కరోనా మహమ్మారి - లాక్ డౌన్ కారణంగా మే నెలలో ప్రతిద్రవ్యోల్భణస్థితి నెలకొంది. హోల్‌సేల్ ధరలు నాలుగున్నరేళ్ల కనిష్టానికి పడిపోయాయి. ఇంధనం, విద్యుత్, పలు ఆహార పదార్థాల ధరలు గణనీయంగా తగ్గిపోవడంతో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్భణ సూచీ (WPI-హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్) మైనస్ 3.21 శాతానికి దిగివచ్చింది. మార్చిలో ఇది 1 శాతంగా ఉంది. 2015 నవంబర్ తర్వాత ఇంత తక్కువగా నమోదు కావడం ఇదే మొదటిసారి. అప్పుడు ఈ సూచీ మైనస్ 3.7 వద్ద ఉంది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ WPI గణాంకాలు విడుదల చేసింది.

ఆయా ఆహార పదార్థాల ద్రవ్యోల్భణ రేటు
ఆహార పదార్ధాల ద్రవ్యోల్భణం ఏప్రిల్ నెలలో 2.55 శాతం కాగా, మే నెలలో 1.13 శాతానికి తగ్గింది. పప్పుధాన్యాల ద్రవ్యోల్భణం ఏప్రిల్ నెలలో 12.31 శాతంగా ఉండగా, మే నెలలో 11.91 శాతానికి పడిపోయింది. కూరగాయల ప్రతిద్రవ్యోల్భణం మైనస్ 12.48 శాతానికి పడిపోయింది. అయితే బంగాళదుంప ద్రవ్యోల్భణ రేటు 52.25 శాతం పెరిగింది. ప్రొటీన్ ఆధారిత ఉత్పత్తులైన గుడ్లు, మాంసం, చేపలు వంటి ద్రవ్యోల్భణ రేటు 1.94 శాతంగా ఉంది.

విద్యుత్, ఇంధన ధరల ద్రవ్యోల్భణం
మే నెలలో విద్యుత్, ఇంధన ధరల ద్రవ్యోల్భణం మైనస్ 19.83 శాతంగా కాగా, ఏప్రిల్ నెలలో మైనస్ 10.12 శాతంగా నమోదయింది. మ్యానుఫ్యాక్చరింగ్ ఉత్పత్తుల రేటు మే నెలలో 0.42 శాతం తగ్గాయి. దేశవ్యాప్తంగా కరోనా - లాక్ డౌన్ కారణంగా ఎలక్ట్రానిక్ విధానంలో ధరల సమాచారాన్ని సేకరించినట్లు కేంద్రం తెలిపింది. ఎంపిక చేసిన సంస్థాగత వర్గాలు, పరిశ్రమల నుండి నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ వెబ్ సైట్ ద్వారా డేటాను తీసుకున్నామని పేర్కొంది.

తగ్గిన దిగుమతులు
మరోవైపు ఎగుమతులు కూడా వరుసగా మూడో నెలలో తగ్గాయి. మే నెలలో ఇవి 36.47 శాతం తగ్గి 19.05 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. పెట్రోలియం, జౌళి, ఇంజినీరింగ్, రత్నాలు, ఆభరణాలు వంటి ప్రధాన రంగాల ఎగుమతులు భారీగా తగ్గాయి. దిగుమతులు కూడా 51 శాతం క్షీణించి 22.2 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఎగుమతులు, దిగుమతులు క్షీణించడంతో వాణిజ్య లోటు 31.5 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. అంతకుముందు నెలలో ఇది 15.36 బిలియన్ డాలర్లుగా ఉంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications