For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా తరహాపై యుద్ధానికి వరల్డ్ బ్యాంకు అండ, భారత్‌కు 1 బిలియన్ డాలర్ల నిధులు

|

కరోనా వైరస్ ఎంత భయంకరమైనదో ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. ప్రస్తుతం ప్రపంచంలోని 200 దేశాలూ ఈ మహమ్మారి బారిన పడి విలవిలలాడుతున్నాయి. మొత్తంగా 8 లక్షల మందికి సోకిన ఈ వ్యాధి ఇప్పటికే సుమారు 40,000 మందిని పొట్టనపెట్టుకుంది. ఇంకా పరిస్థితి తీవ్రత పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా బాగా అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, ఇటలీ, స్పెయిన్, జర్మనీ, బ్రిటన్ వంటి దేశాలు ఈ ప్రాణాంతక వైరస్ తో పోరులో వేలాది మంది ప్రాణాలను కోల్పోతున్నాయి. చైనా లో మొదలైన కరోనా వైరస్... ఆ ఒక్క దేశానికే పరిమితం అవుతుందని అనుకున్నారు.

కానీ, రోజులు గడుస్తున్నా కొద్దీ పరిస్థితితులు చేయి దాటిపోతున్నాయి. ఇది భారత దేశంలోకి కూడా విస్తరించి సుమారు 1,500 మందికి వైరస్ సోకింది. 45 మంది ప్రాణాలను బలి తీసుకుంది. అదుష్టవశాత్తు మన దేశంలో 21 రోజుల పాటు లాక్ డౌన్ కొనసాగుతోంది కాబట్టి మన దగ్గర ఈ మహమ్మారి ప్రభావం కొంత తక్కువగానే ఉందని చెప్పొచ్చు. కానీ, ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ తో పోరాడేందుకు అవిరళ కృషి చేస్తుండటం విశేషం.

ఆర్థిక మాంద్యంలోకి ప్రపంచం: ఐక్యరాజ్య సమితి, భారత్-చైనాలకు మాత్రం ఊరట!

కొత్త ప్రాజెక్టు...

కొత్త ప్రాజెక్టు...

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఒక సరికొత్త ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తున్నట్లు సమాచారం. కరోనా తో పాటు మున్ముందు సంభవించే ఆరోగ్య విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తగిన యంత్రాంగాన్ని రూపొందించే ఏర్పాట్లలో నిమగ్నమైంది. కరోనా తరహా ఆరోగ్య విపత్తులు సంభవించినప్పుడు వెంటనే ప్రతిస్పందించేందుకు ఒక ఎమర్జెన్సీ విధానం ఉండాలని, విపత్తు సమయంలో కేవలం 48 గంటల్లో పరీక్షలు నిర్వహించి ఫలితాలు తేల్చేలా లాబరేటరీలు ఉండాలని యోచిస్తోంది. అలాగే డబ్ల్యూ హెచ్ ఓ మార్గ నిర్దేశకాల ప్రకారం అన్ని రకాల రోగ నిర్ధారణ, పరీక్షల విభాగాలు ఉండాలని ప్రభుత్వం తలపోస్తోంది. ఇందుకోసం ఏకంగా ఒక సరికొత్త ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. ఇందులో భాగస్వామిగా చేరేందుకు ప్రపంచ బ్యాంకు (వరల్డ్ బ్యాంకు ) తన అంగీకారాన్ని తెలిపింది. అలాగే, ఈ ప్రాజెక్ట్ కోసం 1 బిలియన్ డాలర్లు (సుమారు రూ 7,500 కోట్ల) నిధులను సమకూర్చేందుకు ప్రపంచ బ్యాంకు అంగీకరించింది. ఈ మేరకు ది ఎకనామిక్ టైమ్స్ ఒక ప్రత్యేక కథనం ప్రచురించింది.

పూణే ఒక్కటే...

పూణే ఒక్కటే...

దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తున్నప్పుడు మన దేశంలో రోగులకు కరోనా వైరస్ సోకిందా లేదా అని తేల్చి చెప్పే ప్రయోగ శాల కేవలం ఒక్క పూణే నగరంలోనే ఉండటం గమనార్హం. పరిస్థితి చేయిదాటిపోతున్న సమయంలో పూణే తరహా సౌకర్యాలు కలిగిన లాబరేటరీ ల కోసం అన్వేషణ మొదలైంది. ఈ నేపథ్యంలో దేశంలోని అందరు ముఖ్య మంత్రులతో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రధాని నరేంద్ర మోడీకి మన హైదరాబాద్ లోని సిసిఎంబి గురించి వివరించారు. సీసీఎంబీ కి రోజుకు 1,000 కరోనా పరీక్షలు నిర్వహించే సామర్థ్యం ఉందని చెప్పారు. దీనికి వెంటనే ప్రధాని కూడా సానుకూలంగా స్పందించి సీసీఎంబీ సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఈ ప్రయోగశాల పరీక్షలు ప్రారంభించింది. కానీ, 135 కోట్ల జనాభా కలిగిన భారత దేశంలో కేవలం ఒకటి, రెండు లాబొరేటరీలు మాత్రమే ఉండటం సమంజసం కాదని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం కరోనా ప్రాజెక్టును రూపొందించింది.

డాక్టర్లు కూడా తక్కువే...

డాక్టర్లు కూడా తక్కువే...

ఏదైనా పెద్ద తరహా ఆరోగ్య విపత్తు సంభవిస్తే... దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు దేశంలో మౌలిక సదుపాయాల కొరత ఉంది. అలాగే మానవ వనరుల కొరత కూడా గణనీయంగా ఉంది. ప్రస్తుతం కరోనా వైరస్ పై పోరాటం చేస్తుండటంతో ఈ నిజాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. దేశంలో 135 కోట్ల జనాభా ఉన్నా... కేవలం 12 లక్షల మంది డాక్టర్లు మాత్రమే ఉన్నారు. పారా మెడికల్ సిబ్బంది మరో 22 లక్షల మంది మాత్రమే ఉండటం శోచనీయం. దేశం మొత్తం మీద కేవలం కొన్ని వేల వెంటిలేటర్లు మాత్రమే ఉన్నాయి. అందుకే, ఇలాంటి అన్ని అంశాలను పరిగణన లోకి తీసుకొని భవిష్యత్ లో ఇలాంటి మహమ్మారి వైరస్ లు, ఇతర ఆరోగ్య విపత్తులను తట్టుకొని నిలబడేందుకు కేంద్ర ప్రభుత్వం సంసిద్ధం అవుతున్నట్లు సమాచారం.

English summary

World Bank offers $1bn for proposed India project

The World Bank has offered $1 billion to the Indian government for a proposed India Covid-19 emergency response and health systems preparedness project. This four-year project aims to develop the preparedness of India’s health care systems in the time of the pandemic.
Story first published: Friday, April 3, 2020, 7:45 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more