For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Vehicle Sales 2022: ఫిబ్రవరి నెలలో వాహన విక్రయాలు ఎలా ఉన్నాయంటే?

|

సెమీ కండక్టర్ల కొరత కారణంగా వాహనాల సేల్స్ తగ్గినప్పటికీ, జనవరి నెలతో పోలిస్తే మాత్రం పుంజుకున్నాయి. కొన్ని కంపెనీల సేల్స్ పెరగగా, మరిన్ని కంపెనీల సేల్స్ తగ్గాయి. ప్రధానంగా చిప్ ఇబ్బందులు కనిపించాయి. మారుతీ, హ్యుండాయ్, హోండా, టయోటా సేల్స్ నిరాశపరచగా, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, స్కోడా, ఎంజీ మోటార్స్ సేల్స్ పెరిగాయి. ద్విచక్ర వాహనాల సేల్స్ క్షీణించాయి. అదే సమయంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యత పెరిగింది.

ఫిబ్రవరి నెలలో మారుతీ సుజుకీ సేల్స్ 1.40 లక్షలుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే కాలంలో 1.52 లక్షలుగా నమోదయ్యాయి. అంటే 8.46 శాతం క్షీణించింది. హ్యుండాయ్ ఇండియా మోటార్ స్టాక్స్ 51,600 నుండి దాదాపు 15 శాతం క్షీణించి 44,050కి పడిపోయాయి. మహీంద్రా సేల్స్ 28,777 నుండి 89 శాతం పెరిగి 54,455కి పెరిగాయి. టాటా మోటార్స్ సేల్స్ 58,366 యూనిట్ల నుండి 27 శాతం పెరిగి 3,875 యూనిట్లకు పెరిగాయి.

 Vehicle Sales 2022: Maruti Suzuki sales declined while Tata, Mahindra recorded growth

ద్విచక్ర వాహ సేల్స్ భారీగా తగ్గాయి. హీరో మోటో కార్ప్ సేల్స్ 29 శాతం క్షీణించి 5,05,467 నుండి 3,58,245కు తగ్గాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ 15 శాతం, టీవీఎస్ మోటార్స్ 5 శాతం, హోండా మోటార్ సైకిల్ 29 శాతం తగ్గాయి. సుజుకీ మోటార్ మాత్రం దాదాపు స్థిరంగా ఉంది.

English summary

Vehicle Sales 2022: ఫిబ్రవరి నెలలో వాహన విక్రయాలు ఎలా ఉన్నాయంటే? | Vehicle Sales 2022: Maruti Suzuki sales declined while Tata, Mahindra recorded growth

2022 is being touted as the year of revival for the Indian automobile industry that has been grappling with sales slowdown since 2019. And despite challenges like chip shortage that has affected production and deliveries of vehicles, the buying intent among customers remains strong, as indicated by the bookings received by carmakers.
Story first published: Wednesday, March 2, 2022, 14:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X