ఐటీ రంగంలో ఉద్యోగాలు గాల్లో దీపాల్లా మారిపోయాయి. ఐటీ దిగ్గజ కంపెనీలైన కాగ్నిజంట్, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో తదితర కంపెనీలు తమ ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి. మధ్య స్థాయితో పాటు సీనియర్ స్థాయిలో ఉన్న ఉద్యోగులను ఈ కంపెనీలు టార్గెట్ చేశాయి. వీరినే టార్గెట్ చేయడం వెనుక కారణం లేకపోలేదు. ఇప్పుడు టెక్నాలజీ వేగవంతంగా మారిపోతోంది. ఇందుకు అనుగుణంగా ఉద్యోగులు తమ నైపుణ్యాలను మెరుగు పరచుకోవాలి. కొత్త టెక్నాలజీలను నేర్చుకోవాలి. లేకపోతే వీరి వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని భావిస్తున్న కంపెనీలు వారిని వదిలించుకోవాలని భావిస్తున్నాయి. ఐటీ రంగంలో తలపండిన నిపుణులు ఇదే మాట చెబుతున్నారు. మధ్యస్థాయిలో కనీసం 40,000 వరకు ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని ఇటీవలే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే కదా.
* రానున్న కొన్ని త్రైమాసికాల్లో దాదాపు 12,000 మందిని తగ్గించుకోనున్నట్టు కాగ్నిజెంట్ ఇప్పటికే ప్రకటించింది. మిగతా కంపెనీలు కూడా ఇదే స్థాయిలో సిబ్బందిని తగ్గించుకోవచ్చని వర్గాలు భావిస్తున్నాయి.
* ఈ ఏడాదిలో ఉద్యోగుల తగ్గింపు 50 వేలు దాటవచ్చని కూడా అంటున్నారు.

కొత్త ఏడాది బాగుంటుందట
* మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో కంపెనీలు తమ వ్యయాలను తగ్గించుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. కాబట్టి ఎక్కువ వేతనం పొందుతున్న వారిని వదిలించుకోవాలనుకుంటున్నాయి. కొత్త నైపుణ్యాలు ఉన్న ఫ్రెషర్ల తక్కువ వేతనాలకు దొరుకుతున్న నేపథ్యంలో వీరిని నియమించుకోవడానికి కంపెనీలు పెద్ద పీట వేస్తున్నాయి. వచ్చే ఏడాదిలో ఫ్రెషర్ల నియామకాలు ఎక్కువగానే ఉంటాయంటున్నారు.
* ఒక్క మధ్య స్థాయి ఒక ఉద్యోగిని తీసి వేస్తే అతని స్థానంలో ముగ్గురు జూనియర్లను తీసుకోవచ్చన్న ఉద్దేశంతో కంపెనీలు ఉన్నాయట. అందుకే ఉద్యోగులను తగ్గించుకోవాలని కంపెనీలు భావిస్తున్నాయట.

నియామకాలు తగ్గక పోవచ్చు..
* కొంత మంది ఉద్యోగులను కంపెనీలు తగ్గించుకున్నా గ్లోబల్ దిగ్గజ కంపెనీలు మాత్రం ఉద్యోగులను పెంచుకునే అవకాశం ఉందని పరిశ్రమ విశ్లేషకులు చెబుతున్నారు.
* ఎస్ఏపీ, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, గూగుల్ వంటి కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను పెంచుకునే అవకాశాలున్నాయని అంటున్నారు.

వీటికి డిమాండ్
* కొత్త టెక్నాలజీలు నేర్చుకున్న వారిని కంపెనీలు రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. ముఖ్యంగా పైథాన్, అంగ్యులర్ జావా, క్లౌడ్, ఆర్టిఫిషల్ ఇంటిలెజెన్స్ లేదా మెషిన్ లెర్న్ఇంగ్ వంటి ప్రోగ్రామ్స్ నేర్చుకున్న వారికి మంచి డిమాండ్ ఉంది.
కాబట్టి ఐటీ రంగంలో ఉన్న నిపుణులు తమ నైపుణ్యాలను ఎప్పటికి అప్పుడు మెరుగు పరచుకోవడమే కాకుండా కొత్త టెక్నాలజీలను నేర్చుకోవడం వల్ల మంచి ఉద్యోగ అవకాశాలను సంపాదించుకునే అవకాశం ఉంటుందని ఐటీ రంగ నిపుణులు చెబుతున్నారు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications