For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐటీ రిటర్న్‌లు దాఖలు చేయడం ఎలా?

By Nageswara Rao
|

ఐటీ రిటర్న్‌లు దాఖలు చేయడం ఇప్పుడు మరితం సులభం. ముందుగా www.incometaxindiaefiling.gov.in లోకి వెళ్లాలి. మీ పాన్ కార్డ్ ఆధారంగా ఇందులో రిజిస్టర్ అవ్వాలి. మీ పుట్టిన తేదీ, మీ పేరు, మొబైల్ నెంబర్ అన్నీ సరిగ్గా పేర్కొంటేనే నమోదు చేసుకోవడానికి వీలవుతుంది.

ఆ తర్వాత వెబ్ సైట్‌లో
పేర్కొన్న వివరాలన్నీ సమర్పిస్తే మీ మెయిల్ ఐడీకి ఒక సమాచారాన్ని పంపిస్తారు. మీరు పైన పేర్కొన్న మొబైల్ నెంబర్‌కు పాస్ వర్డ్ వస్తుంది. ఈ రెండింటి ఆధారంగా మీ ఆన్ లైన్‌లో మీ ఖాతా యాక్టివేట్ అవుతుంది.

అంతక ముందుగానే రిజిస్టర్ అయిన వారు పాన్ కార్డు, పుట్టినతేదీ, పాస్ వర్డ్ ఆధారంగా వెబ్ సైట్‌లోకి నేరుగా లాగిన్ అవ్వొచ్చు. ఒకవేళ పాస్ వర్డ్ మర్చిపోతే, మీ మొబైల్ నెంబర్, ఈ మెయిల్‌కు పాస్‌వర్డ్ పొందడం ద్వారా కొత్త పాస్ వర్డ్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు.

* వెబ్ సైట్లోకి వెళ్లగానే కొత్తగా మీ ఆధార్ సంఖ్యను అనుసంధానించుకోవాల్సిందిగా సమాచారం వస్తోంది. మీకు ఇష్టం అయితే వెంటనే మీ ఆధార్ సంఖ్యను పేర్కొనవచ్చు లేదంటే ఆ తర్వాత అని చెప్పవచ్చు.

How to file it returns?

* Quick e file ITR అనే బటన్‌ను క్లిక్ చేయాలి.

* ఆ తర్వాత మీకు వర్తించే ఐటీఆర్‌ను ఎంపిక చేసుకొని, 2015-16 అసెస్మెంట్ సంతవ్సరాన్ని ఎంపిక చేసుకోవాలి.

* ఆ తర్వాత వచ్చే ఫారంలో మీ వ్యక్తిగత వివరాలు, ఆదాయ వివరాలు, మినహాయింపులు తదితర వివరాలను పూర్తి చేయాలి.

* ఫారం పూర్తి చేసేటప్పుడు మీ పుట్టినతేదీ, చిరునామా, పాన్ నెంబర్, ఈ మెయిల్, ఫోన్ నెంబర్ తదితర వివరాలు తప్పుల్లేకుండా చూసుకోవాలి.

* మీరు చెల్లించిన పన్ను మొత్తం వివరాలను జాగ్రత్తగా నింపాలి.

* రిటర్నుల ఫారంలో కూడా ఆధార్ నెంబర్‌ను పేర్కొంటే మంచిది.

* రిఫండ్ ఉన్నా లేకున్నా, మీ బ్యాంకు ఖాతాల వివరాలను తెలియజేయడం మంచిది.

* కొత్త రిఫండ్ నిబంధనల ప్రకారం ఎన్ని ఖాతాలున్నాయో వాటి సంఖ్యనూ తెలియజేయాలని ఒక నిబంధనను విధించారు.

* మీరు రిఫండ్‌ను ఏ ఖాతాలోకి రావలనుకుంటున్నారో, ఆ ఖాతాకు సంబంధించిన ఐఎఫ్ఎస్‌సీ కోడ్, మీ ఖాతా సంఖ్య తదితర వివరాలను తెలియజేయాలి.

* అన్ని వివరాలను పూర్తి చేసిన తర్వాత 'సబ్‌మిట్' బటన్‌పై గొడితే సరిపోతుంది.

English summary

ఐటీ రిటర్న్‌లు దాఖలు చేయడం ఎలా? | How to file it returns?

How to file it returns?.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X