బెంగళూరు: కరోనా వైరస్ కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో కంపెనీలు ఉద్యోగుల వేతనాలు పెండింగ్‌లో పెట్టాయి. చాలా కంపెనీలు వేతనాల్లో కోతలు కూడా విధించాయి. మరిన్ని కంపెనీలు ఉద్యోగాల కోత విధించాయి. ఈ మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. అన్ని రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో ఐటీ కంపెనీలు సహా వివిధ రంగాల్లో వేతనాలు నిలిపివేశారు. ఇప్పుడు కార్యకలాపాలు పుంజుకుంటుండటంతో వేతనాల పెంపును అమలు చేస్తున్నారు. కార్యకలాపాలు పెరిగాయని, శాలరీ హైక్స్ ఉంటాయని ఐటీ సంస్థలు మూడు నాలుగు నెలల క్రితమే ప్రకటించాయి. వీటిని ఇప్పుడు అమలు చేయనున్నారు.

వీరికి వేతన పెంపు
భారత నాలుగో అతిపెద్ద ఐటీ కంపెనీ విప్రో జనవరి 1వ తేదీ నుండి దాదాపు 80 శాతం మంది ఉద్యోగులకు వేతనాలని పెంచనుంది. మంచి పర్ఫార్మెన్స్ కనబరిచిన వారికి పదోన్నతులు ఇవ్వనున్నారు. ప్రధానంగా జూనియర్ విభాగం (B3, అంతకంటే తక్కువ)లో వేతనాలు పెంచనున్నారని తెలుస్తోంది. మధ్యస్థాయి విభాగం (C1, అంతకంటే పైన)లోను వేతనాలు పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడిస్తున్నారు. అర్హత కలిగిన జూనియర్ ఉద్యోగులకు జనవరి 1 (2021) నుండి వేతన పెంపును అమలు చేయనున్నారని తెలుస్తోంది.

ఎంత పెరగవచ్చు
1.8 లక్షల మంది ఉద్యోగుల్లో బీ3 బ్యాండ్ ఉద్యోగులు 80 శాతం మంది ఉన్నారు. వీరికి జనవరి 1వ తేదీ నుండి వేతన పెంపు ఉండగా, మిడ్ లెవల్ ఉద్యోగులకు వచ్చే ఏడాది జూన్ 1వ తేదీ నుండి వేతన పెంపు ఉండవచ్చునని వార్తలు వస్తున్నాయి. ఆఫ్-షోర్ ఉద్యోగులకు 6 శాతం నుండి 8 శాతం, ఆన్-సైట్ ఉద్యోగులకు 3 శాతం నుండి 4 శాతం వేతన పెంపు ఉండవచ్చునని తెలుస్తోంది. వేతన పెంపుపై విప్రో స్పందించాల్సి ఉంది.

ఏడాద వేతనం పెంపు ఆగిపోయింది
సాధారణంగా విప్రో వేతన పెంపు జూన్ నెల నుండి అమలులోకి వస్తుంది. కరోనా కారణంగా వేతనాల పెంపు ఆలస్యమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కంపెనీ సీ1 బ్రాండ్, అపై ఉద్యోగులు ఒక సైకిల్ (ఏడాది వేతన పెంపు)ను కోల్పోయినట్లే. కరోనా సంక్షోభ సమయంలో ఉద్యోగులు అద్భుత పనితీరును కనబరిచారని విప్రో పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం మూడు, నాలుగో త్రైమాసికంలో బిజినెస్ మెట్రిక్స్ ఆధారంగా ఉద్యోగులకు వంద శాతం వేరియేబుల్ పే ఇవ్వనున్నట్లు తెలిపింది.
జూలై-సెప్టెంబర్ కాలానికి వంద శాతం వేరియేబుల్ పే అందించింది. బీ3 బ్యాండ్ వరకు ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు డిసెంబర్ 1 నుండి ప్రమోషన్లు ఇచ్చింది. దాదాపు 7వేల మంది ఉద్యోగులకు ప్రయోజనం కలిగింది. గత మూడేళ్లలో ఇదే అధికం. కాగా, విప్రో స్టాక్ ధర నేడు 1.41 శాతం లాభపడి రూ.363.50 వద్ద ముగిసింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications