For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Recession: 2023లో ఆర్థిక మాంద్యం.. ప్రపంచ బ్యాంక్ సంచలన రిపోర్ట్.. గత 50 ఏళ్లలో..

|

Recession: ఈ ఏడాది ఇప్పటి వరకు ఆర్థిక మాంద్యం రాలేదని చాలా మంది ఆనందంగా ఉన్నారు. అయితే పరిస్థితులు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. అమెరికాతో పాటు ప్రపంచంలోని అన్ని దేశాలు 2023లో మాంద్యంలోకి జారుకుంటాయని ప్రపంచ బ్యాంక్ నివేదికలు ఇప్పుడు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి.

సెంట్రల్ బ్యాంకుల పనితో..

సెంట్రల్ బ్యాంకుల పనితో..

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు ద్రవ్య విధానాన్ని మార్చడం, అదే సమయంలో వడ్డీ రేట్లను పెంచడం వల్ల 2023లో ప్రపంచ దేశాలు మాంద్యం వైపు పయనించవచ్చని ప్రపంచ బ్యాంక్ హెచ్చరించింది. ప్రస్తుత వేగంతో చర్యలు కొనసాగితే ఈ ఏడాది చివరి నాటికి మెల్లగా మాంద్యం ఛాయలు ప్రారంభమోతాయని ఇప్పటికే నిపుణులు చెబుతున్నారు. గత 50 ఏళ్లుగా ఎప్పుడూ లేని విధంగా వడ్డీ రేట్లు పెరగటమే దీనికి కారణమని వారు చెబుతున్నారు.

పరిస్థితులను చక్కదిద్దేందుకు..

పరిస్థితులను చక్కదిద్దేందుకు..

ద్రవ్యోల్పణాన్ని తగ్గించేందుకు.. ఉత్పత్తిని పెంచాలని, సరఫరా పరిమితులను తొలగించాలని ప్రపంచ బ్యాంకు తన నివేదికలో పేర్కొంది. ప్రపంచ దేశాలు ఆర్థిక మాంద్యం వైపు పయనిస్తున్నట్లు ఇప్పటికే కొన్ని సంకేతాలు కనిపిస్తున్నాయని వరల్డ్ బ్యాంక్ తెలిపింది. 1970ల మాంద్యం తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఆందోళనకర పరిస్థితులను ఎదుర్కొంటోందని తన నివేదికలో పేర్కొంది.

ద్రవ్య విధానంలో మార్పులు..

ద్రవ్య విధానంలో మార్పులు..

సెంట్రల్ బ్యాంకులు వచ్చే ఏడాది గ్లోబల్ మానిటరీ పాలసీ రేట్లను 4 శాతానికి పెంచవచ్చు. 2021లో ఈ రేట్లు సగటున రెట్టింపు అవుతాయని, ప్రధాన ద్రవ్యోల్బణం కేవలం 5 శాతంగా ఉంటుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ఈ తరుణంలో సెంట్రల్ బ్యాంకులు ద్రవ్యోల్బణాన్ని అరికట్టకపోతే ఈ రేటు 6 శాతం వరకు పెరగవచ్చని ప్రపంచ బ్యాంక్ తెలిపింది.

భారత్ పరిస్థితి..

భారత్ పరిస్థితి..

అమెరికా నుంచి యూరప్, ఇండియా వరకు అన్ని దేశాలు రుణ రేట్లను భారీగా పెంచుతున్నాయి. వాస్తవానికి దీనివెనుక ఉన్న ఉద్దేశ్యం డబ్బు సరఫరాను పరిమితం చేయడం అయినప్పటికీ.. తద్వారా ద్రవ్యోల్బణాన్ని తగ్గించడం. కానీ ఇది మరోపక్క పెట్టుబడులను, వృద్ధిని తగ్గిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వడ్డీ రేట్ల పెంపు ఇలాగే కొనసాగితే పరిస్థితులు దారుణంగా మారతాయని తెలుస్తోంది.

మందగించిన వృద్ధి..

మందగించిన వృద్ధి..

జీడీపీ వృద్ధి తగ్గుదల, తలసరి ఆదాయం తగ్గుదల వల్ల సాంకేతికంగా ప్రపంచం ఆర్థిక మాద్యంలోకి చేరుకుంటుందని సూచిస్తోంది. ప్రపంచ వృద్ధి బాగా మందగించింని, మరిన్ని దేశాలు మాంద్యంలోకి పడిపోవడంతో ఆర్థికంగా మరింత మందగించే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ డేవిడ్ మాల్పాస్ అన్నారు. ఇదే ధోరణి కొనసాగితే, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లోని ప్రజలకు దీర్ఘకాలిక పరిణామాలు వినాశకరమైనవిగా ఉంటాయని అన్నారు.

ప్రధాన కారణాలు..

ప్రధాన కారణాలు..

ఉక్రెయిన్ యుద్ధం ఆహార సరఫరాలను తగ్గించింది. దీనికి తోడు సరఫరా గొలుసుపై మహమ్మారి ప్రభావం, చైనాలో కరోనా లాక్‌డౌన్ కారణంగా తక్కువ డిమాండ్, ప్రతికూల వాతావరణం వల్ల తగ్గిన వ్యవసాయ ఉత్పత్తి ప్రపంచం రికార్డు ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో.. సరఫరా పరిమితుల కారణంగా ఏర్పడే ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తగ్గించేందుకు వడ్డీరేట్లను పెంచడం ఒక్కటే సరిపోదని ప్రపంచ బ్యాంకు కొత్త నివేదిక పేర్కొంది. దేశాలు వస్తువుల లభ్యతను పెంచడంపై దృష్టి పెట్టాలని వరల్డ్ బ్యాంక్ సూచించింది.

English summary

Recession: 2023లో ఆర్థిక మాంద్యం.. ప్రపంచ బ్యాంక్ సంచలన రిపోర్ట్.. గత 50 ఏళ్లలో.. | world bank latest report revealed that world countries may go into financial recession in 2023 know details

world bank latest report revealed that world countries may go into financial recession in 2023 know details
Story first published: Monday, September 19, 2022, 11:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X