For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Vehicle Sales: ఫిబ్రవరిలో దంచికొట్టిన వాహన విక్రయాలు.. FADA ప్రకారం..

|

Vehicle Sales: ఏడాది ప్రాతిపదికన ఫిబ్రవరి 2023లో మొత్తం వాహన రిటైల్ అమ్మకాలు 16% పెరిగాయి. అయితే అమ్మకాలు ఫిబ్రవరి 2020కి కరోనా కంటే ముందు కాలంతో పోల్చితే 8 శాతం తక్కువగానే ఉన్నాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) వెల్లడించింది.

అమ్మకాల్లో గ్రోత్..

అమ్మకాల్లో గ్రోత్..

FADA గణాంకాల ప్రకారం ద్విచక్ర వాహనాల వృద్ధి 15 శాతంగా ఉండగా.. 3-చక్రాల వాహనాలు మాత్రం రికార్డు స్థాయిలో 81 శాతం అమ్మకాల వృద్ధిని నమోదు చేశాయి. ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 11 శాతం వృద్ధి చెందగా.. ట్రాక్టర్ల అమ్మకాలు 14 శాతం, వాణిజ్య వాహనాల విక్రయాలు 17 ఏడాది ప్రాతిపదికన పెరిగాయని వెల్లడైంది.

పెరుగుదల కారణాలు..

పెరుగుదల కారణాలు..

ద్విచక్ర వాహనాల విషయంలో పెళ్లిళ్ల సీజన్ ముఖ్య పాత్ర పోషించగా.. త్రీవీలర్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన సబ్సిడీలు భారీ వృద్ధికి ఊతం అందించాయని వెల్లడైంది. దీనికి తోడు దూకుడు ఫైనాన్స్ స్కీమ్స్ కూడా సహాయకారిగా నిలిచాయని FADA వెల్లడించింది. గ్రామీణ మార్కెట్ పుంజుకోనప్పటికీ.. ప్యాసింజర్ వాహనాల విషయంలో స్వల్ప వృద్ధి నమోదైంది.

గ్రామీణ డిమాండ్ కీలకం..

గ్రామీణ డిమాండ్ కీలకం..

వాహన విక్రయాల్లో చాలా కీలకమైనది గ్రామీణ డిమాండ్. అయితే ప్రస్తుతం దేశంలో ద్రవ్యోల్బణం కారణంగా గ్రామీణ రంగం ఖర్చు చేయలేకపోవడం ఆటోమొబైల్ విక్రయాలకు కీలకమైన నిరోధకమని FADA తెలిపింది. దీనికి తోడు అమెరికా ప్రభుత్వ వాతావరణ సంస్థ, నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్, ఈ నెల ప్రారంభంలో దాని అంచనాలో ఎల్‌నినో జూన్ నాటికి తిరిగి వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. నైరుతి రుతుపవనాలు కేరళ తీరం మీదుగా అస్తమించాయి. ఇది సాధారణ రుతుపవనాలకు ముప్పుగా పరిణమిస్తుంది. తద్వారా ముందుకు సాగుతున్న ఆటోమొబైల్ అమ్మకాలపై ప్రభావం చూపుతుందని అసోసియేషన్ తెలిపింది.

రానున్న కాలంలో..

రానున్న కాలంలో..

మార్చి నెలలో హోలీ, ఉగాది, గుడి పడ్వా మొదలైన పండుగలు ఉంటాయి. ఇవి అమ్మకాలను పెంచటానికి దోహదపడవచ్చని ఆటో రంగం నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి తోడు వాహనాల మెరుగైన లభ్యత, ఆర్థిక సంవత్సరం చివరి నెల కావటం, ఏప్రిల్ నుంచి OBD నిబంధనల్లో మార్పులు వంటివి వాహన ధరలను పెంచుతుంది. ఇలాంటి కారణాల వల్ల వాహనాల విక్రయాలు అధికంగా నమోదు కావచ్చని తెలుస్తోంది. అయితే వాతావరణ శాఖ విడుదల చేసే వివరాలు వచ్చే వరకు జాగ్రత్తగా ఉండాలని FADA వెల్లడించింది.

English summary

Vehicle Sales: ఫిబ్రవరిలో దంచికొట్టిన వాహన విక్రయాలు.. FADA ప్రకారం.. | Vehicle sales recorded 16 percent growth on YOY basis, rural demand not revived know details

Vehicle sales recorded 16 percent growth on YOY basis, rural demand not revived know details
Story first published: Monday, March 6, 2023, 19:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X