For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

RBI గుడ్‌న్యూస్, వడ్డీ రేటు తగ్గితే ప్రతి నెల రూ.2,000 ఆదా: హోంలోన్, వెహికిల్ లోన్‌పై ఇలా ఆదా..

|

ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ఆర్బీఐ కీలక రేట్ల కోత, రుణ వాయిదాల మారటోరియం పొడిగింపు, ఎగుమతి-దిగుమతిదారులకు ఊరట, ఎగ్జిమ్ బ్యాంకుకు సాయం వంటివి ప్రకటించింది. మార్చి నెలాఖరులో రెపో రేటును 0.75 శాతం తగ్గించిన ఆర్బీఐ తాజాగా 40 బేసిస్ పాయింట్లు లేదా 0.4 శాతం తగ్గించింది. దీంతో ఇరవై ఏళ్ల కనిష్టస్థాయి అయిన 4 శాతానికి రెపో రేటు పరిమితమైంది. దీంతో హోమ్ లోన్, వెహికిల్ లోన్, ఇతర రుణాలు చౌక కానున్నాయి. నెలవారీ ఈఎంఐల భారం తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రయోజనాన్ని బ్యాంకులు కస్టమర్లకు బదలీ చేయాలి.

నెగిటివ్‌గా ఇండియా జీడీపీ: ఆర్బీఐ, EMI మారటోరియంపై మళ్లీ గుడ్‌న్యూస్నెగిటివ్‌గా ఇండియా జీడీపీ: ఆర్బీఐ, EMI మారటోరియంపై మళ్లీ గుడ్‌న్యూస్

ఎంత భారం తగ్గుతుంది!

ఎంత భారం తగ్గుతుంది!

ఉదాహరణకు... ఓ ఉద్యోగి 20 ఏళ్ల కాలపరిమితితో రూ.50 లక్షల రుణం తీసుకున్నాడు. వడ్డీ రేటు 7.65 శాతంగా ఉంది. అంటే ప్రస్తుతం ఈఎంఐ రూ.40,739 అవుతుంది. ఆర్బీఐ కల్పించిన 40 బేసిస్ పాయింట్లు తగ్గింపు ప్రయోజనం బ్యాంకు కనుక ఇస్తే వడ్డీ రేటు 7.65 శాతం నుండి 7.25 శాతం అవుతుంది. అప్పుడు ఈఎంఐ రూ.1,220 తగ్గి రూ.39,519కి తగ్గుతుంది. ఇది రుణగ్రహీతలకు ప్రయోజనకరం. రూ.75 లక్షల లోన్ తీసుకుంటే ఇప్పటి వరకు ఈఎంఐ రూ.60,426గా ఉంటే, 40 బేసిస్ పాయింట్లు తగ్గిస్తే ఈఎంఐ భారం రూ.2,085 తగ్గి రూ.58,341 అవుతుంది.

జూలై క్వార్టర్ నుండి అమలు

జూలై క్వార్టర్ నుండి అమలు

ఆర్బీఐ రెపో రేటు 4.4% నుంచి 4% తగ్గించింది ఆర్బీఐ. ఈ ప్రభావం జూలై క్వార్టర్ నుంచి బ్యాంకుల గృహ, వాహన రుణాలపై పడనుంది. ప్రస్తుతం బ్యాంకులు హోమ్ లోన్స్ పైన 7.15 శాతం నుండి వసూలు చేస్తున్నాయి. ఇప్పుడు వడ్డీలు తగ్గిస్తే రుణగ్రహీతలపై భారం తగ్గుతుంది.

వెహికిల్ లోన్‌పై ఇలా ఆదా

వెహికిల్ లోన్‌పై ఇలా ఆదా

వడ్డీ రేట్లు తగ్గితే వెహికిల్ రుణాలు కూడా కాస్త తగ్గుతాయి. ఉదాహరణకు ఓ వ్యక్తి ఏడేళ్ల కాలపరిమితికి 7.95% వడ్డీ రేటుతో రూ.5 లక్షలు రుణంగా తీసుకుంటే ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం ప్రతి నెల ఈఎంఐ రూ.7,781 చెల్లించాలి. ఆర్బీఐ రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో వడ్డీ రేటు 7.55 శాతానికి తగ్గుతుంది. అప్పుడు ఈఎంఐ భారం రూ.7,681కు తగ్గుతుంది. ఏడేళ్లలో రూ.8,400 ఆదా అవుతాయి. రూ.10 లక్షల వెహికిల్ రుణం తీసుకుంటే రూ.16వేలకు పైగా ఆదా అవుతుంది.

English summary

RBI గుడ్‌న్యూస్, వడ్డీ రేటు తగ్గితే ప్రతి నెల రూ.2,000 ఆదా: హోంలోన్, వెహికిల్ లోన్‌పై ఇలా ఆదా.. | What RBI's repo rate cut means for loan EMIs: EMI may reduce by this much

The RBI lowered the repo rate by 40 basis points Friday after reducing it by 25 basis points mid-April and 75 basis points on March 27. The customers now expect the banks to pass on the benefits on their car loans, personal loans and home loans.
Story first published: Saturday, May 23, 2020, 13:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X