For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Vedanta: ఆ బ్యాంకుకు భారీ రుణం చెల్లించిన వేదాంత రిసోర్సెస్.. ఎవరికి, ఎంత పే చేసిందంటే..

|

Vedanta: బిలియనీర్ అనిల్ అగర్వాల్ కు చెందిన వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ ఓ కీలక ప్రకటన చేసింది. తమకు సంబంధించిన పెద్ద మొత్తం రుణాన్ని తిరిగి చెల్లించినట్లు పేర్కొంది. మొత్తం 800 మిలియన్ డాలర్ల విలువైన అప్పులు తీర్చినట్లు వెల్లడించింది. వడ్డీ రేట్లు పెరిగిన తర్వాత కంపెనీ లిక్విడిటీ గురించి ఆందోళన నెలకొన్న తరుణంలో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.

లండన్‌ కు చెందిన మూడు సంస్థలకు వేదాంత రుణాలు తిరిగి చెల్లించినట్లు తెలిపింది. వీటిని లండన్ మరియు హాంకాంగ్‌ లోని స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ నుంచి తీసుకున్నట్లు కంపెనీ తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ‌లో వివరించింది. ఈ రీపేమెంట్స్ వల్ల తమ అనుబంధ యూనిట్ వేదాంత లిమిటెడ్ షేర్లపై ఉన్న భారం కొంత మేరకు తీరినట్లయింది. గత నెలలోనూ చెల్లించాల్సిన అన్ని రుణాలు మరియు బాండ్లను పే చేసి, స్థూల రుణాన్ని 6.8 బిలియన్ డాలర్లకు తగ్గించుకుంది.

Vedanta Resources repays dollar 800 Mn loans

వేదాంత రిసోర్సెస్ దాని భారతీయ యూనిట్ల నుంచి రానున్న భారీ డివిడెండ్‌ లపై ఆధారపడింది. చెల్లింపు తేదీ దగ్గరపడిన రుణాల పేమెంట్స్ కోసం గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు మొత్తాలను తీసుకుంది. అయితే ఈ నెలలో డాలర్ నోట్లను ఎలా మేనేజ్ చేస్తుందోనని మార్కెట్ వర్గాలు గమనిస్తున్నాయి.

దీనికితోడు 2024లో మెచ్యూర్ కానున్న దాదాపు 2 బిలియన్ డాలర్ల బాండ్‌లు రూపంలో మరో పెద్ద రుణం రాబోతున్న తరుణంలో కంపెనీ ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయోనని పలువురు దృష్టి సారిస్తున్నారు.

English summary

Vedanta: ఆ బ్యాంకుకు భారీ రుణం చెల్లించిన వేదాంత రిసోర్సెస్.. ఎవరికి, ఎంత పే చేసిందంటే.. | Vedanta Resources repays dollar 800 Mn loans

Vedanta Resources repays $800 Mn loans.
Story first published: Sunday, May 7, 2023, 7:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X