For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు సెకండ్ హ్యాండ్ కారు కొనాలనుకుంటున్నారా? అయితే ఇవి మీకు చాలా ఉపయోగపడతాయి?

|

కొత్త కారు కొనుగోలు చేయాలని అందరికీ ఉంటుంది. కానీ బడ్జెట్ సరిపోక తమ కొనుగోలు నిర్ణయాలను వాయిదా వేసుకునే వారు కొంత మంది ఉంటారు. రుణ సదుపాయం అందుబాటులో ఉన్నా నెల వారీ వాయిదాలు భారంగా ఉంటాయని మరి కొందరు భావిస్తుంటారు. ఇలాంటి వారు సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేయాలనుకుంటారు. ఇలాంటి వారి సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కొత్తగా మరిన్ని వెబ్ సైట్లు లేదా స్టార్ట్అప్ కంపెనీలు అందుబాటులోకి వస్తున్నాయి. వీటి ద్వారా చాలా సులభంగా సెకండ్ హ్యాండ్ కార్ల క్రయవిక్రయాలు చేయవచ్చు. ఆ వివరాలు తెలుసుకుందామా...

తెలంగాణకు కేంద్రం మరింత షాక్! తగ్గుతున్న పన్నుల వాటాతెలంగాణకు కేంద్రం మరింత షాక్! తగ్గుతున్న పన్నుల వాటా

కార్ల కంపెనీల ప్రీ ఔన్డ్ వ్యాపారం..

కార్ల కంపెనీల ప్రీ ఔన్డ్ వ్యాపారం..

* కొత్త కార్లను విక్రయిస్తున్న కార్ల కంపెనీలు సెకండ్ హ్యాండ్ లేదా ప్రీ ఔన్డ్ కార్ల వ్యాపారాన్ని కూడా నిర్వహిస్తున్నాయి. పాత కారును ఎక్స్చేంజి చేసి కొత్త కారు కొనుగోలు చేసే వారు ఉంటారు. ఇలాంటి కార్లకు మెరుగులు దిద్ది ఈ కంపెనీలు విక్రయిస్తున్నాయి. ఈ కార్లకు కొంత కాలం పాటు గ్యారంటీ ఇవ్వడంతో పాటు ఉచిత సర్వీసింగ్ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. కాబట్టి వీటి ద్వారా కార్లను కొనుగోలు చేయవచ్చు.

* మారుతి .. ట్రూ వాల్యూ పేరుతో, హ్యుండై.. హెచ్ ప్రామిస్ పేరుతో, టొయోటా.. యు ట్రస్ట్ పేరుతో, మహీంద్రా.. మహీంద్రా ఫస్ట్ ఛాయస్ పేరుతో సెకండ్ హ్యాండ్ వాహనాల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాయి. ఇతర కంపెనీలు, లగ్జరీ కార్ల కంపెనీలు కూడా ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాయి. వీటి ద్వారా ఆయా కంపెనీల కస్టమర్లు మరింతగా పెరిగే అవకాశం ఏర్పడుతోంది.

ఇతర వెబ్ సైట్లు...

ఇతర వెబ్ సైట్లు...

* కార్ల కంపెనీలే కాకుండా ఇతర కంపనీలు కూడా తమ వెబ్ సైట్ల ద్వారా కార్ల క్రయవిక్రయాలు జరుపుతున్నాయి. వీటి ద్వారా చాలా సులభంగా కార్ల అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతున్నాయి. కాబట్టి వీటికి ఆదరణ పెరుగుతోంది.

* క్వికర్ డాట్ కామ్, జిగ్ వీల్స్ డాట్ కామ్, ఆటో పోర్టల్ డాట్ కామ్, కార్ వాలే డాట్ కామ్, కార్ దేఖో డాట్ కామ్, కార్స్ 24 డాట్ కామ్, కార్ ట్రేడ్ వంటి వెబ్ సైట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా మన బడ్జెట్ కు తగిన విధంగా ఉండే కారును కొనుగోలు చేయవచ్చు.

ఇవీ సదుపాయాలు...

ఇవీ సదుపాయాలు...

* ఈ వెబ్ సైట్ల ద్వారా నచ్చిన నగరంలో ఉన్న కార్లను ఎంచుకోవచ్చు. మోడల్ ను బట్టి, బడ్జెట్ కు అనుగుణంగా, బాడీ టైపు ఆధారంగా నచ్చిన మోడల్ ఎంచుకోవచ్చు. అదే విధంగా విక్రయించవచ్చు.

* కొనుగోలు చేసే మోడల్ కు సంభందించిన ఫోటోలు అందుబాటులో ఉంటాయి.

* ఫైనాన్స్ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నాయి. ఎన్ని నెలలకు ఎంత వడ్డీ రేటు, ఎంత ఈఎంఐ చెల్లించాల్సి వస్తుందన్న వివరాలను కూడా తెలుసుకోవచ్చు.

* కొత్త కార్ల మాదిరిగా మరో కారుతో కంపేర్ చేసుకోవచ్చు.

మెజారిటీ మధ్యవర్తుల ద్వారానే...

మెజారిటీ మధ్యవర్తుల ద్వారానే...

* సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాల్లో అధిక శాతం మధ్యవర్తుల ద్వారానే జరుగుతుంటాయి. వీరు కొంత కమీషన్ ను తీసుకొని వాహనాలు విక్రయించే వారికి, కొనుగోలు చేసే వారికి సేవలు అందిస్తుంటారు.

* అయితే కొత్త కార్ల కన్నా సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలు అధికంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాపారంలోకి కంపెనీలు ప్రవేశించాయి.

* అయినప్పటికీ ఈ వ్యాపారంలో అపార అవకాశాలు ఉన్న నేపథ్యంలో కొత్తగా మరిన్ని కంపెనీలు కూడా ప్రవేశిస్తున్నాయి.

Read more about: car కారు
English summary

మీరు సెకండ్ హ్యాండ్ కారు కొనాలనుకుంటున్నారా? అయితే ఇవి మీకు చాలా ఉపయోగపడతాయి? | Want to buy second hand car?

Now a days many people want to buy second hand cars instead of New car. Second hand cars are low priced and available in various cities. In this space there are lot of opportunities available so that new companies also entering to this sector. before buying a second hand car u can visit many second hand car selling websites.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X