For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Wipro: అంబానీ- అదానీతో పోటీకి 'సై' అంటున్న విప్రో.. కొత్త కంపెనీ కొనుగోలుతో విస్తరణ..

|

Wipro: విప్రో అనగానే మనలో చాలా మందికి గుర్తుకు వచ్చేది దానీ సాఫ్ట్ వేర్ వ్యాపారమే. అయితే నిత్యం వాడే అనేక ఎఫ్ఎంసీజీ వస్తువుల తయారీలో ఈ కంపెనీ చాలా ప్రసిద్ధమైనది. మనందరికీ చిన్నప్పటి నుంచి తెలిసిన సంతూర్ సబ్బు నుంచి ఎలక్ట్రిక్ బల్బుల వరకు అనేక వ్యాపారాల్లో విప్లో విస్తరించి ఉంది. అలా వంటనూనెల విక్రయంతో ప్రారంభమైన విప్రో గ్రూప్ ప్రస్థానం ఐటీ వరకు వెళ్లింది.

స్పీడు పెంచిన కంపెనీలు..

స్పీడు పెంచిన కంపెనీలు..

దేశంలోని అన్ని ప్రముఖ బిజినెస్ గ్రూప్స్ తమ వ్యాపారాల విస్తరణలో భాగంగా.. అనేక రంగాల్లోకి ప్రవేశించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ క్రమంలోనే దేశంలోని 4వ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ విప్రో గ్రూప్‌కు అనుబంధంగా ఉన్న విప్రో కన్స్యూమర్ కేర్ అండ్ లైటింగ్, ఆహార ఉత్పత్తుల రంగంలో తన వ్యాపారాన్ని విస్తరించేందుకు కేరళకు చెందిన ప్రఖ్యాత నిరాపారాను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.

విప్రో ప్రకటన..

విప్రో ప్రకటన..

కొన్ని నెలల కిందట దేశీయ ఆహార ఉత్పత్తుల మార్కెట్లోకి ప్రవేశించే ప్రణాళికను ప్రకటించింది. దీని కింద స్నాక్స్, సుగంధ ద్రవ్యాలు, సిద్ధంగా ఉన్న ఆహార ఉత్పత్తులను విక్రయించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో విప్రో కన్స్యూమర్ కేర్ అండ్ లైటింగ్ వ్యాపారాన్ని విస్తరించడానికి కేరళ ప్రసిద్ధ NIRAPARA కంపెనీని సొంతం చేసుకుంటోంది. దీనికి సంబంధించిన డీల్ పై ఇప్పటికే సంతకాలు జరిగాయి. కంపెనీకి కుక్ విభాగంలో స్థిరమైన స్థానం ఉందని నిరపారా వెల్లడించింది.

నిరపారా ఆదాయం..

నిరపారా ఆదాయం..

కేరళ కేంద్రంగా వ్యాపారాన్ని నిర్వహిస్తున్న నిరపారాకు తన వ్యాపారంలో 63 శాతం కేరళ నుంచి వస్తుండగా.. 8 శాతం భారతదేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వస్తోంది. ఇదే క్రమంలో కంపెనీ తన వ్యాపారంలో అంతర్జాతీయ మార్కెట్ల నుంచి 29 శాతాన్ని సంపాదిస్తోంది. గల్ఫ్ దేశాల నుంచి నిరాపారా తన వ్యాపారాన్ని ఎక్కువగా పొందుతోందని విప్రో ఎంటర్‌ప్రైజెస్ మేనేజింగ్ డైరెక్టర్ వినీత్ అగర్వాల్ వెల్లడించారు.

నిరపారా ప్రస్థానం..

నిరపారా ప్రస్థానం..

1976లో ప్రారంభించబడిన నిరపర మసాలా దినుసులతో పాటు రెడీమేడ్ పుడ్డింగ్ పౌడర్‌కు ప్రసిద్ధి చెందింది. కేరళ ప్రజలు రోజూ ఉపయోగించే ఉత్పత్తులను నిరపారా ఇంట్లోనే తయారు చేసి విక్రయిస్తోంది. నిరపర బ్రాండ్ మసాలా దినుసులు, అప్పం, ఇడియప్పం, దోస, ఇడ్లీ మొదలైన వాటికి సంబంధించిన రైస్ పౌడర్‌లు కీలక ఉత్పత్తులుగా ఉన్నాయి.

అంబానీ-అదానీలకు పోటీగా..

అంబానీ-అదానీలకు పోటీగా..

ఎఫ్ఎంసీజీ రంగంలో రిలయన్స్ ఇండిపెండెన్స్ పేరుతో పోటీకి సిద్ధం అవుతుండగా. అదానీ విల్మర్ పేరుతో అదానీ గ్రూప్ సైతం భారత వ్యాపారంలో ఉంది. అయితే ఇప్పటికే అనేక ఉత్పత్తులతో ప్రజలకు చేరువైన విప్రో కన్జూమర్ దానిని మరింతగా విస్తరించేందుకు చర్యలు చేపట్టింది. నిషా అంబానీ రాకలో రిలయన్స్ రిటైల్ వెంచర్స్ వ్యాపారం శరవేగంగా వృద్ధి చెందుతోన్న సంగతి మనందరికీ తెలిసిందే. దేశంలో FMCG రంగం చాలా పెద్దది మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రజలను కవర్ చేస్తున్నందున చాలా కంపెనీలు ఈ రంగంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాయి.

Read more about: wipro nirapara fmcg business news
English summary

Wipro: అంబానీ- అదానీతో పోటీకి 'సై' అంటున్న విప్రో.. కొత్త కంపెనీ కొనుగోలుతో విస్తరణ.. | Wipro Group Buying NIRAPARA food brand that have strong presence in Kerala

Wipro Group Buying NIRAPARA food brand that have strong presence in Kerala
Story first published: Tuesday, December 20, 2022, 12:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X