For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జగన్ ప్రభుత్వం ఎఫెక్టా?: రంగంలోకి కేంద్రం, పెట్టుబడులపై MEA కీలక లేఖ

|

న్యూఢిల్లీ: భారత్‍‌లో పెట్టుబడులు సురక్షితమని అంతర్జాతీయ కంపెనీలకు భరోసా కల్పించడమే లక్ష్యంగా విదేశీ వ్యవహారాల శాఖ (MEA) కీలక ప్రతిపాదన చేసింది. ప్రపంచస్థాయి ఆర్థిక సంస్థలు పెట్టుబడులు పెట్టిన కంపెనీలతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందాలను ఇష్టారీతిన రద్దు చేసుకోకుండా ప్రత్యేక నిబంధన రూపొందించాలని 15వ ఆర్థిక సంఘానికి లేఖ రాసింది. గత తెలుగుదేశం హయాంలోని పలు సౌర, పవన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (PPA)లను సమీక్షిస్తామని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించడంపై ఆందోళనలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో MEA ఆర్థిక సంఘాన్ని ఆశ్రయించినట్లుగా తెలుస్తోందని అంటున్నారు.

ఆరోగ్యశ్రీకి అర్హతలు ఇవే: కారు, భూమి, ఇల్లు, ఆదాయం ఎంత ఉండాలంటేఆరోగ్యశ్రీకి అర్హతలు ఇవే: కారు, భూమి, ఇల్లు, ఆదాయం ఎంత ఉండాలంటే

ఫిర్యాదు చేస్తామని..

ఫిర్యాదు చేస్తామని..

పెట్టుబడులు పెట్టిన అంతర్జాతీ కంపెనీలతో ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వాలు వాటి ఇష్టానుసారం రద్దు చేయకుండా చర్యలు తీసుకోవాలని విదేశీ వ్యవహారాల శాఖ..15వ ఆర్థిక సంఘానికి లేఖ రాసింది. పీపీఏల్ని సమీక్షించాలన్న నిర్ణయంపై పలు అంతర్జాతీయ సంస్థలు కేంద్రానికి రాష్ట్రానికి లేఖలు రాశాయి. తమ అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ఏపీ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తూ, మధ్యవర్తిత్వ వేదికకు ఫిర్యాదు చేస్తామని కూడా కొన్ని సంస్థలు హెచ్చరించినట్లుగా వార్తలు వచ్చాయి.

చట్టపరమైన చర్యలకు మొగ్గు

చట్టపరమైన చర్యలకు మొగ్గు

అంతేకాదు, ఆంధ్రప్రదేశ్ దారిలో ఇతర రాష్ట్రాలు నడిచే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశాయి. కాగా, విదేశీ పెట్టుబడిదారుల ఆందోళన పరిగణలోకి తీసుకొని పరిష్కరించాలని లేదంటే వైసీపీ నేతృత్వంలోని ప్రభుత్వంపై చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు కొన్ని సంస్థలు మొగ్గు చూపుతాయని అంటున్నారు.

కేంద్రానికి చిక్కులు.. నివారణ దిశగా మోడీ ప్రభుత్వం

కేంద్రానికి చిక్కులు.. నివారణ దిశగా మోడీ ప్రభుత్వం

ఓ రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేసినా పెట్టుబడుల ప్రభావం కేంద్రానికి, భారత్‌కు తాకుతుందని అంటున్నారు. కేంద్రం ఈ కేసులో ఓ పార్టీగా కూడా ఉండవలసి ఉంటుందని చెబుతున్నారు. ఇది కాకుండా పెట్టుబడులపై ప్రభావం పడుతుందని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో పాత ఒప్పందాలను తిరగదోడే అవకాశాలు ఉండవని భరోసా కల్పించేలా ఉండాలని MEA.. 15వ ఆర్థిక సంఘానికి లేఖ రాసినట్లుగా చెబుతున్నారు. పెట్టుబడులకు ఇబ్బందులు రాకుండా కేంద్రం నివారణ చర్యలు ప్రారంభించిందని అంటున్నారు. అందుకే ఈ లేఖ అని చెబుతున్నారు.

వివిధ కంపెనీల పెట్టుబడి

వివిధ కంపెనీల పెట్టుబడి

ఆంధ్రప్రదేశ్, వివిధ రాష్ట్రాల్లో జపాన్, అబుదాబి, కెనడా, అమెరికా, సింగపూర్ కంపెనీలు తమ సావరీన్, పెన్షన్ ఫండ్ నిధులను పెట్టుబడులుగా పెట్టాయి. సంప్రదాయేతర విద్యుదుత్పత్తి సంస్థల్లో వీటిని ఇన్వెస్ట్ చేశాయి. కొన్ని కంపెనీలు నేరుగా వచ్చాయి. అయితే ప్రభుత్వం మారిన తర్వాత దాదాపు 7వేల మెగావాట్ల సౌర, పవన విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల పరిస్థితి అయోమయంలో పడిందట. రూ.40వేల కోట్ల పెట్టుబడులు ఆందోళనకరంగా మారాయి. దీనిపై వివిధ దేశాల రాయబారులు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌కు కూడా లేఖ రాశారు. కేంద్రం కూడా పీపీఏలపై ఏపీ ప్రభుత్వానికి సూచనలు చేసింది. పీపీఏల సమీక్ష సరికాదని తెలిపింది.

ఇటీవలే లూలూ గ్రూప్ గుడ్‌బై

ఇటీవలే లూలూ గ్రూప్ గుడ్‌బై

ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో ఏ ప్రాజెక్టుల్లోను తాము పెట్టుబడులు పెట్టకూడదని నిర్ణయించినట్లు లూలూ గ్రూప్ గ్రూప్ రెండు రోజుల క్రితం ప్రకటించింది. తెలంగాణ, తమిళనాడు, కేరళ, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో మాత్రమే యథావిధిగా షెడ్యూల్ ప్రకారం ఇన్వెస్ట్ చేస్తామని లూలూ గ్రూప్ ఇండియా డైరెక్టర్ అనంత్ రామ్ అన్నారు.

ఇక దూరం..

ఇక దూరం..

విశాఖ నగరానికి కన్వెన్షన్, షాపింగ్ హబ్‌గా ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చేలా ఇంటర్నేషనల్ స్థాయి కన్వెన్షన్ సెంటర్, షాపింగ్ మాల్, ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణాలను చేపట్టాలని లూలూ సంస్థ భావించింది. ఇందుకు రూ.2,200 కోట్లు ఇన్వెస్ట్ చేయాలని, స్థానిక యువతకు 7వేల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని భావించినట్లు అనంత్ రామ్ తెలిపారు. బిడ్డింగ్‌లో భూమిని లీజుకు పొంది, డిజైన్లు తయారు చేయించుకున్నట్లు చెప్పారు. దీనికి భారీగా ఖర్చు చేశారు. అయితే లూలూ సంస్థకు కేటాయించిన భూములను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిని సమ్మతిస్తూ, ఇక ప్రస్తుతం పెట్టుబడులు పెట్టవద్దని నిర్ణయించుకుంది.

English summary

జగన్ ప్రభుత్వం ఎఫెక్టా?: రంగంలోకి కేంద్రం, పెట్టుబడులపై MEA కీలక లేఖ | YS Jagan government affect: MEA wirtes letter to 15th finance commission

YS Jagan Mohan Reddy government affect. MEA wirtes letter to 15th finance commission over Foreign direct investment.
Story first published: Thursday, November 21, 2019, 15:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X