For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Tata-Warren Buffet: టాటాలకు పోటీగా చైనా కంపెనీ.. వారెన్ బఫెట్ అండతో అరంగేట్రం.. నిలబడగలదా..?

|

Tata-Warren Buffet: చాలా కంపెనీలు ప్రస్తుతం తమ ఉత్పత్తి కేంద్రాలను చైనా నుంచి భారత్ కు తరలించాలిస్తున్నాయి. అయితే పొరుగు దేశాల పెట్టుబడుల విషయంలో కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. మరీ ముఖ్యంగా ఈవీ వాహనాల దిగుమతులపై భారీ డ్యూటీలను విధిస్తోంది. అమెరికా ఈవీ ఆటోమెుబైల్ దిగ్గజం టెస్లా విజ్ఞప్తులను సైతం తిరస్కరించిన విషయం తెలిసిందే.

భారత మార్కెట్లోకి..

భారత మార్కెట్లోకి..

ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని దేశంలో పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ తరుణంలో చైనాలోని అతి పెద్ద ఆటోమొబైల్ కంపెనీ BYD ఇప్పుడు భారతీయ మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. తన రిటైల్ విక్రయాలను ప్రారంభించాలనుకుంటున్న ఈ కంపెనీకి అమెరికా ప్రముఖ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ మద్ధతును కలిగి ఉంది.

ఆటోమొబైల్ రంగం..

ఆటోమొబైల్ రంగం..

ఇప్పటికే డీజిల్ కార్ల తయారీని అనేక కంపెనీలు నిలిపివేశాయి. ఈ క్రమంలో రానున్న 5 ఏళ్లలో పెట్రోల్ కార్లు సైతం నిలిచిపోతాయని తెలుస్తోంది. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ కార్లు, విద్యుత్ బైక్స్ డిమాండ్ ను క్యాష్ చేసుకోవటానికి అనేక కంపెనీలు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం చైనాకు చెందిన కంపెనీ కూడా మార్కెట్లో గట్టి పోటీగా నిలవనుంది.

టాటాలు నెం.1..

టాటాలు నెం.1..

భారత విద్యుత్ కార్ల తయారీ, విక్రయాల మార్కెట్లో టాటా మోటార్స్ రారాజుగా ఉంది. భారతీయ వినియోగదారుల బడ్జెట్ కు అనుగుణంగా కార్లను విడుదల చేస్తోంది. తాజాగా కంపెనీ టాటా టియాగో ఈవీ వాహనాల బుక్కింగ్స్ ప్రారంభించింది. దీనికి అనూహ్య స్పందన రావటంతో సర్వర్లు సైతం క్రాష్ అయ్యాయి. ఇది టాటాలపై నమ్మకాన్ని, వారి పట్ల భారత వినియోగదారుల ప్రేమను రుజువు చేస్తోంది. ప్రస్తుతం వాహన మార్కెట్లో టాటా టియాగో రికార్డుల మోత మోగుతోంది.

కొత్త కారు విడుదల..

కొత్త కారు విడుదల..

భారత వాహన ప్రియుల కోసం సరికొత్త BYD-ATTO 3 మోడల్ SUVని విడుదల చేసింది. ఇప్పుడు రిటైల్ విక్రయానికి ఎలక్ట్రిక్ SUV e6ని కూడా తీసుకొచ్చింది. ATTO 3 కారును బుక్ చేసుకోవటానికి రూ.50 వేలు ముందస్తుగా చెల్లించి బుక్ చేసుకోవచ్చని తెలిపింది. బుక్కింగ్స్ చేసుకున్న మెుదటి 500 మందికి జనవరి 2023లో కార్ల డెలివరీ చేయనున్నట్లు ప్రకటించింది.

కారు ఫీటర్స్..

కారు ఫీటర్స్..

చైనా సంస్థ BYD విడుదల చేస్తున్న ఈ కారు పనితీరు, డిజైన్ విషయాలను పరిశీలిస్తే అది హ్యుందాయ్ కోనా EV, MG ZS EVలతో పోటీ పడుతోంది. ఈ కారు కేవలం 50 నిమిషాల్లో సున్నా నుంచి 80 శాతం ఛార్జ్ అవుతుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేయబడిన కారు 521 కిలోమీటర్లు ప్రయాణించగలదు. కేవలం 7.3 సెకన్లలోనే కారు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందనని కంపెనీ వెల్లడించింది. పైగా ఈ కారులో 7 ఎయిర్ బ్యాగ్స్ ఉండటం గమనార్హం.

ప్రధాన లక్షణం

ప్రధాన లక్షణం

BYD-ATTO 3 ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్‌లతో వస్తుంది, ఇది కేవలం 50 నిమిషాల్లో 0-80 శాతం ఛార్జింగ్‌ని తీసుకుంటుంది, అయితే పూర్తిగా ఛార్జ్ చేయబడిన కారు 521 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. 0-100 kmh స్ప్రింట్ కేవలం 7.3 సెకన్లు పడుతుంది. అలాగే ఈ కారులో 7 ఎయిర్ బ్యాగ్స్ ఉండటం గమనార్హం.

Read more about: warren buffet tata electric cars
English summary

Tata-Warren Buffet: టాటాలకు పోటీగా చైనా కంపెనీ.. వారెన్ బఫెట్ అండతో అరంగేట్రం.. నిలబడగలదా..? | Warren Buffet backed china ev car maker BYD entered india market against tata motors

Warren Buffet backed china ev car maker BYD entered india market against tata motors
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X