For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

WPI inflation: భారీగా పెరిగిన కూరగాయలు, గుడ్ల ధరలు

|

హోల్‌సేల్ ధరలు లేదా WPI ద్రవ్యోల్భణం పన్నెండేళ్ల గరిష్టం 14.23 శాతానికి చేరుకుంది. ప్రధానంగా ఆహార ధరలు పెరగడం తీవ్ర ప్రభావం చూపింది. అంతకుముందు అక్టోబర్ నెలలో ఈ ద్రవ్యోల్భణం ఐదు నెలల గరిష్టంతో 12.54 శాతం (ప్రొవిజనల్)కు చేరుకుంది. నవంబర్ నెలలో కూరగాయల ద్రవ్యోల్భణంతో పాటు గుడ్లు, మాసం ద్రవ్యోల్భణం కూడా భారీగా పెరిగింది. ప్రైమరీ ఆర్టికల్స్ ధరలు కూడా పెరిగాయి.

చమురు, పవర్ బాస్కెట్ ద్రవ్యోల్భణం నవంబర్ నెలలో 39.81 శాతానికి చేరుకుంది. అక్టోబర్ నెలలో ఇది 37.18 శాతంగా మాత్రమే ఉంది. ఫుడ్ ఇండెక్స్ అక్టోబర్ నెలలో 3.06 శాతంగా ఉండగా, నవంబర్ నెలలో రెండింతలు పెరిగి 6.70 శాతానికి చేరుకుంది. క్రూడ్ పెట్రోలియం ద్రవ్యోల్భణం అక్టోబర్ నెలలో 80.57 శాతం కాగా, నవంబర్ నెలలో 91.74 శాతం. మాన్యుఫ్యాక్చర్ ఐటమ్స్ మాత్రం అక్టోబర్ నెలలో 12.04 శాతం కాగా, నవంబర్ నెలలో 11.92 శాతానికి తగ్గింది.

WPI inflation surges to 14.23 percent in November on the back of higher food prices

WPI ద్రవ్యోల్భణం 14.2 శాతానికి చేరుకుందని, ఇది షాక్‌గా ఉందని ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్ అదితి నాయర్ అన్నారు. నాన్-కోర్ కేటగిరీ ద్రవ్యోల్భణం రేటును ఊహించిన దాని కంటే చాలా ఎక్కువగా నమోదు చేశాయన్నారు. ప్రధానంగా కూరగాయలు, గుడ్లు, మాంసం, చేపలు ద్రవ్యోల్భణం భారీగా పెరిగిందని చెప్పారు. ప్రైమరీ ఫుడ్ ఇన్‌ప్లేషన్ నవంబర్ నెలలో 4.9 శాతంతో 13 నెలల గరిష్టానికి చేరుకుంది.

English summary

WPI inflation: భారీగా పెరిగిన కూరగాయలు, గుడ్ల ధరలు | WPI inflation surges to 14.23 percent in November on the back of higher food prices

Wholesale prices or WPI inflation surged to a 12-year high of 14.23 per cent on the back of higher food prices. It had jumped to a five-month high of 12.54 per cent in October.
Story first published: Tuesday, December 14, 2021, 16:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X