For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Yes Bank: వేలకోట్లు బిల్డింగ్స్ అమ్మి విదేశాలకు.. రానా స్కెచ్, రూ.20,000 కోట్లపై కూపీలాగుతున్న ఈడీ

|

కార్యకలాపాల్లో ఆర్థిక అవకతవకలు, అధికార దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో అరెస్టైన యస్ బ్యాంకు వ్యవస్థాపకులు రానా కపూర్ చుట్టూ ఈడి ఉచ్చు బిగుస్తోంది. తాజాగా ఆయన ఆస్తులపై ఈడీ దృష్టి సారించింది. ఢిల్లీలో ప్రధాన ప్రాంతాలైనా 40 అమృత షెర్గిల్ రోడ్డు, చాణిక్యపురిలోని 18 కౌటిల్య రోడ్డు, సర్దార్ పటేల్ రోడ్డులోని రూ.1,000 కోట్ల విలువ చేసే ఆస్తులను ఈడీ గుర్తించింది. రానా భార్య బిందుకపూర్ పేరున ఈ ఆస్తులు ఉన్నాయి.

యస్ బ్యాంకు సంక్షోణం, మరిన్ని కథనాలు

అరెస్ట్‌కు ముందు అమ్మకానికి..

అరెస్ట్‌కు ముందు అమ్మకానికి..

రానాకపూర్ తాను అరెస్టు కావడానికి ముందు వీటిని అమ్మడానికి ప్రయత్నాలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అతని భార్య, కూతుళ్లను దేశం విడిచి వెళ్లవద్దని దర్యాఫ్తు సంస్థలు ఆదేశించాయి. వారి కదలికలపై దృష్టి సారించాయి.

విదేశాల్లోని ఆస్తులపై దృష్టి

విదేశాల్లోని ఆస్తులపై దృష్టి

ఈడీ దాడుల గురించి ముందే సమాచారం అందుకున్న రానా కపూర్ ఈ మూడు ఆస్తులను అమ్మి ఆ డబ్బుతో అమెరికా, బ్రిటన్ లేదా ఫ్రాన్స్‌కు పారిపోవాలని భావించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ముంబై, విదేశాల్లోని ఆస్తులపై కూడా ఈడీ దృష్టి సారించింది.

ఇప్పటికే పలు ఆస్తులు స్వాధీనం

ఇప్పటికే పలు ఆస్తులు స్వాధీనం

ఇప్పటికే ముంబై, ఢిల్లీలోని ఆయన నివాసాల నుంచి 47 ఖరీదైన పేయింటింగ్స్‌ను ఈడీ స్వాధీనం చేసుకుంది. డీహెచ్ఎఫ్ఎల్ సంస్థకు ఆర్థిక సాయం అందించేందుకు నేరపూరితంగా వ్యవహరించడంతో పాటు రూ.600 కోట్లు లబ్ధి పొందారనే ఆరోపణలతో ఈఢీ, సీబీఐలు రానా కపూర్, ఆయన భార్య, కూతుళ్లు, డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్ కపిల్ వద్వాన్‌లపై కేసులు నమోదు చేసింది.

కోట్లాది రూపాయల భవంతులు

కోట్లాది రూపాయల భవంతులు

బిందుకపూర్ పేరిట రూ.1000 కోట్ల ఆస్తులు ఉండటంతో పాటు ఆమె జరిపిన రూ.4300 కోట్ల ఆర్థిక లావాదేవీలపై ఈడీ దర్యాఫ్తు చేస్తోంది. ఢిల్లీ అమృత షెర్గిల్ మార్గ్‌లోని విలాసవంత భవనం వ్యాల్యూ రూ.450 కోట్లు, చాణక్యపురి బిల్డింగ్ రూ.350 కోట్లు, సర్దార్ పటేల్ భవనం విలువ రూ.250 కోట్లు అని ఈడీ తేల్చింది.

ముంబైలోని అల్టమౌంట్ రోడ్డులో రాణా కుటుంబం రూ.128 కోట్లకు ఓ భవనాన్ని కొనుగోలు చేసింది.

రూ.20,000 కోట్ల ఎన్పీఏలపై దర్యాఫ్తు

రూ.20,000 కోట్ల ఎన్పీఏలపై దర్యాఫ్తు

ఇదిలా ఉండగా, యస్ బ్యాంకుకు చెందిన రూ.20,000 కోట్ల విలువైన ఎన్పీఏలు ఈడీ స్కానర్‌లో ఉన్నాయి. ఈ రుణాలు ఎలా ఇచ్చారనే అంశంపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. రానా కపూర్ చెప్పడంతో ఈ లోన్లు ఇచ్చారా? ఇక్కడ నీకిది నాకిది ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాఫ్తు చేస్తోంది ఈడి.

English summary

Yes Bank: వేలకోట్లు బిల్డింగ్స్ అమ్మి విదేశాలకు.. రానా స్కెచ్, రూ.20,000 కోట్లపై కూపీలాగుతున్న ఈడీ | Yes Bank crisis: ED probing NPAs of over Rs 20,000 crore

Over Rs 20,000 crore of Yes Bank’s non-performing assets (NPAs) are under the Enforcement Directorate’s scanner.
Story first published: Wednesday, March 11, 2020, 16:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X