For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా లాక్‌డౌన్: సౌత్ ఇండియాపై తక్కువ ప్రభావం, ఎందుకో తెలుసా?

|

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం స్తంభించింది. వ్యాపారాలు, ఉత్పత్తులు, ఉద్యోగ కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. అయితే దక్షిణ భారత దేశంలో ఈ కార్యకలాపాలకు తక్కువ ఇబ్బంది లేదా నష్టం కలిగినట్లు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) స్టడీలో తేలింది. లాక్ డౌన్ వల్ల దక్షిణాది ప్రాంతంలో తక్కువ అంతరాయం కలిగిందని ఈ స్టడీలో తేలింది.

2 వారాల్లో 5,000 మంది కొత్త ఉద్యోగులను చేర్చుకుంటాం2 వారాల్లో 5,000 మంది కొత్త ఉద్యోగులను చేర్చుకుంటాం

వర్క్ ఫ్రమ్ హోమ్

వర్క్ ఫ్రమ్ హోమ్

కేంద్ర ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ రూపొందించిన నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆక్యుపేషన్స్ (NCO) ప్రామాణికాల ఆధారంగా వంద రకాలైన పని విభాగాల నుంచి 3,000 మందిని ఎంచుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) సూచీ ప్రకారం ప్రస్తుత లాక్ డౌన్ ప్రభావాన్ని విశ్లేషించారు. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ విభాగంలో ఇంటి నుండి పని చేసే అవకాశం అధికంగా ఉండటం వల్ల పనికి పెద్దగా నష్టం జరగలేదు. దక్షిణాదిలో సేవా రంగం పెద్దది కావడమే తక్కువ ప్రభావం చూపింది.

వీటిల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ తక్కువ

వీటిల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ తక్కువ

ఈ తరహా సానుకూలత వ్యవసాయం, టోకు-చిల్లర వ్యాపారం, తయారీ విభాగంలో కొంతమేరకు మాత్రమే ఉంది. జౌళి, రెస్టారెంట్ సేవల విభాగాల్లో ఇంటి నుండి పని చేసే అవకాశా చాలా తక్కువగా ఉంది.

ఆన్‌లైన్ ట్యూషన్

ఆన్‌లైన్ ట్యూషన్

హోమ్ ట్యూషన్ల వంటి విభాగాల్లో ఆన్ లైన్ ద్వారా ఇంటి నుండి పని చేసే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. ఇప్పటికే ఆన్ లైన్ ద్వారా పాఠాలకు డిమాండ్ పెరిగిన విషయం తెలిసిందే.

వర్క్ ఫ్రమ్ హోమ్ మోడల్‌కు ఆదరణ

వర్క్ ఫ్రమ్ హోమ్ మోడల్‌కు ఆదరణ

ఈ స్టడీలో ఆసక్తికర మరో ఆసక్తికర విషయం వెల్లడైంది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు హైదరాబాద్, బెంగళూరు వంటి పెద్ద నగరాలతో పాటు దక్షిణాదిన వివిధ ప్రాంతాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. భవిష్యత్తులో డిజిటల్ పద్ధతిలో వర్క్ ఫ్రమ్ హోమ్ మోడల్స్‌లో అంతరాయం లేకుండా సేవలు అందించే రంగాలకు ఆదరణ పెరగవచ్చునని కూడా ఈ స్టడీ తెలిపింది.

నార్త్ ఢిల్లీ కంటే సౌత్ ఢిల్లీలో బెట్టర్

నార్త్ ఢిల్లీ కంటే సౌత్ ఢిల్లీలో బెట్టర్

ఆశ్చర్యకరంగా మొత్తం దక్షిణ భారతదేశంలోనే ఎక్కువ వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం ఉన్నట్లు ఈ సర్వేలో వెల్లడైందని ISB ఎకనమిక్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఏరియా ఫ్యాకల్టీ, కో-రీసెర్చర్ శేఖర్ తోమర్ అన్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో 100కు పైగా వృత్తులపై 3,000 మంది కార్మికులపై సర్వే చేసినట్లు తెలిపారు. దేశ రాజధాని విషయానికి వస్తే దక్షిణ ఢిల్లీతో పోలిస్తే నార్త్ ఢిల్లీ ఎక్కువ అంతరాయం ఎదుర్కొంది.

English summary

కరోనా లాక్‌డౌన్: సౌత్ ఇండియాపై తక్కువ ప్రభావం, ఎందుకో తెలుసా? | Work disruption least in South, says ISB study

South India is facing least disruption of work due to the national lockdown in force to fight coronavirus (Covid-19) threat, according to a study by the Indian School of Business (ISB).
Story first published: Thursday, April 9, 2020, 15:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X