For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అపర కుబేరుడు..బౌన్స్ బ్యాక్: నష్టాలొచ్చినా: ఆ కంపెనీల్లో పెట్టుబడుల ప్రవాహం: ఫైజర్ సహా

|

న్యూయార్క్: కురువృద్ధ అపర కుబేరుడు, బిజినెస్ టైకూన్.. వారెన్ బఫెట్ సంచల నిర్ణయాలను తీసుకున్నారు. ఎక్కడ పోగొట్టుకున్నారో.. అక్కడే వెతికే పనిలో పడ్డారు. బిలియన్ డాలర్ల కొద్దీ నష్టాలను చవి చూసిన ఆయన వెనక్కి తగ్గట్లేదు. వాటిని భర్తీ చేసుకునేలా కనిపిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సిన్ తయారీకి ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని.. ఆ రంగంలో భారీ పెట్టుబడులను పెట్టారు. నాలుగు ఫార్మా కంపెనీల్లో ఇన్వెస్ట్ చేశారు. ఇందులో ఫైజర్ కూడా ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

వారెన్ బఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హాతవే ఇంటర్నేషనల్ కార్పొరేషన్ సంస్థ.. తాాజాగా దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. 5,7 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులను పెట్టబోతున్నట్లు ప్రకటించింది. అబ్‌వీ ఇంటర్నేషనల్ కార్పొరేషన్, బ్రిస్టల్-మైయర్స్ స్క్విబ్ కంపెనీ, మెర్క్ అండ్ కో, ఫైజర్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్లలో 5.7 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులను పెట్టబోతున్నట్లు పేర్కొంది. వాటితో పాటు టీ-మొబైల్ యూఎస్ కంపెనీలోనూ స్టేక్‌ను కొనుగోలు చేసింది. 5జీ స్పెక్ట్రమ్‌లో విస్తృతంగా పనిచేస్తోన్న సంస్థ ఇది. అలాగే- స్నోఫ్లేక్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్‌లోనూ ఇన్వెస్ట్ చేసింది.

Warren Buffetts Berkshire bets on Big Pharma companies, invests in four drugmakers

ఫైజర్ ఇంటర్నేషనల్ కంపెనీలో 136 మిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టనుంది బెర్క్‌షైర్. అబ్‌వీ ఇంటర్నేషనల్ కార్పొరేషన్, బ్రిస్టల్-మైయర్స్ స్క్విబ్ కంపెనీ, మెర్క్ అండ్ కో సంస్థల్లో 1.8 బిలియన్ డాలర్ల చొప్పున ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన ప్రాథమిక ప్రతిపాదనలను పూర్తి చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన అనంతరం హెల్త్‌కేర్ సెక్టార్ స్వరూపమే మారిపోయిందని, ఈ రంగం మరింత పురోగమించేలా కనిపిస్తోందని బఫెట్ పోర్ట్‌ఫోలియో మేనేజర్లు టాడ్ కోంబ్స్, టెడ్ వెష్లెర్ తెలిపారు.

మున్ముందు మరిన్ని లాభాలను ఆర్జించడానికి ఫార్మా సెక్టార్ ఊతం ఇస్తోందని పిట్స్‌బర్గ్‌కు చెందిన హెన్రీ హెచ్ ఆర్మ్‌స్ట్రాంగ్ అండ్ అసోసియేట్స్ అధ్యక్షుడు జేమ్స్ ఆర్మ్‌స్ట్రాంగ్ అంచనా వేశారు. పెట్టుబడులు భారీగా ఫార్మా కంపెనీల్లోకి ప్రవహించడానికి ఇదే కారణమని చెప్పారు. కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి అవసరమైన వ్యాక్సిన్‌ తయారీకి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉందని, దీనికి అనుగుణంగా పరిశోధనలు, క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయని అన్నారు. తమ వ్యాక్సిన్ 90 శాతం మేర ఫలితాలను ఇస్తోందంటూ ఫైజర్ కంపెనీ చేసిన ప్రకటన ఫార్మా రంగానికి ఊపును తీసుకొచ్చిందని అభిప్రాయపడ్డారు.

English summary

అపర కుబేరుడు..బౌన్స్ బ్యాక్: నష్టాలొచ్చినా: ఆ కంపెనీల్లో పెట్టుబడుల ప్రవాహం: ఫైజర్ సహా | Warren Buffett's Berkshire bets on Big Pharma companies, invests in four drugmakers

Warren Buffett's Berkshire Hathaway Inc said on Monday it has begun investing in the stocks of four large drugmakers, betting on an industry that could benefit when the world begins emerging from the coronavirus pandemic
Story first published: Thursday, November 19, 2020, 8:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X