For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Hyderabad: ఐటీ డెస్టినేషన్‌గా హైదరాబాద్.. కొత్తగా 10,000 కొలువులు..

|

Hyderabad: గ్లోబల్ పెట్టుబడులకు హైదరాబాద్ ఆకర్షనీయ నగరంగా మారిపోయింది. బైన్ క్యాపిటల్ యాజమాన్యంలోని VXI గ్లోబల్ సొల్యూషన్స్ హైదరాబాద్ మహానగరంలో డెలివరీ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ నిర్ణయం ద్వారా దాదాపు 10,000 మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

ఈ క్రమంలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు గ్లోబల్‌ చీఫ్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ ఆఫీసర్‌ ఎరికా బోగర్‌ కింగ్‌తో సమావేశమయ్యారు. గడచిన తొమ్మిదేళ్ల కాలంలో తెలంగాణ పెట్టుబడులకు ఆకర్షనీయ నగరంగా మారిందని కేటీఆర్ వివరించారు. గత ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా ఐటీ పరిశ్రమలో 4.50 లక్షల ఉద్యోగాల కల్పన జరిగితే వాటిలో 1.5 లక్షల ఉద్యోగాలు కేవలం హైదరాబాద్‌లోనే జరిగాయని వెల్లడించారు.

VXI global solutions

తాజాగా VXI పెట్టుబడుల ప్రకటన నగరాన్ని ఐటీ కంపెనీలు, ఉద్యోగార్థులకు ఇష్టమైన గమ్యస్థానంగా కొనసాగేలా చేస్తుందని కేటీఆర్ వెల్లడించారు. కంపెనీ వ్యాపారం, ఉపాధి అవకాశాలకు సంబంధించిన వివరాలను మంత్రి తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.

కంపెనీ కస్టమర్ ఎక్స్పీరియన్స్, కస్టమర్ కేర్ సేవలు అందించటంలో VXI గ్లోబల్ సొల్యూషన్స్ తన వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ఈ ప్రముఖ కంపెనీకి ప్రపంచ వ్యాప్తంగా మెుత్తం 43 ఆఫీసుల్లో దాదాపు 40,000 మంది ఉద్యోగులు ఉన్నారు. తాజా పరిణామాలతో తెలుగు రాష్ట్రాల్లోని యువత ఐటీ సేవల రంగంలో హైదరాబాద్ తమకు ఉపాధి అవకాశాలను కల్పించగలదని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారి భవిష్యత్తుకు ఈ కంపెనీలు మంచి అవకాశాలను కల్పిస్తాయని భావిస్తున్నారు.

English summary

Hyderabad: ఐటీ డెస్టినేషన్‌గా హైదరాబాద్.. కొత్తగా 10,000 కొలువులు.. | VXI global solutions to start delivery center in hyderabad generates 10000 new jobs

VXI global solutions to start delivery center in hyderabad generates 10000 new jobs
Story first published: Monday, May 22, 2023, 22:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X