For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మైక్రోసాఫ్ట్ తో కలిసి వాల్ మార్ట్ కూడా ... యూఎస్ లో టిక్ టాక్ కొనుగోలు కోసం రంగంలోకి

|

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూ ఎస్ లో నిషేధం విధించిన చైనీస్ ఎంటర్టైన్మెంట్ యాప్ టిక్‌టాక్‌ను కొనుగోలు చేయడానికి మైక్రోసాఫ్ట్ తో జతకట్టినట్లు అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ తెలిపింది. ఆగస్టు 6 న ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేసినప్పటి నుండి ఈ యాప్ పై వాషింగ్టన్ మరియు బీజింగ్ మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది.

 మైక్రోసాఫ్ట్ , వాల్ మార్ట్ భాగస్వామ్యంతో టిక్ టాక్ కొనుగోలు చర్చలు

మైక్రోసాఫ్ట్ , వాల్ మార్ట్ భాగస్వామ్యంతో టిక్ టాక్ కొనుగోలు చర్చలు

టిక్‌టాక్‌ ను యుఎస్ ఆధారిత సంస్థకు అమ్ముకోటానికి 90 రోజుల సమయాన్ని ఇచ్చింది. లేకుంటే యుఎస్‌లో కార్యకలాపాలపై నిషేధం అమలవుతుంది. ఒకేవేళ యూఎస్ లో కార్యాకలాపాలు కొనసాగించుకోవాలంటే తప్పనిసరిగా యూఎస్ కంపెనీకి అమ్ముకోవాల్సిందే. లేదంటే వ్యాపారం మూసివేయవలసి వస్తుంది అని పేర్కొంది. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్, వాల్ మార్ట్ భాగస్వామ్యంతో టిక్ టాక్ కొనుగోలు చెయ్యనున్నారని తెలుస్తుంది.

వాల్ మార్ట్ కు ఇది లాభించే అంశంగా విశ్లేషకుల అభిప్రాయం

వాల్ మార్ట్ కు ఇది లాభించే అంశంగా విశ్లేషకుల అభిప్రాయం

వాల్ మార్ట్ మరియు మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యం యుఎస్ టిక్ టాక్ వినియోగదారుల అంచనాలను రెండింటినీ తీర్చగలదని మేము విశ్వసిస్తున్నామని పేర్కొన్నారు . యువతను బాగా ఆకర్షిస్తున్న టిక్‌టాక్‌పై వాల్‌మార్ట్ ఆసక్తి చూపిస్తుందని విశ్లేషకులు తెలిపారు. గ్లోబల్‌డేటా రిటైల్ మేనేజింగ్ డైరెక్టర్ నీల్ సాండర్స్ ప్రకారం, యువకులు ఆన్‌లైన్‌లో లేదా వాల్‌మార్ట్ వద్ద షాపింగ్ చేసే అవకాశం చాలా తక్కువ. టిక్‌టాక్ వంటి సామాజిక వేదిక వాల్‌మార్ట్‌కు కావాల్సిన వినియోగదారులను సులభంగా ఆకర్షించగలదు మరియు ఆకర్షించాల్సిన అవసరం ఉంది అని సాండర్స్ చెప్పారు.

35 బిలియన్ డాలర్ల నుండి 40 బిలియన్ డాలర్ల వరకు కొనుగోలుకు యత్నం

35 బిలియన్ డాలర్ల నుండి 40 బిలియన్ డాలర్ల వరకు కొనుగోలుకు యత్నం

కరోనావైరస్ మహమ్మారి సమయంలో ఇ-కామర్స్ అమ్మకాలు పెరగడంతో వాల్ మార్ట్ తాజా త్రైమాసికంలో లాభాలను చవి చూసింది. అంతేకాదు యుఎస్ ప్రభుత్వ ఉద్దీపన చెల్లింపులు కూడా కాస్త సపోర్ట్ గా నిలిచి కంపెనీ లావాదేవీలను పెంచాయని కంపెనీ ఇటీవల నివేదించింది. యుఎస్ టెక్నాలజీ కోలోసస్‌తో మైక్రోసాఫ్ట్ జట్టుకట్టడం మైక్రోసాఫ్ట్ టిక్‌టాక్ యొక్క యుఎస్ కార్యకలాపాలను 35 బిలియన్ డాలర్ల నుండి (సుమారు రూ. 258,405 కోట్లు) 40 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 295,260 కోట్లు) కొనుగోలు చెయ్యటానికి మైక్రోసాఫ్ట్ ప్రయత్నం చేస్తుందని తెలుస్తుంది .

సాంకేతిక పరిజ్ఞానం , గోప్యత విషయంలో జాగ్రత్తలు .. చర్చలపై ఆసక్తి

సాంకేతిక పరిజ్ఞానం , గోప్యత విషయంలో జాగ్రత్తలు .. చర్చలపై ఆసక్తి

ఒప్పందం చర్చలు జరపడానికి ముందే అనేక సాంకేతిక పరిజ్ఞానం మరియు డేటా గోప్యతా సమస్యల నేపధ్యంలో మైక్రోసాఫ్ట్ తో బైట్‌డాన్స్ చర్చలపై ఆసక్తి నెలకొంది. వాషింగ్టన్, బీజింగ్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో తాను కంపెనీ నుంచి తప్పుకున్నట్లు టిక్‌టాక్ సీఈఓ కెవిన్ మేయర్ బుధవారం తెలిపారు. మాజీ డిస్నీ ఎగ్జిక్యూటివ్ మేయర్, మే నుండి మాత్రమే ఈ పదవిలో ఉన్నారు, ఇటీవలి వారాల్లో రాజకీయ వాతావరణ తీవ్రత దృష్ట్యా ఆయన రాజీనామా చేసినట్టు తెలుస్తుంది.

Read more about: walmart microsoft buy tiktok us
English summary

మైక్రోసాఫ్ట్ తో కలిసి వాల్ మార్ట్ కూడా ... యూఎస్ లో టిక్ టాక్ కొనుగోలు కోసం రంగంలోకి | Walmart also teamed up with Microsoft to enter the field to buy Tik Tok in the US

US retail giant Walmart said that it had teamed with Microsoft to buy TikTok, the Chinese-owned short-form video app that has come under fire from the administration of President Donald Trump.
Story first published: Friday, August 28, 2020, 14:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X