For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Software Engineer: టెక్కీలను వాడేస్తున్న ఐటీ కంపెనీలు.. సెన్సేషనల్ విషయాలు బయటకు.. మరీ దారుణంగా..!!

|

Software Engineer: దేశంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు చాలా మంచి జీతాలు వస్తుంటాయని భావిస్తుంటారు. అయితే వీక్‌డే రీసెర్చ్ ప్రకారం.. ఐటీ కంపెనీల కంటే స్టార్టప్ లు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు మంచి వేతనాలు అందిస్తున్నట్లు తేలింది. విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు సైతం తక్కువ వేతనాలను చెల్లిస్తున్నాయి. ప్రాడక్ట్ బేస్డ్ స్టార్టప్ కంపెనీల్లో టెక్కీలు ఏడాదికి పదుల లక్షల్లో వేతనాలు అందుకుంటున్నారు. వీక్‌డే 50,000 మంది ఇంజనీర్ల జీతం డేటాను విశ్లేషించింది.

ఈ కంపెనీల్లో జీతాలు అధికం..

ఈ కంపెనీల్లో జీతాలు అధికం..

విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి భారతీయ ఐటి కంపెనీలలో పనిచేస్తున్న వ్యక్తులతో పోలిస్తే షేర్‌చాట్, CRED, మీషో, స్విగ్గీ వంటి ఇతర స్టార్టప్‌ల కోసం పనిచేస్తున్న ఇంజనీర్లు చాలా ఎక్కువ వార్షిక వేతనాన్ని పొందుతున్నట్లు డేటా తెలిపింది.

షేర్‌చాట్ సూపర్ శాలరీస్..

షేర్‌చాట్ మిడ్-లెవల్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు అత్యధికంగా చెల్లిస్తున్నట్లు సర్వే వెల్లడించింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ సుమారు 4 సంవత్సరాల అనుభవం ఉన్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు వార్షిక ప్యాకేజ్ కింద రూ.47 లక్షలు చెల్లిస్తోంది. CRED, మీషో ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అనుభవం ఉన్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు వరుసగా రూ.40 లక్షలు, రూ.39 లక్షలు చెల్లిస్తున్నాయి.

ఐటీ కంపెనీల్లో మాత్రం..

ఐటీ కంపెనీల్లో మాత్రం..

సాధారణంగా 4 ఏళ్లు అనుభవం ఉన్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌లకు TCS, Wipro, Infosys వంటి సర్వీస్-ఆధారిత సాంప్రదాయ IT కంపెనీలు ఏడాదికి కేవలం రూ.10 లక్షలు చెల్లిస్తున్నాయి. ఈ పెద్ద IT కంపెనీలు అందించే ప్రారంభ జీతం వార్షిక ప్రాతిపదికన దాదాపు రూ.7 లక్షలుగా ఉన్నాయి. ఇది కూడా స్టార్టప్‌లు అందించే దానికంటే చాలా తక్కువ. బైజూస్, ఫ్రెష్‌వర్క్స్, క్వికర్, షాప్‌క్లూస్ వంటి కంపెనీలు తమ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు అతి తక్కువ చెల్లిస్తున్నాయి. అయితే.. Zomato, PayTM, Flipkart వంటి కంపెనీలు అదే స్థాయి అనుభవం ఉన్న వ్యక్తులకు వరుసగా రూ.32 లక్షలు, రూ.22 లక్షలు, రూ.36 లక్షలు చెల్లిస్తున్నాయి.

ఎంత కాలం పనిచేస్తున్నారంటే..

ఎంత కాలం పనిచేస్తున్నారంటే..

ఐటీ కంపెనీలతో పోల్చితే స్టార్టప్ కంపెనీల్లో సగటు ఉద్యోగి పనిచేస్తున్న కాలం ఎక్కువగా ఉంది. ఇంజనీర్లు ఈ స్టార్టప్‌లలో సగటున 1.5 నుంచి 2 ఏళ్ల వరకు పనిచేస్తున్నారు. అదే సాంప్రదాయ ఐటీ కంపెనీల్లో మాత్రం 2.4 ఏళ్లు పనిచేస్తున్నారు. CREDలో 1.8 సంవత్సరాలు, బైజుస్ లో 1.4 సంవత్సరాలు పనిచేస్తున్నారు. సగటున కేవలం 10 శాతం జీతం మాత్రమే పెంపు ఉండటం వల్ల ఉద్యోగులు కంపెనీలను మారుతున్నట్లు తెలుస్తోంది. అదే కంపెనీ మారటం వల్ల వారు 50 నుంచి 70 శాతం జీతాల్లో పెంపును పొందుతున్నారు. భారతదేశంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ల కోసం ప్రస్తుత జాబ్ మార్కెట్ తరచుగా ఉద్యోగాలు మారే ఇంజనీర్‌లకు ప్రోత్సాహాన్ని ఇస్తోంది.

Read more about: jobs business news
English summary

Software Engineer: టెక్కీలను వాడేస్తున్న ఐటీ కంపెనీలు.. సెన్సేషనల్ విషయాలు బయటకు.. మరీ దారుణంగా..!! | Weekday data revealed that startup companies paying high salaries than Wipro, TCS and Infosys to engineers

Weekday data revealed that startup companies paying high salaries than Wipro, TCS and Infosys to engineers
Story first published: Wednesday, September 28, 2022, 10:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X