For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Vedanta: రూ.లక్ష ల్యాప్‌టాప్ కేవలం రూ.40 వేలకే.. వేదాంత ఛైర్మన్ అనిల్ అగర్వాల్ కీలక వ్యాఖ్య..

|

Vedanta: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, చైనా-తైవాన్ పరిణామాలు ఇప్పుడు భారతదేశానికి కొత్త వ్యాపార అవకాశాన్ని కల్పించాయి. ప్రపంచ వ్యాప్తంగా చిప్ షార్టేజ్ తీర్చేందుకు భారత వ్యాపారవేత్తలు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా దేశీయ దిగ్గజం వేదాంత కంపెనీ ఫాక్స్‌కాన్‌తో కలిసి కంపెనీ కొత్త సెమీకండక్టర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా..

మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా..

రెండు కంపెనీలు సంయుక్తంగా తయారీ పరిశ్రమను గుజరాత్‌లో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించాయి. ఇందుకోసం రూ.1.54 లక్షను వెచ్చిస్తున్నట్లు వేదాంత ఛైర్మన్ అనిల్ అగర్వాల్ ప్రకటించారు. దీనిని 'మేడ్ ఇన్ ఇండియా' సెమీకండక్టర్లుగా మారడం వల్ల వస్తువుల ధరలపై పెద్ద ప్రభావం చూపుతుందని CNBC-TV18తో మాట్లాడుతూ అనిల్ అగర్వాల్ తెలిపారు. దిగుమతి ఖర్చులు తగ్గుతాయి కాబట్టి.. ఉత్పత్తుల ధరలు సగానికిపైగా తగ్గుతాయని అన్నారు.

ల్యాప్‌టాప్ ధరలపై..

ప్రస్తుతం ల్యాప్‌టాప్ ధర రూ.లక్షగా ఉందని అనిల్ అగర్వాల్ అన్నారు. అయితే దేశంలో గ్లాస్ అండ్ సెమీకండక్టర్ చిప్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత, దాని ధర రూ.40,000 లేదా అంతకంటే తక్కువకు చేరుకుంటుందని అనిల్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. ఈ ప్లాంట్‌ ఏర్పాటు వల్ల.. ప్రస్తుతం తైవాన్‌, కొరియాలో తయారవుతున్న గ్లాస్‌ను త్వరలో భారత్‌లో తయారు చేయనున్నట్టు ఆయన తెలిపారు.

ఎలక్ట్రానిక్స్ తయారీ వెంచర్..

ఎలక్ట్రానిక్స్ తయారీ వెంచర్..

మొబైల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రిక్ వాహనాల (EV) వంటి ఉత్పత్తులను లక్ష్యంగా చేసుకుని మహారాష్ట్రలో కూడా వేదాంత కేంద్రాలను విస్తరించనున్నట్లు అగర్వాల్ తెలిపారు. ఈ జాయింట్ వెంచర్ కోసం నిధులపై ఆందోళన లేదని అగర్వాల్ అన్నారు. ఈ ప్రాజెక్ట్ లో Foxconn 38 శాతం పెట్టుబడి కలిగి ఉంటుందని వెల్లడించారు. సెప్టెంబర్ 12న గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సమక్షంలో.. వేదాంత, ఫాక్స్‌కాన్ గుజరాత్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ వార్తతో వేదాంత షేర్లు రాకెట్ లాగా దూసుకుపోతున్నాయి.

English summary

Vedanta: రూ.లక్ష ల్యాప్‌టాప్ కేవలం రూ.40 వేలకే.. వేదాంత ఛైర్మన్ అనిల్ అగర్వాల్ కీలక వ్యాఖ్య.. | Vedanta chairman anil agarwal said one lakh worth laptop vailable at 40000 with their semiconductor plant

Vedanta chairman anil agarwal said one lakh worth laptop vailable at 40000 with their semiconductor plant
Story first published: Thursday, September 15, 2022, 10:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X