For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా వైరస్: గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ తగ్గినా పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు తగ్గడం లేదు?

|

కరోనా వైరస్ కారణంగా అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నాయి. అయినప్పటికీ దేశీయంగా పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలు తగ్గడం లేదు. నెల రోజుల్లో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు 20 శాతం మేర తగ్గాయి. బ్యారెల్ ధర 45 డాలర్లకు పడిపోయింది. కానీ దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆ మేరకు తగ్గలేదు. కరోనా వైరస్ కారణంగా చైనా సహా ఇతర దేశాల్లో ఉత్పత్తులు తగ్గిపోయాయి. దీంతో ఈ ప్రభావం కనిపిస్తోంది. కరోనా కారణంగా మార్కెట్లు కూలుతున్నాయి. ఇన్వెస్టర్లు బంగారం వంటి వాటిపై ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీంతో వీటి ధరలు పెరుగుతున్నాయి.

SBI షాక్: రూ.500 నుండి రూ.3,000 వరకు పెరిగిన ఆ ఛార్జీలు, చెల్లించకుంటే 40% ఫైన్SBI షాక్: రూ.500 నుండి రూ.3,000 వరకు పెరిగిన ఆ ఛార్జీలు, చెల్లించకుంటే 40% ఫైన్

అప్పుడు భారీగా పెరగలేదు..

అప్పుడు భారీగా పెరగలేదు..

అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గినప్పటికీ ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.72, డీజిల్ రూ.65 వరకు ఉన్నాయి. 2017 సెప్టెంబర్ - అక్టోబర్ నెలలో బ్యారెల్ క్రూడాయిల్ ధర 54 నుండి 56 మధ్య ఉంది. అప్పుడు పెట్రోల్ ధర రూ.70, డీజిల్ రూ.58 వరకు ఉంది. ఆ తర్వాత 2018 చివరలో 2019 ప్రారంభంలో క్రూడాయిల్ ధరలు బ్యారెల్‌కు 59 వరకు పెరిగాయి. అయినా పెట్రోల్ ధరలు రూ.71, డీజిల్ రూ.64గానే ఉంది. అంటే అంతర్జాతీయంగా పెరిగిన ధర ప్రకారం ఇక్కడి రేట్లు పెరగలేదు.

నష్టాలు తగ్గించుకునేందుకు...

నష్టాలు తగ్గించుకునేందుకు...

ప్రస్తుతం బ్యారెల్ క్రూడాయిల్ ప్రస్తుతం 45 నుండి 50 డాలర్లుగా ఉంది. అంటే పెట్రోల్, డీజిల్ ధరలు రూ.5 వరకు తగ్గాలి. అయితే గతంలో అధికంగా ధరలు తగ్గించనందున పెట్రో కంపెనీలు కొంత నష్టాలను ఎదుర్కొన్నాయి. ఇప్పుడు ఆ నష్టాలను తగ్గించుకునేందుకు ధరలు తగ్గించడం లేదని భావిస్తున్నారు.

డాలరుతో రూపాయి మారకం విలువ

డాలరుతో రూపాయి మారకం విలువ

క్రూడాయిల్ ధరలు తగ్గినప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గకపోవడానికి మరో కారణం కూడా ఉంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ బలహీనపడిందని గుర్తు చేస్తున్నారు. రూపాయి మారకం గత ఏడాది రెండేళ్లలో రూ.68 నుండి రూ.71కి పడిపోయిందని, ఈ లెక్కన ధరలు రూ.2 వరకు అధికంగా ఉండాలని చెబుతున్నారు.

భారీ తగ్గుదల

భారీ తగ్గుదల

కాగా, అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు వరుసగా ఆరో రోజు తగ్గాయి. తాజాగా శుక్రవారం ఏడాదిలోనే ఒకేరోజు గరిష్టంగా దిగజారాయి. అదే సమయంలో 2016 తర్వాత వరుసగా వారం రోజుల్లో భారీగా తగ్గడం ఇదే మొదటిసారి. బ్రెంట్ క్రూడాయిల్ మే LCOc2 2 డాలర్లు లేదా 4 శాతం తగ్గి 49.67 వద్ద ఉంది. 2017 జూలై నుండి ఇది అత్యంత కనిష్టం.

English summary

కరోనా వైరస్: గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ తగ్గినా పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు తగ్గడం లేదు? | Why petrol and diese prices not down? Oil prices sink to lowest in over a year

Oil prices slumped for a sixth day in a row on Friday to their lowest in more than a year, causing futures to drop by the most in a week since 2016, as the spread of coronavirus stoked fears that a slowing global economy would hit energy demand.
Story first published: Sunday, March 1, 2020, 11:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X