For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Zomato Blinkit Deal: 10 నిమిషాల్లో కిరాణా సరకులు అందిచబోతున్న జొమాటో.. భారీ మెుత్తానికి డీల్..

|

Zomato Deal With Blinkit: దేశంలో ఆన్‌లైన్‌ ఫుడ్ డెలివరీ సేవలను అందిస్తున్న జొమాటో.. త్వరలోనే బ్లింకిట్‌ను కొనుగోలు చేయబోతోంది. జొమాటో బ్లింకిట్ కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను రూ. 4,447.48 కోట్లకు సొంతం చేసుకోవాలని యోచిస్తోంది. షేర్ల మార్పిడి విధానం ద్వారా ఈ డీల్ జరుగుతుందని శుక్రవారం స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు పంపిన కమ్యూనికేషన్‌లో జొమాటో వెల్లడించింది. అయితే ఈ డీల్ ఆగస్ట్ నాటికి‌ ఖరారయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

పెట్టుబడి వ్యూహంలో భాగంగా..

పెట్టుబడి వ్యూహంలో భాగంగా..

డీల్‌లో భాగంగా జొమాటో 629 మిలియన్ షేర్‌లను జారీ చేస్తుంది. ఇది 6.88% ఈక్విటీ వాటాను పూర్తిగా డైల్యూటెడ్ ప్రాతిపదికన, ఒక్కో షేరుకు రూ.70.76 ధరకు కేటాయించనున్నట్లు Zomato రెగ్యులేటరీ తన ఫైలింగ్‌లో వెల్లడించింది. జొమాటో షేరు శుక్రవారం BSEలో రూ.70.35 వద్ద ముగిసింది. ఈ డీల్ గురించి ప్రకటన వెలువడక ముందే షేర్ విలువ 1.15 శాతం మేర పెరిగింది. ఇలా డీల్ విలువ రూ.4,447.48 కోట్లుగా ఉంది. ఈ డీల్ ఫాస్ట్ డెలివరీ వ్యాపారంలో పెట్టుబడి పెట్టేందుకు కంపెనీ వ్యూహానికి అనుగుణంగా ఉందని జొమాటో చెబుతోంది.

మునుపటి కంటే తక్కువ ధరకు ఒప్పందం..

మునుపటి కంటే తక్కువ ధరకు ఒప్పందం..

గత సంవత్సరం Blinkit వ్యాల్యుయేషన్ ఒక బిలియన్ కంటే ప్రస్తుతం జరుగుతున్న డీల్ 40 శాతం తక్కువని తెలుస్తోంది. ఆ సమయంలో కంపెనీ Zomato, టైగర్ గ్లోబల్ నుంచి సుమారు 120 మిలియన్ డాలర్లను సేకరించి యునికార్న్‌గా మారింది. ఇప్పటి వరకు కిరాణా సరకుల డెలివరీ వ్యాపారంలో మార్కెట్‌ను స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, రిలయన్స్ డన్జో, జియో మార్ట్, జెప్టో, బిగ్ బాస్కెట్ వంటి దిగ్గజాలు కీలక ప్రేయర్లుగా అవతరించాయి. అయితే వీటికి పోటీగా బ్లింకిట్ కూడా ఈ రంగంలో తన ప్రస్థానాన్ని ప్రారంభించింది.

Zomato భవిష్యత్తు ప్రణాళికలు..

Zomato భవిష్యత్తు ప్రణాళికలు..

బ్లింకిట్ వ్యవస్థాపకుడు అల్బిందర్ ధిండ్సా. ఈ కంపెనీ గ్రోసరీ ప్లేయర్ బిగ్ బాస్కెట్ వంటి కంపెనీలకు పోటీదారుగా ఉంది. జొమాటో రానున్న కాలంలోనూ బ్లింకిట్, జొమాటోలను వేరుగానే కొనసాగించనున్నట్లు స్పష్టం చేసింది. Zomato మూడో ప్రయత్నంలో Blinkitను కొనుగోలు చేసింది. వచ్చే రెండేళ్లలో బ్లింకిట్ పై 400 మిలియన్ డాలర్ల పెట్టుబడులను పెట్టాలని జొమాటో ప్లాన్ చేస్తోంది. జొమాటో కూడా బ్లింకిట్‌కి ఇంతకు ముందు రూ. 1,125 కోట్ల రుణాన్ని ఇచ్చింది. అందులో రూ. 575 కోట్లు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో ఫుడ్ డెలివరీ దిగ్గజం దేశంలో మరో భారీ డీల్ కు తెలతీసిందని చెప్పుకోవాలి.

English summary

Zomato Blinkit Deal: 10 నిమిషాల్లో కిరాణా సరకులు అందిచబోతున్న జొమాటో.. భారీ మెుత్తానికి డీల్.. | zomato to acquire blinkit grocery business for an amount of 4447 crores in india

zomato made deal to acquire blinkit business in india
Story first published: Saturday, June 25, 2022, 15:07 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X