ట్లో డౌన్ పేమెంట్ త‌ప్ప‌నిస‌రి. డౌన్ పేమెంట్ అంటే రుణ గ్ర‌హీత మొద‌టిసారి చెల్లించే నిర్దిష్ట‌మొత్తం. రుణ ద‌ర‌ఖాస్తు తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌వ్వ‌కూడ‌దు అనుకుంటే చిన్న చిన్న త‌ప్పులు చేయ‌కూడ‌దు. అలాగే మ‌న బంధుమిత్రులు గృహ రుణాల గురించి చాలా విష‌యాలు చెప్ప‌డం వ‌ల్ల తిక‌మ‌క‌ప‌డుతూ ఉంటారు. మ‌దిలో ఎన్నో సందేహాలుంటాయి. అలాంటి కొన్ని అపోహ‌లు, గృహ రుణం తీసుకునేముందు సాధార‌ణంగా చేసే తప్పులేంటో ఇక్క‌డ చూద్దాం.

వివిధ బ్యాంకుల్లో విచారించ‌క‌పోవ‌డం

వివిధ బ్యాంకుల్లో విచారించ‌క‌పోవ‌డం

బ‌స్సు టిక్కెట్ కొనేట‌ప్పుడు వివిధ వెబ్‌సైట్ల‌లో ఆఫ‌ర్ల‌ కోసం చూడ‌టం మామూలే క‌దా. అలాంటిది జీవిత కల అయిన ఇల్లు కొనేట‌ప్పుడు ఏ బ్యాంకులో రుణం తీసుకుంటే మ‌న‌కు మంచిదో విచారించ‌డం ముఖ్యం. దీర్ఘ‌కాలంలో చెల్లింపుల‌న్నీ క‌లిపి చూస్తే .25 శాతం వ‌డ్డీ రేటు త‌గ్గినా రుణ చెల్లింపు కాస్త త‌క్కువ‌వుతుంది. అందుకే వివిధ ఆన్‌లైన్ వెబ్‌సైట్ల ద్వారా, స్థిరాస్తి క‌న్స‌ల్టెంట్ల ద్వారా వివిధ బ్యాంకుల వ‌డ్డీ రేట్ల‌ను, బ్యాంకు సేవ‌లు ఎలా ఉంటాయో విచారించ‌డం ముఖ్యం. అన్నీ బేరీజు వేసుకున్న త‌ర్వాత రుణ ద‌రఖాస్తు ప్ర‌క్రియ మొద‌లుపెట్టండి. అంతే కానీ బ్యాంకు ఏజెంట్లు, సేల్స్ ప‌ర్స‌న్స్‌ చెప్పారు క‌దా అని తీసుకుంటే దీర్ఘకాలంలో కాస్త అధికంగా చెల్లించ‌వ‌ల‌సి వ‌స్తుంది.

క్రెడిట్ స్కోర్ చూసుకోక‌పోవ‌డం

క్రెడిట్ స్కోర్ చూసుకోక‌పోవ‌డం

రుణం అంటేనే ఎవ‌రికైనా గుర్తొచ్చేది క్రెడిట్ స్కోర్‌. గృహ రుణం ద‌ర‌ఖాస్తు చేసిన‌ప్పుడు బ్యాంకుల‌న్నీ త‌ప్ప‌నిస‌రిగా క్రెడిట్ స్కోర్‌ను చూసే ముందుకెళ‌తాయి. క్రెడిట్‌స్కోర్ త‌గినంత లేక‌పోతే తిప్ప‌లు త‌ప్ప‌వు. మీ క్రెడిట్ స్కోర్ త‌క్కువ ఉంద‌ని తెలిస్తే దాన్ని మెరుగుప‌రుచుకునేందుకు ప్ర‌య‌త్నం చేయాలి. త‌ర్వాత రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేయాలి. సిబిల్‌, ఎక్స్‌పీరియ‌న్‌, ఈక్విఫాక్స్‌, హైమార్క్ వంటి సంస్థ‌లు వ్య‌క్తుల క్రెడిట్ హిస్ట‌రీ, స్కోర్ల‌ను అంద‌జేస్తున్నాయి.

బ్యాంకు స‌ర్వీస్ గురించి విచారించ‌క‌పోవ‌డం

బ్యాంకు స‌ర్వీస్ గురించి విచారించ‌క‌పోవ‌డం

కొన్ని బ్యాంకులు రుణం ద‌ర‌ఖాస్తు చేసిన‌ప్ప‌టి నుంచి మంజూరు చేసేవ‌ర‌కూ వినియోగ‌దారుల‌తో బాగానే వ్య‌వ‌హ‌రిస్తాయి. త‌ర్వాత నుంచి బ్యాంకు వైపు నుంచి మీ ప్ర‌శ్న‌ల‌కు, సందేహాలకు స‌రైన స‌మాధానాలుండ‌వు. ఈ నేప‌థ్యంలో వ‌డ్డీ రేటు గురించే ఆలోచించ‌కుండా ముంద‌స్తు రుణంచెల్లింపు చార్జీలు, న్యాయ‌ప‌ర‌మైన రుసుములు, ప్రాసెసింగ్ ఫీజు లాంటి వాటిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటూ బ్యాంకు సేవ‌లు ఎలా ఉన్నాయో విచారించి ముందుకెళ్లాల్సి ఉంటుంది.

