For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ డిపాజిట్స్ పైన 8 శాతం కంటే ఎక్కువ వడ్డీ రేటు అందించే బ్యాంకులు

|

తక్కువ రిస్క్, స్వల్ప వ్యక్తిగత ఫైనాన్స్ లక్ష్యం కోసం చాలామంది ఇన్వెస్టర్లు రికరింగ్ డిపాజిట్స్(RD) వైపు మొగ్గు చూపుతారు. తక్కువ వడ్డీ రేటు ఉన్నప్పటికీ ఇది సురక్షిత పెట్టుబడి సాధనం. ఫిక్స్డ్ డిపాజిట్స్ మాదిరి ఫిక్స్డ్ ఇన్‌కం స్కీంలలో రికరింగ్ డిపాజిట్స్ కూడా అత్యంత ప్రాచుర్యం పొందినది. సీనియర్ సిటిజన్లు కూడా ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపుతారు. ప్రతి నెల రికరింగ్ డిపాజిట్స్‌లో చాలామంది ఇన్వెస్ట్ చేస్తారు. దీనిపై వడ్డీ వస్తుంది. రికరింగ్ డిపాజిట్స్ కూడా ఫిక్స్డ్ డిపాజిట్ మాదిరిగానే వడ్డీ రేట్లు కలిగి ఉంటాయి. అలాగే DICGC నుండి రూ.5 లక్షల వరకు డిపాజిట్ బీమా ఉంటుంది.

ఇవి గమనించండి...

ఇవి గమనించండి...

రికరింగ్ డిపాజిట్స్‌కు పన్ను మినహాయింపులు ఉండవనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. అలాగే, మెచ్యూరిటీకి ముందే ఉపసంహరించుకుంటే జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుంది. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టలేని వారికి, తక్కువ ఆదాయంతో పెట్టుబడి పెట్టలేని వారికి సిప్ తరహా రికరింగ్ డిపాజిట్ ఓ మంచి మార్గం. ఫిక్స్డ్ డిపాజిట్ నుండి రికరింగ్ డిపాజిట్ వరకు సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేటు కాస్త ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో సీనియర్ సిటిజన్లకు ఉత్తమ వడ్డీ రేట్లు అందించే రికరింగ్ డిపాజిట్స్ తెలుసుకుందాం....

10 స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు

10 స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు

- నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు వడ్డీ రేటు 8.00%, 2 ఏళ్లకు,

- ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు వడ్డీ రేటు 7.50%, 24 నెలల నుండి 36 నెలలు,

- ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 7.25%, 27 నెలల నుండి 60 నెలలు,

- జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు వడ్డీ రేటు 7.25%, 36 నెలల నుండి 60 నెలలు,

- ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు వడ్డీ రేటు 7.25%, 59 నెలల 1 రోజు నుండి 66 నెలలు,

- ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు వడ్డీ రేటు 7.00%, 90 నెలల నుండి 120 నెలలు,

- ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 7.00%, 365 రోజులు & 366 రోజులు,

- సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు వడ్డీ రేటు 6.75%, 12 నెలల నుండి 18 నెలలు,

- క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు వడ్డీ రేటు 6.75%, 900 రోజులు,

- AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు వడ్డీ రేటు 6.75%, 25 నెలల నుండి 36 నెలలు మరియు 61 నెలల నుండి 120 నెలలు.

టాప్ 10 ప్రయివేటు రంగ బ్యాంకులు

టాప్ 10 ప్రయివేటు రంగ బ్యాంకులు

- యస్ బ్యాంకు వడ్డీ రేటు 7.25%, 5 ఏళ్ల నుండి 10 ఏళ్ల వరకు,

- RBL బ్యాంకు వడ్డీ రేటు 7.00%, 60 నెలల నుండి 60 నెలల 1 రోజు,

- DCB బ్యాంకు వడ్డీ రేటు 7.00%, 36 నెలల నుండి 120 నెలల వరకు,

- బంధన్ బ్యాంకు వడ్డీ రేటు 6.75%, 1 ఏడాది నుండి 3 ఏళ్లు,

- ఇండస్ఇండ్ బ్యాంకు వడ్డీ రేటు 6.50%, 12 నెలల నుండి 61 నెలలు,

- IDFC ఫస్ట్ బ్యాంకు 6.50%, 36 నెలల నుండి 60 నెలలు,

- యాక్సిస్ బ్యాంకు వడ్డీ రేటు 6.50%, 5 ఏళ్ల నుండి 10 ఏళ్లు,

- ICICI బ్యాంకు వడ్డీ రేటు 6.30%, 5 ఏళ్ల పై నుండి 10 ఏళ్లు,

- HDFC బ్యాంకు వడ్డీ రేటు 6.00%, 90 నెలల నుండి 120 నెలలు.

- కొటక్ మహీంద్రా బ్యాంకు వడ్డీ రేటు 5.75%, 5 ఏళ్ల నుండి 10 ఏళ్లు.

పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు

పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు

- బ్యాంక్ ఆఫ్ బరోడా వడ్డీ రేటు 6.25%, 3 ఏళ్ల నుండి 10 ఏళ్లు,

- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటు 6.20%. 5 ఏళ్ల నుండి 10 ఏళ్లు,

- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటు 6.10%, 5 ఏళ్ల నుండి 10 ఏళ్లు,

- కెనరా బ్యాంకు వడ్డీ రేటు 6.00%, 3 ఏళ్ల నుండి 10 వడ్డీ రేటు ,

- పంజాబ్ & సింద్ బ్యాంకు వడ్డీ రేటు 5.80%, 3 ఏళ్ల నుండి 10 ఏళ్లు,

- IDBI బ్యాంకు వడ్డీ రేటు 5.80%, 3 ఏళ్ల నుండి 5 ఏళ్లు,

- పంజాబ్ నేషనల్ బ్యాంకు 5.75%, 3 ఏళ్ల నుండి 10 ఏళ్లు,

- ఇండియన్ బ్యాంకు వడ్డీ రేటు 5.75%, 3 ఏళ్ల నుండి 5 ఏళ్లు,

- ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు వడ్డీ రేటు 5.70%, 444 రోజుల నుండి 3 ఏళ్లు,

- బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటు 5.65%, 2 ఏళ్ల నుండి 10 సంవత్సరాలు.

English summary

ఈ డిపాజిట్స్ పైన 8 శాతం కంటే ఎక్కువ వడ్డీ రేటు అందించే బ్యాంకులు | 10 Banks Offering Returns Up To 8 percent On Recurring Deposits

Among the debt investors having a low-risk appetite and a short personal finance goal to meet from the assured returns of their investments, investing in recurring deposits (RD) is a smart option to opt for.
Story first published: Sunday, August 1, 2021, 9:07 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X