For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్ల‌ల కోసం 6 ఉత్తమ పొదుపు ఖాతాలు

|

పిల్ల‌ల కోసం పొదుపు చేయాల‌ని, వారి భ‌విష్య‌త్తు కోసం డ‌బ్బు ఆదా చేయాల‌ని చాలా మంది త‌ల్లిదండ్రుల‌కి ఉంటుంది. అయితే ఒక్కో పేరెంట్స్ ఒక్కో పెట్టుబ‌డి మార్గాన్ని ఎంచుకుంటారు. అయితే వారి చిన్న‌త‌నం నుంచే పొదుపు ప్ర‌ణాళిక వేసుకుని ఉంటే పొదుపు ఖాతాలు కూడా ఉత్త‌మ‌మైన మార్గ‌మే.
అయితే ఈ పొదుపు ఖాతాల ద్వారా వ‌చ్చే వ‌డ్డీ త‌ల్లిదండ్రుల ఆదాయంగా పరిగ‌ణిస్తారు. కాబ‌ట్టి పిల్ల‌ల పేరిట ఉన్న సాధార‌ణ పొదుపు ఖాతా, ఆర్‌డీ వంటి వాటి నుంచి వ‌చ్చే వ‌డ్డీ త‌ల్లిదండ్రుల ఆదాయంలో భాగ‌మ‌వుతుంద‌ని గుర్తించాలి. క‌నీస నిల్వ‌, ఇత‌ర బ్యాంకు నిల్వ‌లు, గ‌రిష్ట పరిమితి వంటి బ్యాంకును బ‌ట్టి మారుతూ ఉంటాయి. ఇది మీరు ఖాతా తెరిచే బ్యాంకు శాఖ‌ను అడిగి తెలుసుకోవాలి.
మీరు పిల్ల‌ల పేరిట పొదుపు ఖాతా తెరిచేట‌ప్పుడు వ‌డ్డీ, బ్యాంకు ప‌నితీరు వంటి విష‌యాల‌ను గ‌మ‌నిస్తారు. వీట‌న్నింటినీ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని మేము కొన్ని బ్యాంకు పొదుపు ఖాతాల‌ను ఎంపిక చేశాం. వ‌డ్డీ, బీమా, సులువైన బ్యాంకింగ్‌(ఈజ్ ఆఫ్ బ్యాంకింగ్‌), బ్రాంచ్ నెట్‌వ‌ర్క్ వంటి వాటి ఆధారంగా కొన్ని పొదుపు ఖాతాల‌ను ఇక్క‌డ ఇచ్చాం. దేశంలో ఏ బ్యాంకు పొదుపు ఖాతా అన్నింటినీ ఒకేలా ఇవ్వ‌దు. కాబ‌ట్టి వీటిల్లోంచి మీకు అనువైన వాటిని ఎంచుకోండి.

మై ఫ‌స్ట్ యెస్ అకౌంట్ (My First Yes Account)

మై ఫ‌స్ట్ యెస్ అకౌంట్ (My First Yes Account)

ఈ ఖాతాను యెస్ బ్యాంక్ ప్ర‌వేశ‌పెట్టింది. దీన్ని ఉత్త‌మ ఖాతాగా ఎంచుకునేందుకు చాలా కార‌ణాల‌ను చూశాం. బ్యాంకు పొదుపు ఖాతాపై వ‌డ్డీ 6 శాతం ఉంది. అన్ని ప్ర‌భుత్వ బ్యాంకులు దాదాపుగా 4 శాతం వ‌డ్డీనే ఆఫ‌ర్ చేస్తున్నాయి. అంతే కాకుండా ఈ యెస్ బ్యాంకు ఖాతాకు నెల‌వారీ క‌నీస నిల్వ రూ. 2500 గా ఉంది. మామూలుగా పెద్ద‌ల‌కు ప్ర‌యివేటు సెక్టార్ బ్యాంకుల్లో ఖాతా కావాలంటే రూ. 10 వేల క‌నీస నిల్వ అడుగుతార‌న్న విష‌యం మీకు తెలిసిందే. ఈ యెస్ బ్యాంక్ పిల్ల‌ల ఖాతాల్లోకి నేరుగా మీ ఖాతా నుంచి డ‌బ్బు బ‌దిలీ చేయ‌వ‌చ్చు.

