For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Yes bank crisis: హఠాత్తుగా ఆరో అతిపెద్ద బ్యాంకుగా.. 13 రోజుల్లోనే

|

యస్ బ్యాంకు కస్టమర్లకు శుభవార్త. బుధవారం (మార్చి 18)న ఆర్బీఐ మారటోరియం ఎత్తివేయనుంది. దీంతో సాయంత్రం 6 గంటల నుండి అన్ని ట్రాన్సాక్షన్స్ యథాస్థితికి చేరుకుంటాయి. గత ఏప్రిల్ 3వ తేదీన ఈ బ్యాంకు ట్రాన్సాక్షన్లపై ఆర్బీఐనిషేధం విధించింది. బ్యాంకు బోర్డు రద్దు, కొత్త సీఈవో నియామకం, వివిధ బ్యాంకులు పెట్టుబడులు పెట్టడం వంటి నిర్ణయాలతో 13 రోజుల్లోనే యస్ బ్యాంకు సంక్షోభం ముగింపుకు వచ్చింది. ఈ నేపథ్యంలో కస్టమర్లు నేటి నుండి బ్యాంకు, ఏటీఎం సేవలు ఉపయోగించుకోవచ్చు.

కస్టమర్లకు అంత వడ్డీ ఇవ్వలేం, రూ.10,000 కోట్లు వసూలుకస్టమర్లకు అంత వడ్డీ ఇవ్వలేం, రూ.10,000 కోట్లు వసూలు

రూ.1,441 కోట్ల వ్యాల్యూ నుండి..

రూ.1,441 కోట్ల వ్యాల్యూ నుండి..

మార్చి 6వ తేదీన యస్ బ్యాంకు లిమిటెడ్ వ్యాల్యూ ఇంట్రాడేలో రూ.1,441 కోట్లకు పడిపోయింది. అలాంటి సమయంలో ఈ ప్రయివేటు సెక్టార్ మళ్లీ ఇంతలా పుంజుకుంటుందని చాలామంది ఊహించకపోయి ఉంటారు. కానీ రెండు వారాలు గడవకముందే తిరిగి గతంలో బాగున్నప్పటి స్థితికి చేరుకుంది.

రూ.58.64కు షేర్ ధర

రూ.58.64కు షేర్ ధర

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం సహకారం, ఎస్పీఐ సహా వివిధ బ్యాంకుల సహకారంతో యస్ బ్యాంకు పుంజుకుంది. పెద్ద మొత్తంలో లిక్విడిటీ ఉండే పరిస్థితులు వచ్చాయి. దీంతో యస్ బ్యాంకు షేర్లు పుంజుకున్నాయి. మార్చి 6న ఓ సమయంలో రూ.5.50కి పడిపోయిన షేర్ మంగళవారం (మార్చి 17) రూ.58.65కు చేరుకుంది.

భారీగా పెరిగిన వ్యాల్యూ

భారీగా పెరిగిన వ్యాల్యూ

మంగళవారం నాడు యస్ బ్యాంకు వ్యాల్యూ ఏకంగా రూ.73,600 కోట్లకు చేరుకుంది. ఇండస్ ఇండ్ బ్యాంకు వ్యాల్యూ రూ.42,000 కోట్లను దాటేసింది. యస్ బ్యాంకు వ్యాల్యూ ఇప్పుడ గతంలో కంటే భారీగా పెరిగింది. ఈ ప్రయివేటు సెక్టార్ బ్యాంకు వ్యాల్యూ ఇప్పుడు బ్యాంక్ ఆప్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంకు, బ్యాంక్ ఆప్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంటే ఎక్కువగా ఉంది. మార్కెట్ క్యాప్ పరంగా యస్ బ్యాంకు ఇప్పుడు ఆరో బ్యాంకుగా ఉంది.

English summary

Yes bank crisis: హఠాత్తుగా ఆరో అతిపెద్ద బ్యాంకుగా.. 13 రోజుల్లోనే | Yes Bank has suddenly become the sixth largest bank by market cap

On 6 March, the market value of Yes Bank Ltd fell to as low as Rs 1,441 crore in intraday trading. It then seemed like there is no hope left for the private sector lender.
Story first published: Wednesday, March 18, 2020, 10:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X