For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత్‌కు వాల్‌మార్ట్ భారీ విరాళం: ఏమేమి ఇవ్వనుందంటే?

|

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ విలయాన్ని సృష్టిస్తోంది. పంజా విసురుతోంది. రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు లక్షల్లో నమోదవుతున్నాయి. కొద్దిరోజులుగా వరుసగా మూడున్నర లక్షలకు పైగా కొత్త కేసులు వెలుగులోకి రాగా.. తాజాగా ఆ సంఖ్య నాలుగు లక్షల మార్క్‌ను దాటింది. కరోనా మరణాలు సైతం బెంబేలెత్తిస్తున్నాయి. రోజూ మూడువేలకు పైగా మరణాలు నమోదవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో 3,523 మంది కరోనా బారిన పడి కన్నుమూశారు.

ఆక్సిజన్ అందక..

ఆక్సిజన్ అందక..

దేశంలో నమోదైన మొత్తం యాక్టివ్ కేసులు 33 లక్షలకు చేరువ అయ్యాయి. వాటి సంఖ్య 32,68,710కి చేరింది. ఒకేసారి ఇన్ని లక్షలమందికి వైద్యాన్ని అందించడానికి అవసరమైనన్ని మౌలిక సదుపాయాలు భారత్‌లో లేవనేది స్పష్టమౌతోంది. ఆసుపత్రుల్లో పడకలు దొరకట్లేదు. ఆక్సిజన్ అందక పదుల సంఖ్యలో కరోనా పేషెంట్లు తమ తుదిశ్వాసను విడుస్తున్నారు. కరోనా వల్ల కన్నుమూసిన వారి మృతదేహాలకు అంత్యక్రియలు చేయడానిక్కూడా చోటు దొరకని దుస్థితి నెలకొంది. కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా ఇవే తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయి.

వాల్‌మార్ట్ ముందుకు..

వాల్‌మార్ట్ ముందుకు..

దీన్ని చూసి చలించిన పలు దేశాలు భారత్‌కు సహాయాన్ని అందించడానికి ముందుకొస్తున్నాయి. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి అనేక దేశాలు ఆక్సిజన్ జనరేటర్లు, సిలిండర్లు, వెంటిలేటర్లు, ఐసీయూ పరికరాలను అందజేస్తున్నాయి. భారత్‌లో తమ కార్యకలాపాలను సాగిస్తోన్న కొన్ని బహుళజాతి సంస్థలు సైతం తమవంతు సహకారాన్ని అందించనున్నాయి. అమెరికాకు చెందిన చెయిన్ హైపర్ మార్కెట్ల సంస్థ, మల్టీనేషనల్ రిటైల్ కార్పొరేషన్ వాల్‌మార్ట్.. భారత్‌కు భారీ సహాయాన్ని ప్రకటించింది.

ఆక్సిజన్ జనరేటింగ్ ప్లాంట్లు..

ఆక్సిజన్ జనరేటింగ్ ప్లాంట్లు..

20 ఆక్సిజన్ జనరేటింగ్ ప్లాంట్లు, అదే మొత్తంతో కూడిన క్రయోజనిక్ కంటైనర్లను విరాళంగా ప్రకటించింది. క్రయోజనిక్ కంటైనర్లు.. ఆక్సిజన్‌ను నిల్వ చేయడానికీ వాటిని రవాణా చేయడానికీ ఉపయోగపడతాయి. వాటితో పాటు 3000 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, 500 ఆక్సిజన్ సిలిండర్లను భారత్‌కు అందజేస్తామని అమెరికా అర్కాన్సాస్‌లోని వాల్‌మార్ట్ ప్రధాన కార్యాలయం ప్రకటించింది. వాల్‌మార్ట్ ఫౌండేషన్ ద్వారా ప్రత్యేకంగా మరో 2,500 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను అందిస్తామని తెలిపింది.

రెండు మిలియన్ డాలర్ల మేర..

రెండు మిలియన్ డాలర్ల మేర..

వాటి విలువ మొత్తం రెండు మిలియన్ డాలర్లుగా నిర్ధారించింది. ఇందులో ఒక మిలియన్ డాలర్ల మొత్తాన్ని వాల్‌మార్ట్ ఫౌండేషన్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ సూచించిన విధంగా డాక్టర్స్ ఫర్ యు, మరో మిలియన్ డాలర్లను గివ్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్‌కు అందజేస్తామని తెలిపింది. వాల్‌మార్ట్ కెనడా సైతం తమ పిలుపునకు స్పందించిందని, అంబులెన్సులు, పేషెంట్లను ఆసుపత్రులు, క్వారంటైన్ కేంద్రాలకు తరలించడానికి అవసరమైన అవసరమైన వాహనాలను కొనుగోలు చేయడానికి నిధులను కేటాయిస్తుందని, ఈ మొత్తాన్ని కెనడా రెడ్‌క్రాస్ సొసైటీకి అందజేస్తుందని అక్కడి నుంచి ఈ నిధులు భారత రెడ్‌క్రాస్ సొసైటీకి అందుతాయని వెల్లడించింది.

English summary

భారత్‌కు వాల్‌మార్ట్ భారీ విరాళం: ఏమేమి ఇవ్వనుందంటే? | Walmart ready to donate oxygen generating plants and cryogenic containers to India

Walmart will donate up to 20 oxygen-generating plants and 20 cryogenic containers to India for the storage and transportation of the life-saving gas, and also provide USD 2 million to non-governmental organisations to help them fight the devastating surge in coronavirus cases.
Story first published: Saturday, May 1, 2021, 15:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X