బోర్డు డైరెక్టర్‌గా అద్దేపల్లి: మరో అయిదుమంది: కోర్టుకెక్కిన జీ ఎంటర్‌టైన్‌మెంట్
ముంబై: దేశంలో టాప్ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ హౌస్‌లల్లో ఒకటైన జీ ఎంటర్‌ప్రైజెస్.. కోర్టు మెట్లెక్కింది. ఇన్వెస్కో, ఓఎఫ్ఐ గ్లోబల్ చైనా ఫండ్‌కు వ్యతిరేకంగా బోంబే హైకోర్టులో పిటీషన్‌ను దాఖలు చేసింది. తమ గ్రూప్ కంపెనీల్లో అత్యధిక పెట్టుబడులను పెట్టిన ఇన్వెస్కో, ఓఎఫ్‌ఐ చైనా ఫండ్ చేస్తోన్న డిమాండ్లు న్యాయబద్ధమైనవి కావంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఎక్స్‌ట్రార్డినరీ జనరల్ మీటింగ్ (ఈజీఎం)ను చట్టవ్యతిరేకమైనదిగా ప్రకటించాలంటూ ఇన్వెస్కో, ఓఎఫ్ఐ గ్లోబల్ చైనా ఫండ్ చేస్తోన్న డిమాండ్ సరికాదంటూ తన పిటీషన్‌లో పేర్కొంది.

బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పునర్వ్యవస్థీకరణ..
ఇన్వెస్కో, ఓఎఫ్ఐ గ్లోబల్ చైనా ఫండ్‌కు జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్‌లో వాటాలు ఉన్నాయి. ఈ రెండు కంపెనీలకు పెట్టుబడులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వెంటనే ఎక్స్‌ట్రార్డినరీ జనరల్ మీటింగ్‌ను ఏర్పాటు చేయాలని, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌ను పునర్వ్యవస్థీకరించాలంటూ ఈ రెండు కంపెనీలు జీ ఎంటర్‌టైన్‌మెంట్ యాజమాన్యంపై ఒత్తిడిని తీసుకొస్తున్నాయి. దీనితో పాటు మేనేజింగ్ డైరెక్టర్ పునీత్ గోయెంకాను తొలగించాలనేది కూడా ఈ రెండు కంపెనీల డిమాండ్.

జీ వాదన ఏంటీ?
ఈ డిమాండ్ సరైంది కాదని, చట్టబద్ధత లేదనేది జీ ఎంటర్‌టైన్‌మెంట్ యాజమాన్యం వాదన. ఇన్వెస్కో, ఓఎఫ్ఐ గ్లోబల్ చైనా ఫండ్ చేసిన డిమాండ్‌ను తోసిపుచ్చుతూ శుక్రవారమే బోర్డు డైరెక్టర్లు ఓ తీర్మానం కూడా చేశారు. తాజాగా- బోంబే హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసినట్లు జీ ఎంటర్‌టైన్‌మెంట్స్ తెలిపింది. ఇన్వెస్కో డెవలపింగ్ మార్కెట్స్ ఫండ్ అండ్ ఓఎఫ్ఐ గ్లోబల్ చైనా ఫండ్ ఎల్ఎల్‌సీ చేస్తోన్న డిమాండ్ చట్ట వ్యతిరేకమైనదని, దానికి విలువ లేదని ఆదేశాలను ఇవ్వాలని బోంబే హైకోర్టును ఆశ్రయించినట్లు పేర్కొంది.

17.88 శాతం వాటా..
ఇన్వెస్కో డెవలపింగ్ మార్కెట్స్ ఫండ్ అండ్ ఓఎఫ్ఐ గ్లోబల్ చైనా ఫండ్ ఎల్ఎల్‌సీలకు జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్‌లో 17.88 శాతం వాటాలు ఉన్నాయి. మేనేజింగ్ డైరెక్టర్ హోదా నుంచి పునీత్ గోయెంకాతో పాటు మరో ఇద్దరు డైరెక్టర్లను తొలగించడంతో పాటు వారి స్థానంలో తాము సూచించిన ఆరు మందిని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌గా నియమించాలంటూ డిమాండ్ చేసింది. ఈ మేరకు కిందటి నెల 11వ తేదీన ఓ లేఖ రాసింది. దీనికోసం ఎక్స్‌ట్రార్డినరీ జనరల్ మీటింగ్‌ను నిర్వహించాలని సూచించింది.

ఆరుమందిని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా..
అలాగే- సురేంద్ర సింగ్ సిరోహి, నైనా కృష్ణమూర్తి, రోహన్ ధమీజా, అరుణ శర్మ, అద్దేపల్లి శ్రీనివాస రావు, గౌరవ్ మెహతాలను తీసుకోవాలంటూ ఇన్వెస్కో, ఓఎఫ్ఐ గ్లోొబల్ చైనా ఫండ్ డిమాండ్ చేశాయి. జీ ఎంటర్‌టైన్‌మెంట్ మెగా విలీనాన్ని ప్రకటించిన వారం రోజుల తరువాత సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా, ఇన్వెస్కో.. ఎక్స్‌ట్రార్డినరీ జనరల్ మీటింగ్ కోసం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాయి. దీనికి సంబంధించిన పిటీషన్ సోమవారం విచారణకు రావాల్సి ఉంది.

వారిని తొలగించినా..
ఇన్వెస్కో సూచించిన విధంగా తాము ఇదివరకే అశోక్ కురియన్, మనీష్ చొక్కానీలను తొలగించామని పేర్కొంది. ఇప్పుడు మళ్లీ తమ మేనేజింగ్ డైరెక్టర్ పునీత్ గోయెంకాను సైతం తప్పించాలంటూ ఇన్వెస్కో డెవలపింగ్ మార్కెట్స్ ఫండ్ డిమాండ్ చేయడం సరికాదని జీ ఎంటర్‌టైన్‌మెంట్ తన పిటీషన్‌లో పేర్కొంది. ఆ కంపెనీ సూచించిన ఆరుమందిని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌గా తీసుకోమనడం సహేతుకం కాదని తెలిపింది. ఈ పరిణామాల మధ్య జీ ఎంటర్‌టైన్‌మెంట్ యాజమాన్యం బోంబే హైకోర్టును ఆశ్రయించడం.. ఈ గొడవ మరో మలుపు తిరిగినట్టయింది.