For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పన్నులు తగ్గించాలి! పెట్రోల్, డీజిల్ ధరలపై RBI కీలక వ్యాఖ్యలు, ఆ రాష్ట్రాల్లో ధరలు తక్కువే

|

ముంబై: పెట్రోల్, డీజిల్ ధరలు ఇటీవల వరుసగా పెరుగుతున్నాయి. చమురు ధరలు తగ్గించాలని ప్రతిపక్షాల నుండి సామాన్యుల వరకు కోరుతున్నారు. ఇంధన ధరలు ఇటీవల ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకాయి. కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ ధర రూ.100ను దాటింది. ఈ ధరల పెరుగుదలపై కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్ కూడా తమదైన శైలిలో స్పందించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు తగ్గించడానికి మించిన ప్రత్యామ్నాయం లేదని, ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చర్చించాలని నిర్మలమ్మ పేర్కొనగా, అంతర్జాతీయ ధరల ప్రభావం పడుతోందని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.

ద్రవ్యోల్భణానికి దారి తీస్తుంది

ద్రవ్యోల్భణానికి దారి తీస్తుంది

ధరల పెరుగుదలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) కూడా స్పందించింది. ఇంధన ధరలను తగ్గించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఇందులో భాగంగా పెట్రోల్, డీజిల్ పైన విధించే పరోక్ష పన్నులను తగ్గించవచ్చునని అభిప్రాయపడింది. మానిటరీ పాలసీ కమిటీ మినట్స్ సందర్భంగా శక్తికాంతదాస్ మాట్లాడారు. చమురు ధరలపై పరోక్ష పన్నులను తగ్గించాల్సిన అవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు. దేశంలో ఇంధన ధరలు భారీగా పెరుగుతోన్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెవెన్యూ ఒత్తిడికి లోనవుతున్నాయని, కరోనా అనంతరం ఏర్పడిన పరిస్థితుల వల్ల ఆదాయం, ప్రభుత్వ ఖర్చులను కూడా అర్థం చేసుకోవచ్చునని, కానీ వీటిని తగ్గించకపోతే మళ్లీ ద్రవ్యోల్బణానికి దారితీస్తాయన్నారు.

త్వరలో ఊరట ఉంటుందా?

త్వరలో ఊరట ఉంటుందా?

ఇటీవల ద్రవ్యోల్భణం అదుపులోకి వస్తోందని, ఇంధన ధరల పెరుగుదల వల్ల ఈ ప్రభావం తయారీ, ఉత్పత్తి రంగంపై పడే అవకాశాలు ఉన్నాయని శక్తికాంత దాస్ అన్నారు. గత 10 రోజులుగా దేశంలో ఇంధన ధరలు క్రమంగా పెరుగుతున్నాయని, కొన్ని రాష్ట్రాల్లో లీటర్ రూ.100ను తాకిందని చెప్పారు. కాబట్టి ఇంధనంపై భారీగా ఉన్న పరోక్ష పన్నులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయ చర్యలతో వీటి ధరలను అదుపులోకి తీసుకు రావొచ్చునన్నారు. త్వరలో వీటిపై నిర్ణయం రావొచ్చునన్నారు.

ఈ రాష్ట్రాల్లో పెట్రోల్ ధర తక్కువ

ఈ రాష్ట్రాల్లో పెట్రోల్ ధర తక్కువ

ప్రస్తుతం పెట్రోల్ ధరల్లో కేంద్ర, రాష్ట్ర పన్నుల వాటా 60 శాతంంగా ఉంది. డీజిల్ పన్నుల విషయానికి వస్తే 54 శాతంగా ఉంది. ప్రస్తుతం చమురు ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో నాలుగు రాష్ట్రాలు పన్నుల్లో కోత విధించాయి. అసోం, మేఘాలయ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు పన్నులను తగ్గించాయి. రాజస్థాన్ వ్యాట్‌ను 38 శాతం నుండి 36 శాతానికి తగ్గించింది. అసోం కోవిడ్ సెస్‌ను రూ.5ను రద్దు చేసింది. మేఘాలయ ప్రభుత్వం ఏకంగా లీటర్ పెట్రోల్, లీటర్ డీజిల్ పైన వరుసగా రూ.7.40, రూ.7.10ని తగ్గించాయి.

English summary

పన్నులు తగ్గించాలి! పెట్రోల్, డీజిల్ ధరలపై RBI కీలక వ్యాఖ్యలు, ఆ రాష్ట్రాల్లో ధరలు తక్కువే | Will fuel rates be cut? What RBI Governor Shaktikanta Das has to say

Petrol, Diesel price has been on the rise affecting people's wallet adversely. However, there is a piece of good news for petrol, diesel users in India. The Reserve Bank of India (RBI) Governor Shaktikanta Das has suggested that indirect taxes be reduced. It is because of these that petrol, diesel prices in India are high.
Story first published: Thursday, February 25, 2021, 16:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X