For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆన్‌లైన్ పోర్ట్‌ల్‌ను ప్రారంభించిన ఇండియన్ బ్యాంక్, యునైటెడ్ ఇండియా ఇన్యూరెన్స్

By Nageswara Rao
|

Indian Bank
చెన్నై: ప్రభుత్వ రంగం సంస్ధలైన ఇండియన్ బ్యాంక్ మరియు యునైటెడ్ ఇండియా ఇన్యూరెన్స్ (యూఐఐసీ) కంపెనీలు సంయుక్తంగా తమ ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించడానికి చేతులు కలిపాయి. దీని ద్వారా ఆన్ లైన్‌లో యునైటెడ్ ఇండియా ఇన్యూరెన్స్ పథకాలను విక్రయించడం, ఇన్సూరెన్స్ రెన్యువల్ ప్రీమియంలు చెల్లించే విధంగా ఓ ప్రత్యేకమైన వెబ్ పోర్టల్‌ని ఇండియన్ బ్యాంక్ సీఎండి టి.ఎం.భాసిన్ బుధవారం లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్బంలో బ్యాంక్ సీఎండి టి.ఎం.భాసిన్ మాట్లాడుతూ 2006 నుండి ఇండియన్ బ్యాంక్ ఖాతాదారులకు ఆరోగ్య రక్ష గ్రూప్ మెడిక్లైమ్ ఇన్సూరెన్స్ పాలసీని అందిస్తుందన్నారు. ఫ్లోటర్ విధానం ద్వారా అధిక ప్రీమియం అందిస్తున్న పాలసీ ఇది. గత ఆర్థిక సంవత్సరంలో యూఐఐసీకి చెందిన రూ.31 కోట్ల విలువైన పాలసీలను విక్రయించడం ద్వారా రూ.3.23 కోట్ల ప్రీమియం ఆదాయాన్ని ఆర్జించామని, ఇప్పుడది మరింత పెరుగుతుందన్న ఆశాభావాన్ని భాసిన్ వ్యక్తం చేశారు.

కొత్తగా ప్రారంభించిన ఆన్ లైన్ పోర్టల్ ద్వారా ఈ సంవత్సరం 10,000 పాలసీలను విక్రయించడం ద్వారా కనీసం రూ.20 కోట్ల కమీషన్ ఆదాయాన్ని పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. యునైటెడ్ ఇండియా ఇన్యూరెన్స్ లో ఉన్న మిగతా పాలసీలను కూడా త్వరలోనే ఆన్‌లైన్ పోర్టల్‌కి అనుసంధానిస్తామన్నారు. ఇలా అన్ని ఆన్‌లైన్ కావడం వలన సిబ్బందిపై ఒత్తిడి తగ్గడంతో పాటు.. పాలసీల ప్రక్రియ వేగవంతం అవుతుందని పేర్కొన్నారు.

వన్ఇండియా మనీ తెలుగు

English summary

ఆన్‌లైన్ పోర్ట్‌ల్‌ను ప్రారంభించిన ఇండియన్ బ్యాంక్, యునైటెడ్ ఇండియా ఇన్యూరెన్స్ | Indian Bank, United India Insurance launch portal | ఆన్‌లైన్‌లో లాంఛనంగా ప్రారంభమైన వెబ్ పోర్టల్

State-run Indian Bank and United India Insurance Company (UIIC) have joined hands to launch a webportal offering online entry and renewal of group insurance policies.
Story first published: Thursday, June 13, 2013, 15:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X