For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2021లో మొబైల్ ఛార్జీల మోత, భారీగా పెరగనున్న టారిఫ్! వీఐ బాటలో ఎయిర్‌టెల్

|

టెలికం కంపెనీలు ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా(vi), రిలయన్స్ జియో త్వరలో టారిఫ్ పెంచే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత టారిఫ్‌లపైన ఎయిర్‌టెల్ గతంలో పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసింది. వొడాఫోన్ ఐడియా టారిఫ్ పెంచుతుందని వార్తలు వచ్చాయి. ఈ డిసెంబర్ నాటికి లేదా 2021 ప్రారంభంలో 15 శాతం నుండి 20 శాతం టారిఫ్ పెంచే అవకాశాలు ఉన్నాయి. ఎయిర్‌టెల్, జియోల కంటే ముందే టారిఫ్ పెంచేందుకు వెనుకాడే పరిస్థితి లేదని సెప్టెంబర్ త్రైమాసికం ఫలితాల సమయంలో వొడాఫోన్ ఐడియా తెలిపింది.

గుడ్‌న్యూస్, ఆస్తి పన్నులో సగం మాఫీ: ఇప్పటికే చెల్లిస్తే ఎలా, పరిమితి ఎంత?గుడ్‌న్యూస్, ఆస్తి పన్నులో సగం మాఫీ: ఇప్పటికే చెల్లిస్తే ఎలా, పరిమితి ఎంత?

వొడాఫోన్ ఐడియా టారిఫ్ పెంపు

వొడాఫోన్ ఐడియా టారిఫ్ పెంపు

ప్రస్తుతానికి టారిఫ్ పెంపుపై ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో మౌనంగా ఉన్నాయి. కానీ తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న వొడాఫోన్ ఐడియా మాత్రం పెంపుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతోంది. ఇప్పటికే వొడాఫోన్ ఐడియా పెద్ద ఎత్తున చందాదారులను ప్రత్యర్థులకు కోల్పోతోంది. కస్టమర్ల పరంగా అగ్రస్థానంలో ఉన్న Viని జియో దాటేసింది. ఫ్లోర్ ధరలను నిర్ణయించడానికి రెగ్యులేటర్ కోసం టెల్కోస్ వేచి చూస్తున్నాయని, అయితే కంపెనీ (Vi) ధరలు పెంచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

టారిఫ్ పెంపు 15 శాతం

టారిఫ్ పెంపు 15 శాతం

ఇటీవల వొడాఫోన్ ఐడియా త్రైమాసిక ఫలితాలు, ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే టారిఫ్ పెంపు అనివార్యమని చెబుతున్నారు. గత ఏడాది నవంబర్ తర్వాత టారిఫ్ పెంపును ప్రకటించే మొదటి టెల్కో వొడాఫోన్ ఐడియా అవుతుంది. రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ టారిఫ్ పెంపుపై వేచి చూసే ధోరణిని అవలంభిస్తున్నాయని, పెంచడం మాత్రం ఖాయమని అంటున్నారు. Vi మాత్రం ఇప్పటికే టారిఫ్ పెంపుకు సంబంధించి అంతర్గతంగా చర్చలు జరిపిందని చెబుతున్నారు. క్రితంసారి వొడాఫోన్ ఐడియా 14 శాతం పెంచిందని, ఈసారి 15 శాతం పెరగవచ్చునని టెలికం రంగ నిపుణులు అంటున్నారు.

అది ఇబ్బందికరమే...

అది ఇబ్బందికరమే...

వొడాఫోన్ ఐడియా ఇప్పటికే పెద్ద ఎత్తున చందాదారులను కోల్పోతోంది. ఆగస్ట్ 20న ట్రాయ్ విడుదల చేసిన డేటా ప్రకారం పది లక్షల మంది కస్టమర్లను కోల్పోయింది. టారిఫ్ పెంపుకు ముందు వొడాఫోన్ ఐడియా దీనిని గుర్తు పెట్టుకోవాలని అంటున్నారు. ఎయిర్ టెల్, జియోలు టారిఫ్ పెంపును ప్రస్తుతానికి పక్కన పెడితే, వొడాఫోన్ ఐడియా పెంచితే మరింతమంది కస్టమర్లు వెళ్లిపోయే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. మూడు టెల్కోలు టారిఫ్ పెంచితే అప్పుడు ఇబ్బందులు ఉండవని అంటున్నారు. ఎయిర్ టెల్ కూడా టారిఫ్స్ అసంతృప్తితో ఉంది. పెంచితేనే టెల్కోలు మనగలవని పేర్కొంది.

English summary

2021లో మొబైల్ ఛార్జీల మోత, భారీగా పెరగనున్న టారిఫ్! వీఐ బాటలో ఎయిర్‌టెల్ | VI tariffs likely to see 15 to 20 percent hike very soon

Supporting earlier rumours of Vodafone Idea’s tariff hike, a new report by ET Telecom now says the struggling telco might raise the tariff prices by 15-20%.
Story first published: Tuesday, November 17, 2020, 7:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X