For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెల్ఫ్ సర్వీస్ మొబైల్ యాప్ 'ఎస్‌బీఐ సమాధాన్‌'

By Nageswara Rao
|

న్యూఢిల్లీ: ఖాతాదారులు బ్యాంకుకు రాకుండానే మరిన్ని సేవలు పొందేందుకు గాను తన వినియోగదారుల కోసం మొబైల్‌ యాప్‌ ‘ఎస్‌బీఐ సమాధాన్‌'ను స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆవిష్కరించింది. ఈ యాప్‌ను ఎస్‌బీఐ ఖాతాదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఖాతాదారులు ‘స్టేట్ బ్యాంక్ సమాధాన్' యాప్ ద్వారా ఏటీఎం లొకేషన్, ఈఎంఐ క్యాలిక్యులేషన్, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్‌నెట్ బ్యాంకింగ్, డిపాజిట్స్, అడ్వాన్సెస్, బ్రాంచ్ వివరాలు లాంటి తదితర సేవలను పొందొచ్చని ఎస్‌బీఐ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇంకా చెప్పాలంటే అకౌంట్‌ స్టేట్‌మెంట్‌, విద్య గృహ రుణాలు తీసుకున్నవారు, ఎంత వడ్డీ చెల్లించామనే వివరాలను తాము నమోదు చేసుకున్న ఇమెయిల్‌కు 24 గంటల్లోగా వస్తుండటం ఈ యాప్‌ ప్రత్యేకత. బ్యాంకులో ఉన్న తమ డిపాజిట్‌ లేదా రుణం వివరాలు తెలుసుకోవచ్చు.

sbi launches state bank samadhaan a self service mobile app

దీంతో పాటు ఎస్‌బీఐ సెలవులతో పాటు ఎస్‌బీఐ ఫ్రీడమ్‌, ఎస్‌బీఐ ఎనీవేర్‌, ఎస్‌బీఐ బడ్డీ, ఎస్‌బీఐ క్విక్‌ వంటి మొబైల్‌ యాప్‌లను తద్వారా వినియోగించుకునే వీలు కలుగుతుంది. బ్యాంకు సేవలకు సంబంధించి ఫిర్యాదు చేసేందుకు, పరిష్కారం ఎక్కడ వరకు వచ్చిందో తెలుసుకునేందుకు ఈ యాప్‌ ఉపయోగపడుతుంది.

వీటితోపాటు ఖాతాదారులు యాప్ ద్వారా వారి ఫిర్యాదులను తెలియజేయవచ్చని, ఆరు నెలల వరకు అకౌంట్ స్టేట్‌మెంట్ వివరాలను పొందొచ్చని పేర్కొంది. ‘స్టేట్ బ్యాంక్ సమాధాన్' యాప్‌ను ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య ఆవిష్కరించారు.

English summary

సెల్ఫ్ సర్వీస్ మొబైల్ యాప్ 'ఎస్‌బీఐ సమాధాన్‌' | sbi launches state bank samadhaan a self service mobile app

State Bank of India launched a Mobile App “State Bank Samadhaan” on Google Play Store. This is a Self-Service App and will enable SBI customers to avail a range of services and obtain commonly sought information, without visiting the branch. The App will provide information about deposits, advances, Internet Banking, Mobile Banking, EMI calculation, SBI Branch and ATM Locations, SBI Holidays and give direct access to various mobile apps viz., SBI Freedom, SBI Anywhere, SBI Buddy, SBI Quick, etc.
Story first published: Wednesday, December 23, 2015, 13:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X