ఎస్‌బీఐ సేవింగ్స్ అకౌంట్ ఫ‌ర్ మైన‌ర్స్

ఎస్‌బీఐ సేవింగ్స్ అకౌంట్ ఫ‌ర్ మైన‌ర్స్

ఎస్‌బీఐ పిల్ల‌ల కోసం రెండు ర‌కాల ఖాతాల‌ను ప్ర‌వేశ‌పెట్టింది. వాటి పేర్లు ఎస్బీఐ పెహ్లా క‌ద‌మ్‌(SBI Pehla Kadam), పెహ్లా ఉదాన్‌(SBI Pehla udaan). ఇందులో ఉత్త‌మ అంశం ఏంటంటే ఎటువంటి క‌నీస నిల్వ‌(మినిమ‌మ్ బ్యాలెన్స్‌) నిర్వ‌హించాల్సిన అవ‌సరం లేదు. ఖాతాలో సున్నా నిల్వ ఉన్నా ఎలాంటి రుసుములు ఉండ‌వు. డెబిట్ కార్డుపైన పిల్ల‌ల ఫోటోను తెప్పించుకోవ‌చ్చు.ఈ ఖాతాల‌కు ఆటోస్వీప్ స‌దుపాయం ఉంది. మ‌రో ప్ర‌ధాన సానుకూల‌త ఎస్‌బీఐ బ్యాంకు శాఖ‌లు దేశంలోనే అత్య‌ధికంగా ఉన్నాయి. ఇది మంచి ఖాతా అయిన‌ప్ప‌టికీ స‌ర్వీసు(సేవ) విష‌యంలో ప్రైవేటు బ్యాంకు నుంచి ఆశించినంత‌గా ఎస్బీఐ నుంచి ఊహించ‌డానికి లేదు. రిక‌రింగ్ డిపాజిట్ ఖాతా తెరిచేందుకు ఇన్‌స్ట్ర‌క్క్ష‌న్ ఇచ్చే అవ‌కాశం ఉంది. ఈ ఆప్ష‌న్లో పిల్ల‌ల‌కు వ‌డ్డీ ఎలా జ‌మ‌వుతుందో అర్థ‌మ‌వుతుంది. ఖాతాలో ఈ రిక‌రింగ్ డిపాజిట్ ఆప్ష‌న్‌ను ఉప‌యోగించుకోవ‌డం మంచిదే.

స్మార్ట్ స్టార్ సేవింగ్ ఖాతా

స్మార్ట్ స్టార్ సేవింగ్ ఖాతా

దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు అయిన ఐసీఐసీఐ స్మార్ట్ స్టార్ సేవింగ్ అకౌంట్ పేర‌తో పిల్ల‌ల పొదుపు ఖాతాను ప్ర‌వేశ‌పెట్టింది. దీని కింద మీరు రెండు ఖాతాల‌ను తెర‌వొచ్చు. ఒక‌టి సంర‌క్ష‌కుల అనుమ‌తితో ఒక‌టి, సంర‌క్ష‌కుల అనుమ‌తి లేకుండా వాడే మ‌రొక‌టి. మొద‌టి ర‌కం ఖాతాకు రూ. 2 ల‌క్ష‌ల ప‌రిమితి క‌లిగిన డెబిట్ కార్డు ఇస్తున్నారు. సంర‌క్ష‌కుల అనుమ‌తి లేకుండా వాడే ఖాతాకు ఇచ్చే డెబిట్ కార్డు ప‌రిమితి రూ. 50 వేల వ‌ర‌కూ మాత్ర‌మే ఉంటుంది. అయితే 16 ఏళ్ల లోపు పిల్ల‌ల‌కు సంర‌క్ష‌కుల అనుమ‌తి లేని డెబిట్ కార్డును ఇవ్వ‌డం సూచ‌నీయం కాదు. యెస్ బ్యాంకు, కొట‌క్ మ‌హీంద్రా బ్యాంకు అందించే పిల్ల‌ల ఖాతా కంటే ఐసీఐసీఐ పిల్లల ఖాతాలో వ‌చ్చే వ‌డ్డీ త‌క్కువ‌.

ది జూనియ‌ర్ సేవింగ్స్ అకౌంట్ ఫ‌ర్ కిడ్స్‌

ది జూనియ‌ర్ సేవింగ్స్ అకౌంట్ ఫ‌ర్ కిడ్స్‌

కొట‌క్ మ‌హీంద్రా బ్యాంకు ది జూనియ‌ర్ సేవింగ్స్ అకౌంట్ ఫ‌ర్ కిడ్స్‌(the junior savings account for kids) పేరుతో పిల్ల‌ల కోసం ఖాతాను ప్ర‌వేశ‌పెట్టింది. పిల్ల‌ల ఖాతాలో రూ. 1 ల‌క్ష కంటే ఎక్కువ బ్యాలెన్స్ ఉంటే , అందుకు 6% వ‌డ్డీ వ‌స్తుంది. ఒక‌వేళ రూ. 1 ల‌క్ష కంటే త‌క్కువ బ్యాలెన్స్ ఉంటే 5% వ‌డ్డీ వ‌స్తుంది. ఇది చాలా బ్యాంకుల కంటే ఎక్కువే. పిల్ల‌ల‌కు ప్ర‌త్యేక డెబిట్ కార్డు ఇస్తారు. ఈ పిల్ల‌ల ఖాతాల్లో రిక‌రింగ్ డిపాజిట్ ద్వారా చిన్న మొత్తాల్లో పెట్టుబ‌డులు పెట్టొచ్చు. దీని ద్వారా పిల్ల‌ల‌కు నెల‌వారీ క్ర‌మ‌మైన‌ పొదుపు అలవాట్ల‌ను నేర్పించ‌వచ్చు.

