For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Viral Tweet: డైట్ చేసేవాళ్లు రోజూ చనిపోతారంటూ పారిశ్రామిక వేత్త ట్వీట్.. ఎందుకలా అన్నారో తెలుసుకుందాం..

|

Wipro Chairman: ఆహారం తినటం విషయంలో మనకున్నన్ని అనుమానాలు లెక్కపెట్టలేనన్ని. అసలు తింటే ఏమవుతుంది, తినకపోతే ఏమవుతుంది, తినాలా వద్దా, ఎంత తినాలి.. ఇలాంటి ప్రశ్నలకు అంతే ఉండదు. ఇదే సమయంలో ప్రముఖ వ్యాపారవేత్త, విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ చేసిన ఒక ట్విట్ సోషల్ మీడియాలో చర్చకు కారణమై.. విపరీతంగా వైరల్ అవుతోంది. దేశంలోనే మూడో అతిపెద్ద టెక్ కంపెనీ అయిన విప్రో ఛైర్మన్ డైట్ విషయంలో ఒక ట్విట్ చేయటమే దీనికి కారణం. దీనిపై ఆయన ట్విట్టర్ ఫాలోవర్స్ స్పందిస్తూ ఱన్నీ రియాక్షన్స్ కూడా ఇస్తున్నారు. అసలు దీని వెనకు ఆయన ఉద్ధేశం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఫొటోల కోసం పాట్లు..

ప్రస్తుతం ఫిట్‌గా ఉండేందుకు డైటింగ్ చేసే ట్రెండ్ సమాజంలో చాలా ఎక్కువైంది. స్లిమ్ ఫిజిక్, సిక్స్ ప్యాక్ బాడీ కోసం ప్రజలు కీటో నుంచి ఇంటిమేట్ డైటింగ్ వరకు అనేక పద్ధతులను ఫాలో అవుతున్నారు. ఇలా చేసి సోషల్ మీడియాలో అందంగా కనిపించే ఫోటోలను పోస్ట్ చేసేందుకు అనేక తిప్పలు పడుతున్నారు. అయితే భారతదేశంలోని మూడవ అతిపెద్ద టెక్ కంపెనీ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీకి ఇలాంటి పోకడులపై భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

తినేవాళ్లు ఒకసారి చనిపోతారు..

తినేవాళ్లు ఒకసారి చనిపోతారు..

డైట్ విషయంపై చేసిన ట్వీట్ ఇప్పుడు ప్రజలలో వైరల్‌గా మారింది. నాకు ఒక మామయ్య ఉండేవారు. మామయ్య ఏమనేవారంటే "జో డైట్ పర్ జాతే వో హర్ దిన్ మార్టే, జో ఖా పీ కే జాతే వో ఏక్ బార్ మార్టే" అని పోస్ట్ చేశారు. దీనికి అర్థం డైటింగ్ చేసేవారు రోజూ చనిపోతారని, కానీ నచ్చింది తింటూ, తాగుతూ ఉండేవారు జీవితంలో ఒక్కసారే మరణిస్తారని అన్నారు. డైటింగ్ చేసే వారి మనసు ఇష్టమైనవాటిపై లాగుతుందనే వారు అన్నింటినీ బలవంతంగా మానుకుంటారనే ఉద్ధేశంలో ఆయన ఈ ట్వీట్ చేశారు.

ట్విట్టర్ యూజర్లు రియాక్షన్స్ ఇలా..

రిషద్ ప్రేమ్‌జీ ట్వీట్‌పై.. నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇంత గొప్ప సలహా ఇచ్చిన రిషద్‌ని ఎవరో మామయ్య పేరు అడిగారు. మరికొందరైతే ఆయన ట్వీట్ కు మద్దతు తెలిపారు. మరికొందరైతే సరైన ఆహారం తినాలని కామెంట్ చేస్తున్నారు. ఒక వినియోగదారుడు UNCCD మార్గదర్శకాలను వెల్లడించారు.

రిషద్ ప్రేమ్‌జీ వివరాలు..

రిషద్ ప్రేమ్‌జీ వివరాలు..

తండ్రి అజీమ్ ప్రేమ్‌జీ విప్రో ఛైర్మన్‌గా వైదొలగడంతో.. రిషద్ కంపెనీ పగ్గాలు చేపట్టారు. అతను హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి పట్టా పొందారు. వెస్లిన్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో విద్యనభ్యసించారు. రిషద్‌కు 2014లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ యంగ్ గ్లోబల్ లీడర్ బిరుదును పొందారు. 2007లో విప్రోలో చేరి ఎనిమిదేళ్ల తర్వాత డైరెక్టర్ల బోర్డులోకి ప్రవేశించారు. ఇలా ప్రస్థానం ప్రారంభించిన షద్ ప్రేమ్‌జీ .. ఇప్పుడు దేశంలోని మూడవ అతిపెద్ద టెక్ కంపెనీకి ఛైర్మన్ పదవిని నిర్వహిస్తున్నారు.

English summary

Viral Tweet: డైట్ చేసేవాళ్లు రోజూ చనిపోతారంటూ పారిశ్రామిక వేత్త ట్వీట్.. ఎందుకలా అన్నారో తెలుసుకుందాం.. | Wipro Chairman Rishad Premji tweet over diet going viral in social media

Rishad Premji tweet on diet going virla know full details
Story first published: Sunday, June 26, 2022, 14:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X