ప్రీ అప్రూవ్‌డ్ హోం లోన్‌

ప్రీ అప్రూవ్‌డ్ హోం లోన్‌

ప్రీ అప్రూవ్‌డ్ హోం లోన్ ప్ర‌ధాన ప్ర‌యోజ‌నం ఏంటంటే ఎంత రుణం పొంద‌వ‌చ్చో ముందే తెలిసిపోతుంది. మీ అర్హ‌త‌ను బ‌ట్టి వ‌డ్డీ రేటులో త‌గ్గింపును కోర‌వ‌చ్చు. ప్రీ అప్రూవ్‌డ్ హోం లోన్ కోసం బ్యాంకులు మిమ్మ‌ల్ని సంప్ర‌దించిన‌ప్పుడు దాని గురించి ఆన్‌లైన్‌లో విచారించండి. వ‌డ్డీ రేటు విష‌యంలో జాగ్ర‌త్త వ‌హించండి.

అవ‌స‌ర‌మైన దాని క‌న్నా ఎక్కువ తీసుకోవ‌డం

అవ‌స‌ర‌మైన దాని క‌న్నా ఎక్కువ తీసుకోవ‌డం

బ్యాంకులు మీరు ఎంత వ‌ర‌కూ రుణం పొందేందుకు అర్హ‌త ఉందో తెలుపుతాయి. అలా అని అంత రుణం తీసుకోమ్మ‌ని కాదు. మీకు ఎంత అవ‌స‌ర‌మో అంత రుణం మాత్ర‌మే తీసుకోవ‌డం సూచ‌నీయం. మీ మిగిలిన పెట్టుబ‌డి ప్ర‌ణాళిక‌లు, అప్పులు, ఈఎమ్ఐలు అన్నింటినీ దృష్టిలో ఉంచుకుని గృహ‌రుణం తీసుకోండి.

రుణ ఒప్పంద ప్ర‌తం చ‌ద‌వ‌క‌పోవ‌డం

రుణ ఒప్పంద ప్ర‌తం చ‌ద‌వ‌క‌పోవ‌డం

గృహ రుణం తీసుకునేట‌ప్పుడు చాలా ప‌త్రాలు ఉంటాయి. అన్నింటిపై సంత‌కాలు చేయాలి. అలా చేసేట‌ప్పుడు వ‌రుస‌గా ఎక్క‌డెక్క‌డ సంత‌కాలు చేయాలో అడిగి సంత‌కం చేయ‌డం మంచిది కాదు. ఇల్లు జీవిత స్వ‌ప్నం కాబ‌ట్టి దాని రుణానికి సంబంధించిన ఒప్పందం కుదుర్చుకునేట‌ప్పుడు స‌మ‌యం కేటాయించ‌డం ముఖ్యం. అన్నింటినీ చ‌దివి అర్థం చేసుకునేందుకు ప్ర‌య‌త్నించి సంత‌కాలు చేయ‌డం సూచ‌నీయం.

కొత్త అప్పులు

కొత్త అప్పులు

క్రెడిట్ కార్డు అప్పులు లేదా వ్య‌క్తిగ‌త రుణాలు ఇది వ‌ర‌కే తీసుకొని మ‌ళ్లీ కొత్త అప్పుల కోసం వెళ్లేట‌ప్పుడు జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. గృహ రుణం తీసుకునేముందు పాత‌వి ఎక్కువ అప్పులు లేకుండా చేసుకోవాలి. క్రెడిట్ స్కోర్‌కు సంబంధించి ఎక్కువ అప్పులు ఉండ‌టం శ్రేయ‌స్క‌రం కాదు. పరపతి స్కోర్ 750కి మించి ఉంటే మంచి స్కోర్‌ అని క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సిబిల్‌) పేర్కొంది.

