For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెండేళ్ల కనిష్టానికి ఫారెక్స్ నిల్వలు, ఎందుకు పతనమయ్యాయంటే?

|

భారత ఫారెక్స్ నిల్వలు భారీగా పడిపోయాయి. ఈ నెల 11వ తేదీతో ముగిసిన వారానికి విదేశీ మారక ద్రవ్య నిల్వలు 9.646 బిలియన్ డాలర్లు తగ్గి 622.275 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. దాదాపు రెండేళ్ల కనిష్టానికి వచ్చింది. 2020 మార్చి నెల 20వ తేదీతో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు 11.9 బిలియన్ డాలర్లు నష్టపోయి 554.359 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. అ ర్వాత ఇదే కనిష్టం.

ఈ నెల 7వ తేదీతో ముగిసిన వారంలో ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి వ్యాల్యూ ఆల్ టైమ్ గరిష్టస్థాయిలో పతనమైంది. దీంతో విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గాయి. ఈ నెల ఏడో తేదీన డాలర్ పైన రూపాయి వ్యాల్యూ 77.02కు పతనమైంది. ఆర్బీఐ జోక్యం చేసుకొని 100 కోట్ల డాలర్లను మార్కెట్‌లో ప్రవేశపెట్టి రూపాయి విలువ పతనం కాకుండా నిలువరించింది.

Why India’s forex reserves fell by nearly $10 billion, highest in 2 years

ఉక్రెయిన్ పైన రష్యా సైనిక చర్యతో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. విదేశీ సంసథాగత ఇన్వెస్టర్లు ఈక్విటీల నుండి నిధులు ఉపసంహరించడంతో రూపాయి మారకం వ్యాల్యూ ఆల్ టైమ్ కనిష్టానికి పతనమైంది. గత ఏడాది సెప్టెంబర్ మూడో తేదీతో ముగిసిన వారంలో ఫారెక్స్ రిజర్వ్స్ 642.453 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఇటీవలి కాలంలో ఇదే గరిష్టం.

English summary

రెండేళ్ల కనిష్టానికి ఫారెక్స్ నిల్వలు, ఎందుకు పతనమయ్యాయంటే? | Why India’s forex reserves fell by nearly $10 billion, highest in 2 years

India's foreign exchange (forex) reserves declined by $9.646 billion to $622.275 billion in the week ended March 11, the sharpest decline in nearly two years, as the Reserve Bank of India (RBI) heavily sold dollars to prevent the slide in the value of rupee.
Story first published: Sunday, March 20, 2022, 11:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X