For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరోగ్య బీమాకు ఉండే పన్ను ప్ర‌యోజ‌నాలు

సాధార‌ణంగా చాలా మంది మెడిక‌ల్ బిల్లులు స‌మ‌ర్పించ‌డం ద్వారా మాత్ర‌మే ఆయా ప్ర‌యోజ‌నాల‌ను పొందుతున్నారు. అయితే ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం కింద ఉండే కొన్ని ప్రొవిజ‌న్ల ద్వారా వైద్య చికిత్స‌ల‌కు ఇత‌ర ప్ర‌యోజ‌న

|

ఆరోగ్య బీమా పాల‌సీ తీసుకుంటే ప‌న్ను ప్ర‌యోజ‌నాలు వర్తిస్తాయ‌ని చాలా మందికి తెలుసు.
సాధార‌ణంగా చాలా మంది మెడిక‌ల్ బిల్లులు స‌మ‌ర్పించ‌డం ద్వారా మాత్ర‌మే ఆయా ప్ర‌యోజ‌నాల‌ను పొందుతున్నారు. అయితే ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం కింద ఉండే కొన్ని ప్రొవిజ‌న్ల ద్వారా వైద్య చికిత్స‌ల‌కు ఇత‌ర ప్ర‌యోజ‌నాల‌ను సైతం పొంద‌వ‌చ్చు.

 ఆరోగ్య బీమాకు ఉండే పన్ను ప్ర‌యోజ‌నాలు

1) దివ్యాంగులైన(అంగ‌విక‌లురైన) కుటుంబ స‌భ్యుల కోసం సెక్ష‌న్ 80డీడీ ద్వారా
మీ కుటుంబంలో వైక‌ల్యం ఉన్న‌వారికి బీమా ప్రీమియంను మీరు చెల్లిస్తున్న‌ట్ల‌యితే పన్ను ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు. వైక‌ల్య శాతం ఆధారంగా ప‌న్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నం వ‌ర్తిస్తుంది. వైద్య చికిత్స‌ల కోసం అయ్యే ఖ‌ర్చుల‌ను మిన‌హాయింపుల కోసం క్లెయిం చేసుకోవ‌చ్చు. కుటుంబ స‌భ్యుల్లో జీవిత భాగ‌స్వామి, కొడుకు లేదా కూతురు, త‌ల్లిదండ్రులు, అన్న‌ద‌మ్ములు, అక్కాచెల్లెళ్లు ఎవ‌రైనా మీపై ఆధార‌ప‌డిన వారు అయి ఉండొచ్చు. పాక్షిక‌ వైక‌ల్యం ఉన్న‌ వారికి సంబంధించి రూ. 75వేల వ‌ర‌కూ ఖ‌ర్చును క్లెయిం చేసుకునేందుకు ఈ ఆర్థిక సంవ‌త్స‌రం నుంచి అవ‌కాశం క‌ల్పించారు. వైక‌ల్య శాతం ఎక్కువ ఉండే వారి విష‌యంలో రూ. 1.25 లక్ష‌ల వ‌ర‌కూ మిన‌హాయింపు ప్ర‌యోజ‌నాన్ని పొంద‌వ‌చ్చు. ఇందుకోసం మీరు రుజువులు చూపాల్సి ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల మెడిక‌ల్ బోర్డులు జారీచేసే వైక‌ల్య స‌ర్టిఫికెట్ల కాపీల‌ను స‌మ‌ర్పించాలి.

 ఆరోగ్య బీమాకు ఉండే పన్ను ప్ర‌యోజ‌నాలు

2) ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80యూ ద్వారా
సెక్ష‌న్ 80యూ ద్వారా వ్య‌క్తులు త‌మ‌కు తాము ప‌న్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. మీకు తీవ్ర వైక‌ల్యం ఉంటే రూ. 1.25 లక్ష వ‌ర‌కూ, పాక్షిక వైక‌ల్యం ఉంటే రూ. 75 వేల వ‌ర‌కూ మిన‌హాయింపు పొందే వీలుంటుంది. మీకు వైద్య ఖ‌ర్చులు అంత మేర‌కే ఉన్నాయా లేదా అనే దానితో సంబంధం లేకుండా మీరు ప్ర‌యోజ‌నాల కోసం ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు.

3) సెక్ష‌న్ 80డీ కింద‌
ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం కింద 80డీ కింద సైతం ప‌న్ను మిన‌హాయింపును పొంద‌వ‌చ్చు. ఇది వ్య‌క్తి, కుటుంబం కోసం తీసుకునే బీమాకు చెల్లించే ప్రీమియానికి సంబంధించిన‌ది. ఒక్కొక్క‌రికి రూ. 25 వేల వ‌ర‌కూ మిన‌హాయంపు పొందేందుకు అనుమ‌తిస్తారు. సీనియ‌ర్ సిటిజ‌న్స్ విషయంలో ఇది రూ. 30 వేలుగా ఉంటుంది. ఇక్క‌డ బీమా ప్రీమియం మీకు, లేదా జీవిత భాగ‌స్వామికి లేదా ఆధార‌ప‌డిన త‌ల్లిదండ్రుల‌కు మాత్ర‌మే చెల్లించిన‌ట్లయితే మిన‌హాయింపు వర్తిస్తుంది.

Read more about: insurance
English summary

ఆరోగ్య బీమాకు ఉండే పన్ను ప్ర‌యోజ‌నాలు | These exemptions you should know about health insurance premium

Many investors know that health insurance qualifies for tax benefits. They also know that if you submit medical bills to your company, you end-up saving tax. But, did you know that there are many other tax benefits that one gets on medical treatment and under various provisions of the Income Tax Act.
Story first published: Monday, November 28, 2016, 15:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X