గృహ రుణానికి బీమా తీసుకోక‌పోవ‌డం

గృహ రుణానికి బీమా తీసుకోక‌పోవ‌డం

గృహ రుణం తీసుకునేట‌ప్పుడు స్వ‌ల్ప ప్రీమియం చెల్లించ‌డం ద్వారా దానికి సంబంధించి బీమాను తీసుకోవ‌చ్చు. అనుకోకుండా రుణ గ్ర‌హీత‌కు ఏమైనా జరిగితే ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళుతుంది. ఒక‌వేళ బీమా తీసుకోకుండా రుణం తీసుకున్న వ్య‌క్తి మ‌ర‌ణిస్తే వారి కుటుంబ స‌భ్యులు రుణం తీర్చాల్సి వ‌స్తుంది. అదే బీమా ఉంటే స‌మస్య ఉండ‌దు.

గడువు తక్కువ ఉంటే త్వరగా చెల్లించవచ్చు

గడువు తక్కువ ఉంటే త్వరగా చెల్లించవచ్చు

గృహ రుణం తీసుకునే వారిలో ఎక్కువ మంది వీలైనంత త్వరగా ఆ రుణం తీర్చేయాలనుకుంటారు. లేకపోతే వడ్డీ రేట్లు పెరిగి మరింత భారం పడుతుందనుకుంటారు. బడ్జెట్‌ను సరిగా ప్లాన్‌ చేసుకోకుండా ఈ భయంతో ఎక్కువ ఈంఐ చెల్లించాల్సిన ఆప్షన్‌ ఎంచుకుంటే.... అత్యవసర సమయాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. నెల వారీ ఆదాయంలో వ్యత్యాసాలు వచ్చినా... ఈంఐ లు సమయానికి చెల్లించడంలో సమస్యలు ఎదురుకావచ్చు. అలాంటపుడు గృహ రుణం ఇచ్చిన బ్యాంకును సంప్రదించి గృహ రుణం చెల్లింపు గడువును మరింత పొడిగించుకోవచ్చు. కాకపోతే ఇందుకోసం అదనంగా కొంత ఖర్చవుతుంది. రుణం తీసుకునే ముందే ఎక్కువ గడువు ఎంచుకుంటే ఇలాంటి సమస్యలు రావు.

తక్కువ వ‌డ్డీకి వ‌స్తుంద‌ని చూస్తున్నారా?

తక్కువ వ‌డ్డీకి వ‌స్తుంద‌ని చూస్తున్నారా?

వడ్డీ రేటు తక్కువగా ఉంటే, ఈంఐల చెల్లింపు భారమూ తక్కువగా ఉంటుందనేది మరో అపోహ. గృహ రుణం తీసుకునేటపుడే రుణ మంజూరీ కోసం బ్యాంకు వసూలు చేసే చార్జీలు, ఫీజులు తెలుసుకోవాలి. మీ ఆర్థిక పరిస్థితికి అనుకూలంగా ఉన్న గృహ రుణ పథకాన్ని ఎంచుకోవడం మంచిది.

వడ్డీ రేటు... వాయిదాలు క‌ట్టేదెలా?

వడ్డీ రేటు... వాయిదాలు క‌ట్టేదెలా?

వడ్డీ రేటు పెరిగితే తమ ఈఎంఐ భారమూ పెరుగుతుందని చాలా మంది భావిస్తుంటారు. ఇది పూర్తిగా అపోహ అని చెప్పక తప్పదు. వడ్డీ రేట్లు పెరిగినపుడు బ్యాంకులు ఈఎంఐ భారం పెరగకుండా... గృహ రుణం చెల్లించాల్సిన గడువు పెంచుతాయి. ఒకవేళ అదనంగా పెరిగే ఈఎంఐ భారం కాదనుకుంటే ఖాతాదారులు ఆ విషయాన్ని బ్యాంకుకు తెలియజేసి నిర్ణీత వ్యవధిలోనే తమ గృహ రుణాన్ని చెల్లించే ఏర్పాటు చేసుకోవ‌చ్చు.

రుణ కాల‌ప‌రిమితి, వ‌డ్డీ రేటును బ‌ట్టి అందించే రుణం ఎంత అనేది ఆధార‌ప‌డి ఉంటుంది. అంతే కాకుండా మీరు నెల‌వారీ ఎంత మిగులు ఆదాయాన్ని క‌లిగి ఉన్నారో చూస్తారు. గృహ రుణం తీసుకున్న వారు చాలా వ‌ర‌కూ ఈఎంఐల రూపంలోనే చెల్లించేందుకు మొగ్గుచూపుతారు. మీకు రుణం మంజూరు అయిన మ‌రుస‌టి నెల నుంచే ఈఎంఐ చెల్లింపులు మొద‌ల‌వుతాయి.

English summary

గృహ రుణం తీసుకునేముందు వీటిని తెలుసుకున్నారా? | 11 Common Home Loan Mistakes To Avoid before applying for a housing loan

Many individuals apply for a home loan only to realize that their application is rejected due to some error which could have been avoided. With low-interest rates prevailing in the market, individuals can afford the Equated Monthly Installment (EMI) along with other expenses.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X