For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాగ్నిజెంట్‌లో 23,000 మంది ఫ్రెషర్ల నియామకం

|

2021లో 23,000 మంది ఫ్రెషర్స్‌ను క్యాంపస్ ఇంటర్వ్యూ ద్వారా నియమించుకోనున్నట్లు టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ కార్ప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ నంబియార్ తెలిపారు. ఇందులో ఎక్కువగా ఇండియా నుండి ఉండనున్నారు. యూనివర్సిటీలు, ఇతర విద్యాసంస్థల నుండి ఇంజినీరింగ్, సైన్స్, మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్స్‌ను నియమించుకునే విషయంలో కాగ్నిజెంట్ టాప్ రిక్రూటర్‌గా ఉన్నట్లు తెలిపారు. ఈ ఏడాది క్యాంపస్ నుండి 17వేలమందిని తీసుకున్నట్లు తెలిపారు.

10 శాతం కరెక్షన్.. ఇప్పుడు మార్కెట్లో ఇన్వెస్ట్ చేయవచ్చా?10 శాతం కరెక్షన్.. ఇప్పుడు మార్కెట్లో ఇన్వెస్ట్ చేయవచ్చా?

తమ ప్రధాన దృష్టి వాటాదారులైన క్లయింట్స్, ఉద్యోగులు, అతిపెద్ద వ్యవస్థ అన్నారు. కంపెనీకి ఉద్యోగులు వెన్నెముక వంటి వారు అన్నారు. భారత్ మార్కెట్ వేగంగా వృద్ధి సాధిస్తోందని, ఇది ఆకర్షణీయంగా ఉందన్నారు. డిజిటల్ అడాప్షన్ భారతీయ కంపెనీల్లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. 2008-09లో తమ బిజినెస్ యూనిట్ ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు సుస్థిర స్థానాన్ని చేరుకున్నట్లు తెలిపారు. ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సురెన్స్, రిటైల్, లైఫ్ సైన్సెస్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎడ్యుకేషన్ సహా వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్నామన్నారు.

We’ll hire 23,000 freshers in 2021: Cognizant chairman

ప్రస్తుతం భారత్‌లో తమకు 90 మందికి పైగా కస్టమర్లు ఉన్నారని తెలిపారు. గత కొన్నాళ్లుగా తమ కంపెనీ సగటు కంటే భారత్‌లో వేగవంతమైన వృద్ధి కనిపిస్తోందన్నారు. ఇక్కడి నుండి పెద్ద పెద్ద ఒప్పందాలు కుదిరినట్లు తెలిపారు.

English summary

కాగ్నిజెంట్‌లో 23,000 మంది ఫ్రెషర్ల నియామకం | We’ll hire 23,000 freshers in 2021: Cognizant chairman

Cognizant Technology Solutions Corp. recently appointed Rajesh Nambiar as the chairman and managing director (CMD) for its India operations, replacing Ramkumar Ramamoorthy who resigned after 23 years with the company.
Story first published: Thursday, December 10, 2020, 20:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X