For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మరో నెల రోజుల పాటు చకన్ ప్లాంట్ మూసివేయనున్న వోక్స్‌వ్యాగన్

|

ముంబై: స్కోడా ఆటో వోక్స్ వ్యాగన్ ఇండియా మిడ్ డిసెంబర్ నుంచి మిడ్ జనవరి వరకు తన ఉత్పత్తిని నిలుపుదల చేయనుంది. ఇటీవలి కాలంలో ఆటో సేల్స్ భారీగా తగ్గిపోయిన విషయం తెలిసిందే. దసరా, దీపావళి పండుగ సందర్భంగా ఇటీవలి కాలంలో కాస్త పెరిగాయి. ఏడాదికి పైగా సేల్స్ లేకపోవడంతో ఉత్పత్తిని తగ్గించి ఉన్న ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. పలు కంపెనీలు తమ పరిశ్రమలను తాత్కాలికంగా మూసివేశాయి.

పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా.. ఇది మీకోసమే!పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా.. ఇది మీకోసమే!

స్కోడా ఇప్పటికే మిడ్ అక్టోబర్ నుంచి మిడ్ నవంబర్ మధ్య చకన్ ప్లాంట్‌ను మూసివేసింది. కంపెనీ ఎగుమతి మార్కెట్ మందగించింది. డొమెస్టిక్ వ్యాల్యూమ్స్ దశాబ్ద కనిష్టానికి చేరుకున్నాయి.

Volkswagen to keep its Chakan plant shut for another month

1 లక్ష యూనిట్ల వరకు వ్యాల్యూమ్ డెలివరీ చేయాలని స్కోడా ఆటో వోక్స్ వ్యాగన్ (వోక్స్ వ్యాగన్ ఇండియా) భావించింది. కానీ 2019 ఏడాదికి గాను యాన్యువల్ టార్గెట్‌ను 15 శాతం తగ్గించి 85,000కు పరిమితం చేసిందట.

ప్రపంచవ్యాప్తంగా మోడ్యులర్ MQB ఆర్కిటెక్చర్‌ను పరిచయం చేస్తుండటంతో పాటు ఓల్డ్ జనరేషన్ PQ25 వంటి వాటికి డిమాండ్ తగ్గిందని, గ్లోబల్ ప్రొడక్షన్‌తో సమాంతరంగా MQB లైన్‌ను త్వరగా అందుకోవాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.

భారతీయ పాసింజర్ వెహికిల్స్ మార్కెట్ రెండు దశాబ్దాల్లో కనిష్టానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో ప్లాంటును ప్రస్తుతం మూసివేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ ఏడాది ఎగుమతులు 3 శాతం పెరుగుదలతో బాగానే ఉన్నప్పటికీ వోక్స్ వ్యాగన్ ఇండియా షిప్‌మెంట్ ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య 11 శాతం తగ్గడం గమనార్హం. న్యూజనరేషన్ MQBకి వెళ్లాలని భావిస్తోంది. కంపెనీ నెక్స్ట్ జనరేషన్ ఉత్పత్తులపై దృష్టి సారించినట్లుగా కంపెనీకి చెందిన ప్రతినిధి చెప్పినట్లుగా ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి.

కంపెనీ అమియో సబ్ 4 మీటర్ సెడాన్ కారు ఉత్పత్తులను ఇప్పటికే నిలిపివేసినట్లుగా తెలుస్తోంది. వివిధ మోడల్స్‌ను అప్ గ్రేడ్ చేస్తోంది. వోక్స్ వ్యాగన్ మంత్లీ సేల్స్ సగటున 2500 యూనిట్లు తగ్గిపోయాయి. 2019 జనవరి నుంచి అక్టోబర్ వరకు 15 శాతం తగ్గుదల నమోదయింది. వోక్స్ వ్యాగన్ ఇండియా 18 శాతం తగ్గి 25,000కు చేరుకున్నాయి.

English summary

మరో నెల రోజుల పాటు చకన్ ప్లాంట్ మూసివేయనున్న వోక్స్‌వ్యాగన్ | Volkswagen to keep its Chakan plant shut for another month

Skoda Auto Volkswagen India has decided to shut down production from mid-December to mid-January, a second month-long ‘no production’ period is unprecedented in the Indian auto sector. Earlier, it had shut its Chakan plant for a month from mid-October to mid-November.
Story first published: Tuesday, November 26, 2019, 12:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X