For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తెలంగాణలో విప్రో భారీ పరిశ్రమ: బెంగళూరుపై కేటీఆర్ ట్వీట్, షాకిచ్చిన బీజేపీ

|

విప్రో కన్స్యూమర్ కేర్ అండ్ లైటింగ్స్ తన కొత్త ఫ్యాక్టరీని తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ప్రారంభించింది. రూ.300 కోట్లతో ప్రారంభించిన ఈ విప్రో పరిశ్రమలో 900 మందికి ఉద్యోగ, ఉపాధి లభిస్తుంది. మహేశ్వరం సమీపంలోని ఈ-సిటీలో రూ.300 కోట్లతో 30 ఎకరాలలో విప్రో సంస్థ ఏర్పాటు చేసిన వినియోగ ఉత్పత్తుల పరిశ్రమను మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, కేటీఆర్, విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ కలిసి మంగళవారం ప్రారంభించారు. సోప్‌లు, హ్యాండ్ వాష్, బాత్రూం క్లీనర్స్ తదితర ఉత్పత్తులను ఈ పరిశ్రమలో తయారు చేస్తారు. మహేశ్వరం విప్రో పరిశ్రమలో 90 శాతం మంది స్థానికులకు, ఇందులో 15 శాతం మంది మహిళలకు అవకాశాలు ఉంటాయని విప్రో కన్స్యూమర్ కేర్ అంట్ లైటింగ్స్ సీఈవో వినీత్ అగర్వాల్ చెప్పారు.

లక్షల ఉద్యోగాలు

లక్షల ఉద్యోగాలు

ఇదిలా ఉండగా, విప్రో పరిశ్రమ ప్రారంభం సందర్భంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. దీనిపై కర్నాటక ముఖ్యమంత్రి బొమ్మై స్పందించారు. ప్రారంభోత్సవం సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. టీఎస్ఐపాస్ ద్వారా సరళతర విధానాలతో పరిశ్రమల ఏర్పాటుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని, పదిహేను రోజుల్లోనే అనుమతులిస్తున్నామని, దీని ద్వారా ఇప్పటికి రూ.2.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 16 లక్షల ఉద్యోగాలు వచ్చాయన్నారు. విప్రో ద్వారా మరో 900 మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. మరో సందర్భంలో మాట్లాడుతూ అహ్మదాబాద్ కంటే హైదరాబాద్ పెట్టుబడులకు అన్ని విధాలా అనుకూలంగా ఉందని పారిశ్రామికవేత్తలు భావిస్తున్నారని, పెద్ద ఎత్తున పెట్టుబడులతో తరలి వస్తున్నారన్నారు.

కేటీఆర్ ట్వీట్

కేటీఆర్ ట్వీట్

ఇదే సందర్భంలో కేటీఆర్ చేసిన ట్వీట్ చర్చకు దారి తీసింది. బెంగళూరు వ్యాపారులు, పారిశ్రామికవేత్తలను హైదరాబాద్‌కు ఆహ్వానిస్తూ ట్వీట్ చేశారు. హైదరాబాద్‌లోనే మౌలిక సదుపాయాలు బాగున్నాయని, కాబట్టి బెంగళూరు వ్యాపారులు ఇక్కడకు రావాలని కేటీఆర్ ట్వీట్ చేశారు. దీనిపై బొమ్మై రీట్వీట్ చేశారు.

కేటీఆర్‌కు షాక్

కేటీఆర్‌కు షాక్

కేటీఆర్ ట్వీట్ పైన కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై స్పందిస్తూ.. వ్యాపార, వాణిజ్య రంగ ప్రముఖులు ప్రపంచ నలుమూలల నుండి బెంగళూరుకు తరలి వస్తుంటారని, ఎక్కువ స్టార్టప్స్, యూనీకార్న్స్ ఉన్నది బెంగళూరులోనే అని, ఇక్కడికే అత్యధిక FDIలు వస్తుంటాయన్నారు. రాష్ట్రం గత మూడేళ్లలో ఆర్థికంగా ప్రగతి సాధించిందన్నారు.

కర్నాటక బీజేపీ కూడా స్పందించింది. ఆకాశాన్ని కొలిచే ముందు అంగుళాన్ని కొలవడం నేర్చుకోవాలన్నారు. మన పళ్లెంలో ఈగ పడినా పట్టించుకోని వారు పక్కింటి వారి పళ్లెంలో ఈగ గురించి మాట్లాడటం విడ్డూరమని, తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలుసునని, గాలం వేసే రాజకీయాలతో ఉనికిని కోల్పోతున్న కేసీఆర్ ప్రభుత్వం అభివృృద్ధి విషయంలో బెంగళూరుతో పోటీగా మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. అసలు విదేశీ పెట్టుబడులలో తెలంగాణ ఏ స్థానంలో ఉందని కేటీఆర్‌కు షాకిచ్చారు. నవ భారతం కోసం నవం బెంగళూరు ఉందని, కానీ పొరుగు రాష్ట్రాలపై ఇలాంటి దురహంకార పోటీ మీకు రివర్స్ అవుతుందని హెచ్చరించింది. నీతి ఆయోగ్ జాబితాలో కర్నాటక మొదటి స్థానంలో, తెలంగాణ నాలుగో స్థానంలో ఉందని గుర్తు చేశారు.

కర్నాటక మంత్రి సుధాకర్ స్పందిస్తూ అమెరికా నగరాలు, సింగపూర్‌తో బెంగళూరు పోటీ పడుతోందన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక హైదరాబాద్‌లోను ఆరోగ్యకరమైన పోటీ నెలకొంటుందన్నారు.

English summary

Wipro’s world largest consumer care products manufacturing unit in Telangana

Wipro Consumer Care & Lighting has opened a new factory in Maheshwaram here with an investment of RS 300 crore.
Story first published: Wednesday, April 6, 2022, 8:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X