For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టాటా కొత్త అడుగులు: టాటా గ్రూప్ సూపర్ యాప్‌లో వాల్‌మార్ట్ భారీ పెట్టుబడి!

|

సాల్ట్ నుండి సాఫ్టువేర్ వరకు వివిధ రంగాల్లో కీలకంగా ఉన్న టాటా గ్రూప్ సూపర్ యాప్‌ను రూపొందిస్తున్నట్లుగా గతంలోనే వార్తలు వచ్చాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ జియో ఈ-కామర్స్ డిజిటల్ రంగంలో కీలకంగా ఉన్నాయి. గత ఏడాది టాటా డిజిటల్ పేరుతో వ్యాపారాన్ని ప్రారంభించింది. తాజాగా, సూపర్ యాప్‌తో వస్తోంది. ఈ యాప్‌లో పెట్టుబడికి అంతర్జాతీయ దిగ్గజం వాల్‌మార్ట్ ఆసక్తిగా ఉందని తెలుస్తోంది. ఈ మేరకు టాటా గ్రూప్-వాల్‌మార్ట్ మధ్య చర్చలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి.

రిలయన్స్, అమెజాన్‌కు షాక్: టాటా 'సూపర్ యాప్', ఈ సేవలన్నీ అందుబాటులో..రిలయన్స్, అమెజాన్‌కు షాక్: టాటా 'సూపర్ యాప్', ఈ సేవలన్నీ అందుబాటులో..

25 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడి

25 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడి

టాటా గ్రూప్ ఈ-కామర్స్ రంగంలోకి అడుగు పెట్టేందుకు, తమ కొత్త డిజిటల్ ప్లాట్‌ఫాం పెట్టుబడుల కోసం పలువురు ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతోంది. ఇందులో భాగంగా టాటా గ్రూప్ సూపర్ యాప్‌లో 25 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు వాల్‌మార్ట్ఇంక్ చర్చలు జరుపుతోందని తెలుస్తోంది. ఈ 2 సంస్థలు జాయింట్ వెంచర్‌గా సూపర్ యాప్‌ను ప్రారంభించవచ్చునని భావిస్తున్నారు. టాటా ఈ-కామర్స్ వ్యాపారం, వాల్‌మార్ట్ ఈ-కామర్స్ యూనిట్ ఫ్లిప్‌కార్ట్ కలిసి ముందుకు సాగే అవకాశాలు ఉంటాయి.

వాటాల విక్రయం..

వాటాల విక్రయం..

ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ తన రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ విభాగం జియో ప్లాట్‌ఫాంలలో వాటాల విక్రయం ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు సమీకరించారు. ఫేస్‌బుక్, గూగుల్, కేకేఆర్ అండ్ కంపెనీ, సిల్వర్ లేక్ వంటి దిగ్గజ కంపెనీలు జియో ప్లాట్‌ఫాంలో పెట్టుబడులు పెట్టాయి. ఇన్వెస్టర్ల నుండి 20 బిలియన్ డాలర్ల మేర సేకరించింది. కాగా, టాటా గ్రూప్ కొత్త డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోని వాటాల అంశంపై చర్చలు జరుపుతున్నట్లుగా అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో టాటా సూపర్ యాప్‌లో వాల్‌మార్ట్ పెట్టుబడులు 20 బిలియన్ డాలర్ల నుండి 25 బిలియన్ డాలర్ల వరకు ఉండవచ్చునని చెబుతున్నారు.

సూపర్ యాప్

సూపర్ యాప్

డిసెంబర్ లేదా జనవరిలో దేశంలో సూపర్ యాప్ ప్రారంభం కానుంది. రిటైల్ రంగంలో విస్తృత ఉత్పత్తులు అందించే టాటా తమ డిజిటల్ వ్యాపారాలను ఒకే గొడుగు కిందకు కూడా తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. టాటా కన్స్యూమర్ బిజినెస్‌లో టైటాన్, ఫ్యాషన్ రిటైల్ ట్రెంట్ వంటివి ఉన్నాయి. తాజా వార్తల నేపథ్యంలో టాటా గ్రూప్ కంపెనీల షేర్లు కాస్త పుంజుకున్నాయి.

English summary

టాటా కొత్త అడుగులు: టాటా గ్రూప్ సూపర్ యాప్‌లో వాల్‌మార్ట్ భారీ పెట్టుబడి! | Walmart looks to join hands with Tata, May invest 25 billion dollars in Super app

Walmart Inc is in talks with Tata Group for a potential investment of up to $25 billion in the Indian salt to software conglomerate's new super app.
Story first published: Tuesday, September 29, 2020, 12:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X