For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దూసుకుపోతున్న వాట్సాప్... లాభాలు ఎంత ఉన్నాయో తెలుసా?

|

వాట్సాప్ గురించి తెలియని వారు ఉంటారా.. మెసేజులు పంపడానికి, వాయిస్, వీడియో కాల్స్ చేయడానికి, ఫోటోలు, డాక్యుమెంట్లు షేర్ చేసుకోవడానికి ఈ యాప్ ను విపరీతంగా వాడుతున్నారు. చాలా సులభంగా దీన్ని వాడే సదుపాయం ఉండటం వల్ల ఎక్కువ మంది దీన్ని వినియోగించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఉచితంగానే సర్వీసులోను వినియోగించుకునే అవకాశం ఉండటం, ఎక్కువగా ప్రకటనలు లేకపోవడం వల్ల దీని వాడకందారులు పెరుగుతున్నారు. సోషల్ మీడియా దిగ్గజం పేస్ బుక్ కు చెందిన మెసేజింగ్ యాప్ వాట్సాప్ రాబడులు గణనీయంగా పెరుగుతున్నాయి.

లాభం రూ.57 లక్షలు

లాభం రూ.57 లక్షలు

* రిజిస్ట్రార్ అఫ్ కంపెనీస్ (ఆర్ ఓ సి) కు సమర్పించిన వివరాల ప్రకారం 2019 ఆర్ధిక సంవత్సరంలో దేశంలో వాట్సాప్ రాబడి 6.84 కోట్లు ఉండగా లాభం 57.18 లక్షల రూపాయలుగా ఉందని ఎకనామిక్ టైమ్స్ పత్రిక కథనం పేర్కొంది.

* ఐటీ ఆధారిత బిజినెస్ ప్రాసెస్, అవుట్ సోర్సింగ్ సర్వీసులు ద్వారా రాబడి వస్తున్నట్టు కంపనీ పేర్కొంది.

* 2018 ఆర్థిక సంవత్సరంలో కాంప్ ఖర్చులు 5 లక్షల రూపాయలుండగా ఎలాంటి రాబడి రాలేదని తెలిపింది.

* దేశంలో పేమెంట్ సర్వీసులు అందించడానికి ప్రయత్నాలు చేస్తోంది. అయితే దీనికి రెగ్యులేటరీ పరమైన అనుమతులు రావాల్సి ఉంది.

బిజినెస్ యాప్ కు ఆదరణ

బిజినెస్ యాప్ కు ఆదరణ

* వాట్సాప్ తన బిజినెస్ యాప్ ను ప్రారంభించిన ఏడాదిలోనే తొలి లాభాన్ని ప్రకటించింది. కంపెనీలు తమ కస్టమర్లతో సంబంధాలు పెంచుకోవడానికి ఈ బిజినెస్ యాప్ దోహదపడుతుంది.

* ప్రస్తుతం దేశంలో పది లక్షలమంది వాట్సాప్ బిజినెస్ యాప్ ను వాడుతున్నట్టు కంపెనీ చెబుతోంది.

* మొత్తంగా వాట్సాప్ కు 40 కోట్ల మంది వినియోగదారులు మన దేశంలో ఉన్నారు. ఈ కంపెనీకి మన దేశమే అతిపెద్ద మార్కెట్ గా ఉంది.

స్మార్ట్ ఫోన్లతో...

స్మార్ట్ ఫోన్లతో...

* స్మార్ట్ ఫోన్ల మార్కెట్ విస్తరిస్తున్న నేపథ్యంలో వాట్సాప్ వినియోగం కూడా జోరుగా పెరుగుతోంది. రానున్న కాలంలో పేమెంట్ సర్వీసులు కూడా ప్రారంభిస్తే వినియోగదారుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

ఎప్పటికప్పుడు అప్డేట్స్

ఎప్పటికప్పుడు అప్డేట్స్

* వాట్సప్ కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు పాత కస్టమర్లను కాపాడుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను వాట్సప్ తెస్తోంది.

* ఇప్పటికే అనేక రకాల ఫీచర్లను తెచ్చింది. రానున్న కాలంలో మొబైల్ కాల్స్ మాదిరిగా కాల్ వెయిటింగ్ ఫీచర్న్ కూడా తీసుకురావాలనుకుంటోందట.

* కొంత కాలం తర్వాత మెస్సేజ్ లు డిలీట్ అయ్యే ఫీచర్ ను కూడా తీసుకురావాలనుకుంటోందట.

* డార్క్ మోడ్ ను కూడా తీసుకురావాలనుకుంటోందట.. దీని వల్ల ఎక్కువ సేపు వాట్సాప్ ను వినియోగించినా కాళ్లపై ఎక్కువ ప్రభావం పడకుండా ఉంటుంది.

* సెక్యూరిటీ పరంగా కూడా కొన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో భద్రత ఫీచర్లను మరింత పటిష్టం చేయబోతోంది.

* మరిన్ని ఎక్కువ డివైస్ లకు కూడా సపోర్ట్ చేసే విధంగా సిద్ధమవుతోంది.

English summary

దూసుకుపోతున్న వాట్సాప్... లాభాలు ఎంత ఉన్నాయో తెలుసా? | Whatsapp India records profit Rs 57.18 lakh

Messaging app WhatsApp has posted its India revenues for the first time for financial year 2019. WhatsApp has reported revenues of Rs. 6.84 crore for fiscal 2019 and a profit of Rs.57.18 lakh.
Story first published: Saturday, November 30, 2019, 19:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X