ఐడీబీఐ బ్యాంక్ ప‌వ‌ర్ కిడ్స్ అకౌంట్‌

ఐడీబీఐ బ్యాంక్ ప‌వ‌ర్ కిడ్స్ అకౌంట్‌

ఈ ఖాతాకు త్రైమాసిక క‌నీస నిల్వ నిబంధ‌న ఉంది. అయితే ఆ నిల్వ‌ను పాటించ‌క‌పోతే పెనాల్టీ ఏమీ లేదు. ఏటీఎమ్ విత్‌డ్రాయ‌ల్ ప‌రిమితి రూ. 2000 గా ఉంది.

కొన్ని ఫీచ‌ర్లు

త్రైమాసిక క‌నీస నిల్వ పాటించ‌క‌పోతే పెనాల్టీ ఉండ‌దు.

పిల్ల‌ల కోసం ప్ర‌త్యేకించిన ఏటీఎమ్ కార్డు

ప‌ర్స‌న‌లైజ్డ్ చెక్కు పుస్త‌కం

మెయిల్ ద్వారా నెల‌వారీ స్టేట్‌మెంట్ ఉచితం

ఉచిత పాస్‌బుక్

నాన్ మెట్రోల్లో ఇత‌ర బ్యాంకు ఏటీఎమ్‌ల్లో 5 ఉచిత ఏటీఎమ్‌ లావాదేవీల‌కు అవ‌కాశం

కిడ్స్ అడ్వాంటేజ్ అకౌంట్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు

కిడ్స్ అడ్వాంటేజ్ అకౌంట్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు

హెచ్‌డీఎప్‌సీ బ్యాంకు ప్ర‌వేశ‌పెట్టిన పిల్ల‌ల ఖాతా పేరు కిడ్స్ అడ్వాంటేజ్ అకౌంట్‌. త‌ల్లిదండ్రులు అక‌స్మాత్తుగా మ‌ర‌ణిస్తే దీని ద్వారా పిల్ల‌ల‌కు రూ. 1 ల‌క్ష వ‌ర‌కూ విద్యా బీమా(ఎడ్యుకేష‌న్ ఇన్సూరెన్స్) ల‌భిస్తుంది. ఏటీఎమ్ నుంచి పిల్ల‌లు రోజుకు రూ. 2500 వ‌ర‌కూ విత్‌డ్రా చేసుకోగ‌ల వీలుంది. వ‌డ్డీ విష‌యంలో ఇది సాధార‌ణంగానే ఉంది. ఖాతాలోని డ‌బ్బుపై 4 శాతం వ‌డ్డీ వ‌స్తుంది.

జాగ్ర‌త్త‌

జాగ్ర‌త్త‌

మేము సాధ్య‌మైనంత వ‌ర‌కూ స‌రైన స‌మాచారం ఇచ్చేందుకు ప్ర‌య‌త్నించాం. ఇంకా అద‌న‌పు స‌మాచారం కొర‌కై బ్యాంకు వెబ్‌సైట్‌ను చూడొచ్చు లేదా బ్యాంకు శాఖ‌కు వెళ్లి వివ‌రాల‌ను తెలుసుకోవ‌చ్చు. బ్యాంకు నియ‌మ‌నిబంధ‌న‌లు మారుతూ ఉంటాయి. దానికి మేము బాధ్యుల‌ము కాము.

పీఎఫ్ సొమ్మును 5 రోజుల్లో వెనక్కి తెచ్చుకోవ‌డం ఎలా?

పీఎఫ్ సొమ్మును 5 రోజుల్లో వెనక్కి తెచ్చుకోవ‌డం ఎలా?

పీఎఫ్ సొమ్మును 5 రోజుల్లో వెనక్కి తెచ్చుకోవ‌డం ఎలా? పీఎఫ్ సొమ్మును 5 రోజుల్లో వెనక్కి తెచ్చుకోవ‌డం ఎలా?

 దేశంలో టాప్ 10 రియ‌ల్ ఎస్టేట్ కంపెనీలు

దేశంలో టాప్ 10 రియ‌ల్ ఎస్టేట్ కంపెనీలు

 దేశంలో టాప్ 10 రియ‌ల్ ఎస్టేట్ కంపెనీలు దేశంలో టాప్ 10 రియ‌ల్ ఎస్టేట్ కంపెనీలు

గృహ రుణం తీసుకుంటున్నారా? ఈ విష‌యాలు తెలుసుకుంటే మంచిది

గృహ రుణం తీసుకుంటున్నారా? ఈ విష‌యాలు తెలుసుకుంటే మంచిది

 గృహ రుణం తీసుకునేవారు తెలుసుకోవాల్సిన ముఖ్య విష‌యాలు గృహ రుణం తీసుకునేవారు తెలుసుకోవాల్సిన ముఖ్య విష‌యాలు

English summary

పిల్ల‌ల కోసం 6 ఉత్తమ పొదుపు ఖాతాలు | 6 best savings accounts for Kids in India

Kids savings account are ideal, if you wish to inculcate a habit of savings in your children at an early age. However, it is important to remember that the income earned through interest would be clubbed as interest earned by the parent
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X