For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Zydus Cadila: స్కీజోఫ్రేనియా: అమెరికాలో ఆ జెనెరిక్ టాబ్లెట్

|

అహ్మదాబాద్: గుజరాత్ ఆర్థిక రాజధాని అహ్మదాబాద్‌ ప్రధాన కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలను కొనసాగిస్తోన్న ప్రముఖ ఫార్మాసూటికల్స్ కంపెనీ జైడస్ క్యాడిలా (Zydus Cadila) మరో ఘనతను సాధించింది. ఈ సంస్థ అభివృద్ధి చేసిన జెనెరిక్ టాబ్లెట్లు అగ్రరాజ్యం అమెరికాలో వినియోగంలోకి రాబోతోన్నాయి. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (USFDA) అనుమతి ఇచ్చింది. కొన్ని రకాల మానసిక వ్యాధితో బాధపడుతోన్న వారికి అందించే ట్రీట్‌మెంట్‌లో దీన్ని వినియోగించాల్సి ఉంటుంది.

స్కీజోఫ్రేనియా సహా కొన్ని రకాల మానసిక వ్యాధులు, డిప్రెషన్‌తో బాధపడుతోన్న వారికి అందించే చికిత్సలో భాగంగా తాము అభివృద్ధి చేసిన జెనెరిక్ టాబ్లెట్ల వినియోగానికి యూఎస్ఎఫ్‌డీఏ అనుమతి ఇచ్చినట్లు జైడస్ క్యాడిలా వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఫ్లూఫెనాజైన్ హైడ్రోక్లోరైడ్ రూపంలో ఈ టాబ్లెట్లను అభివృద్ధి చేసినట్లు తెలిపింది. న్యూరోలెప్టిక్, ఫెనోథియాజైన్స్ ఆధారంగా దీన్ని రూపొందించినట్లు వెల్లడించింది. 1 ఎంజీ, 2.5 ఎంజీ, 5 ఎంజీ, 10 ఎంజీ స్ట్రెంగ్త్‌తో జెనెరిక్ వర్షన్‌తో ఈ టాబ్లెట్లను అభివృద్ధి చేసినట్లు వివరించిందా సంస్థ యాజమాన్యం.

Zydus Cadila receives USFDA approval to market generic drug for used in the treatment

కాగా- ఇదే సంస్థ ప్రాణాంతక కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సిన్‌ను కూడా అభివృద్ధి చేస్తోంది. జైకోవీ-డీ (ZyCoV-D) పేరుతో దీన్ని తయారు చేస్తోంది. ప్లాసిడ్ డీఎన్ఏ వ్యాక్సిన్ ఇది. అన్నీ సవ్యంగా సాగితే జూన్ రెండోవారం నాటికి- ఈ వ్యాక్సిన్‌ను అత్యవసర పరిస్థితుల్లో వినియోగంలోకి తీసుకుని రావడానికి అవసరమైన దరఖాస్తులను డ్రగ్ కంట్రోలర్ జనరల్‌కు అందే అవకాశాలు ఉన్నాయి. 12 నుంచి 17 సంవత్సరాల లోపు వయస్సున్న వారిపైనా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది జైడస్ క్యాడిలా. 28 వేల మంది వలంటీర్లపై ట్రయల్స్ పూర్తి చేసింది.

English summary

Zydus Cadila: స్కీజోఫ్రేనియా: అమెరికాలో ఆ జెనెరిక్ టాబ్లెట్ | Zydus Cadila receives USFDA approval to market generic drug for used in the treatment

Drug firm Zydus Cadila on Saturday said it has received final approval from the US health regulator to market Fluphenazine Hydrochloride tablets, used in the treatment of certain type of mental ailments.
Story first published: Saturday, May 29, 2021, 17:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X