For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

US Recession: అప్రమత్తమైన యూఎస్ మార్కెట్లు.. ఆర్థిక సంక్షోభం దగ్గర పడిందా..? ఆ తప్పే కారణమా..?

|

US Recession: నెలల తరబడి తన అప్పులు డిఫాల్ట్ అయ్యే పరిస్థితులపై అమెరికా ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. అయితే ఇప్పుడు దీనిపై శ్రద్ధ పెట్టడం వాల్ స్ట్రీట్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏ క్షణంలో మార్కెట్లు కుప్పకూలతాయో తెలియని పరిస్థితులు అక్కడ కొనసాగుతున్నాయి.

ఆ క్రమంలో అమెరికా రుణ పరిమితిని పెంచమని జో బైడెన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను మాంద్యంలోకి నెట్టగల సంభావ్య ముప్పు గురించి ఇప్పుడు ఆందోళనలు పెరుగుతున్నాయి. 2011లో కంటే ఇప్పుడు ఆందోళనలు పెరిగాయని గోల్డ్ మాన్ సాక్స్ ఆర్థిక వేత్త అలెక్ ఫిలిప్స్ అన్నారు.

Wall street investors in fear of debt default and Recession amid debt sealing not increased

అమెరికా మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు డిఫాల్ట్ పరిస్థితులపై ఎలా స్పందిస్తారనేది కీలకమైనది. ఎందుకంటే వారు ప్రభుత్వం విక్రయించే ట్రెజరీ సెక్యూరిటీలను కొనుగోలు చేసి భారీ రుణానికి ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఒకవేళ వారు మార్కెట్లకు దూరంగా జరిగితే.. వడ్డీ రేట్లు విపరీతంగా పెరిగి ప్రభుత్వాన్ని, వ్యాపారాలను, వినియోగదారులను కుంగదీస్తాయని నిపుణులు భావిస్తున్నారు.

2011 సంక్షోభం నుంచి పాఠాలు నేర్చుకున్న చాలా మంది ఇన్వెస్టర్లలో ఈ సారి నమ్మకం సన్నగిల్లుతోంది. అమెరికాలో రుణ పరిమితిపై ప్రస్తుతం చర్చలు ఎక్కడా జరగటం లేదు. అయితే చివరి క్షణాల్లో ఖచ్చితంగా దీనిపై నిర్ణయం వెలువడవచ్చని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ స్టిఫెల్‌లో చీఫ్ వాషింగ్టన్ పాలసీ స్ట్రాటజిస్ట్ బ్రియాన్ గార్డనర్ తెలిపారు.

గడచిన దశాబ్దకాలంగా అమెరికా డిఫాల్ట్ కు గురికాకుండా చేస్తున్న ఇన్సూరెన్స్ ఖర్చులు పెరిగాయని JP మోర్గాన్ విశ్లేషకులు చెబుతున్నారు. యూఎస్ ప్రభుత్వానికి పన్ను అదాయం భారీగా తగ్గిందని గోల్డ్ మాన్ సాక్స్, వెల్స్ ఫాల్గొకు చెందిన నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా మార్కెట్లలోని ఇన్వెస్టర్లు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

Read more about: wall street us recession
English summary

US Recession: అప్రమత్తమైన యూఎస్ మార్కెట్లు.. ఆర్థిక సంక్షోభం దగ్గర పడిందా..? ఆ తప్పే కారణమా..? | Wall street investors in fear of debt default and Recession amid debt sealing not increased

Wall street investors in fear of debt default and Recession amid debt sealing not increased
Story first published: Wednesday, April 26, 2023, 10:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X