For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

18-45 ఏళ్ల వారికి వాక్-ఇన్ వ్యాక్సినేషన్ లేదు, ఇలా రిజిస్ట్రేషన్

|

దేశంలో అత్యవసర వినియోగం కింద కరోనా టీకాలను అందుబాటులోకి తీసుకు వచ్చిన కేంద్రం జనవరి 16వ తేదీ నుండి వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించింది. మొదటి దశలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ సిబ్బందికి, ఆ తర్వాత 60 ఏళ్లు నిండిన వారికి, అనంతరం 45 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సీన్ ఇచ్చారు. ఏప్రిల్ 1వ తేదీ నుండి 45 ఏళ్లు నిండిన వ్యక్తులకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు. ఇక మే 1వ తేదీ నుండి 18 ఏళ్ళ నుండి 44 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సీన్ అందించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఏప్రిల్ 28వ తేదీ నుండి కొ-విన్ వెబ్ సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి.

బిట్ కాయిన్ క్రాష్: జోబిడెన్ 'ట్యాక్స్' ఎఫెక్ట్, క్రిప్టోకరెన్సీ పతనంబిట్ కాయిన్ క్రాష్: జోబిడెన్ 'ట్యాక్స్' ఎఫెక్ట్, క్రిప్టోకరెన్సీ పతనం

అందుకే రిజిస్ట్రేషన్

అందుకే రిజిస్ట్రేషన్

18-44 ఏళ్ల వయస్సు వారికి వాక్-ఇన్ వ్యాక్సినేషన్ అందుబాటులో ఉండటం లేదు. ఎందుకంటే వ్యాక్సీన్ కేంద్రాల వద్ద గందరగోళాన్ని, రద్దీని తగ్గించే ఉద్దేశ్యంలో భాగంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ప్రస్తుతం 45 ఏళ్లు, ఆ పైన వయస్సు కలిగిన వారికి వ్యాక్సినేషన్ కోసం ఇప్పటికీ ఆన్-సైట్ రిజిస్ట్రేషన్ ఉంది. అయితే మే 1 నుండి ప్రారంభమయ్యే 18-44 ఏజ్ గ్రూప్ వ్యాక్సినేషన్‌కు రిజిస్ట్రేషన్ ఉంది. కో-విన్ ప్లాట్‌ఫామ్ లేదా ఆరోగ్య సేత యాప్ ద్వారా ఏప్రిల్ 28వ తేదీ నుండి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది.

కోట్లాది మంది

కోట్లాది మంది

మరో రోజులో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. వ్యాక్సీన్ తీసుకోవాలనుకునే వాళ్లు ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి, తేదీని నిర్ణయించుకోవచ్చు. దగ్గరలోని టీకా కేంద్రానికి వెళ్లి టీకా వేసుకోవాలి. దేశంలో 18 ఏళ్లు దాటిన వారి సంఖ్య 90 కోట్ల వరకు ఉంటుంది. ఇందులో 45 ఏళ్లు దాటిన వారు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు దేశంలోని 13 కోట్ల మందికి కనీసం ఒక్క డోస్ కూడా వేశారు. మరో 500-600 మిలయన్ల మంది టీకా కోసం నమోదు చేసుకున్నారు.

ఇప్పటికే టీకా కొరత

ఇప్పటికే టీకా కొరత

ఇప్పటికే టీకా కొరత ఎదుర్కొంటున్నారు. 18-44 ఏళ్ల వయస్సు వారికి కూడా టీకా అందిస్తే అప్పుడు మరింత ఇబ్బందులు ఎదురుకావొచ్చునని భావిస్తున్నారు. జూలై లోపు అనుకున్న సంఖ్యలో టీకాలను అందచేయడం కష్టమని వ్యాక్సీన్ తయారీ సంస్థలు అంటున్నాయి.

ఇలా రిజిస్ట్రేషన్

ఇలా రిజిస్ట్రేషన్

మొదట కోవిన్ డాట్ గవ్ ఇన్ లోకి లాగిన్ కావాలి.

మొబైల్ నెంబర్ ఎంట్రీ చేశాక ఓటీపీ వస్తుంది.

ఓటీపీని ఎంటర్ చేశాక వెరిఫై బటన్ క్లిక్ చేయాలి. ఒకే అయితే రిజిస్ట్రేషన్ ఆఫ్ వ్యాక్సినేషన్ పేజీ ఓపెన్ అవుతుంది.

ఈ పేజీలో ఫోటోతో కూడిన గుర్తింపు కార్డు, పేరు, పుట్టిన తేదీ తదితర వివరాలు నమోదు చేయాలి.

రిజిస్టర్ బటన్ పైన క్లిక్ చేయాలి.

రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక టీకా వేయించుకునేందుకు తేదీని ఎంపిక చేసుకునే సౌలభ్యం ఉంటుంది. ఇందుకు పక్కనే ఉన్న షెడ్యూల్ బటన్ పైన క్లిక్ చేయాలి.

పిన్ కోడ్ ఎంటర్ చేసి, సెర్చ్ చేస్తే మీ పరిధిలోకి టీకా కేంద్రాల జాబితా వస్తుంది. వాటి ఆధారంగా తేదీ, సమయం ఎంచుకొని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒక్క లాగిన్ పైన నలుగురికి అపాయింటుమెంట్ తీసుకోవచ్చు. తేదీలను మార్చుకునే వెసులుబాటు ఉంది. ఆరోగ్య సేతు యాప్‌లోను రిజిస్టర్ చేసుకోవచ్చు.

English summary

18-45 ఏళ్ల వారికి వాక్-ఇన్ వ్యాక్సినేషన్ లేదు, ఇలా రిజిస్ట్రేషన్ | Walk in vaccination for age group 18-45 not allowed

The government has made it mandatory for the 18-44 age group to register themselves on the CoWIN portal and get an appointment for vaccination against coronavirus, saying walk-ins will not be allowed initially to avoid a "chaos" at immunisation centres once the inoculations drive opens up substantially.
Story first published: Monday, April 26, 2021, 13:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X